India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉట్నూర్ ఏఎస్పీగా ఉన్న కాజల్ సింగ్ ఎస్పీగా పదోన్నతి రాగా శుక్రవారం ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందనలు తెలిపారు. అదనపు ఎస్పీగా పదోన్నతి పొందిన కాజల్ సింగ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భుజస్కందాలపై సింహ తలాటం చిహ్నాన్ని అలంకరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, జీవన్ రెడ్డి, కమతం ఇంద్రవర్ధన్ పాల్గొన్నారు.

గంజాయి రహిత జిల్లా నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గురువారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. వీడీసీల ఆగడాలను పూర్తిస్థాయిలో అరికట్టాలన్నారు. రౌడీలు, కేడీలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా కఠినమైన పర్యవేక్షణ చేయాలని సూచించారు. దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు.

రానున్న నవరాత్రి ఉత్సవాలకు జిల్లా పోలీస్ యంత్రాంగం పూర్తి సంసిద్ధమై ఉందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఆదిలాబాద్‌లో జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపడానికి ప్రత్యేక కార్యచరణను అవలంభించాలని సూచించారు. అందులో భాగంగానే కల్తీకల్లు, ఓపెన్ డ్రింకింగ్, గ్యాంబ్లింగ్, గేమింగ్, మట్కా లాంటి వాటిని పూర్తిగా రూపమాపేలా కృషి చేయాలన్నారు.

విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన ‘ఆరోగ్య పాఠశాల’ కార్యక్రమంపై కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా ఈ సమావేశంలో పాల్గొని, విద్యార్థులు వేసిన డ్రాయింగ్లు, ప్రదర్శనలను తిలకించారు. విద్యార్థులు ఈ కార్యక్రమం వల్ల తమలో వచ్చిన మార్పులను వివరించారు. ఛాంపియన్ విద్యార్థుల సందేశాలను కలెక్టర్ అభినందించారు. అనంతరం విద్యార్థులకు సూచనలు చేశారు.

”స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లయినా మా గ్రామానికి రోడ్డు లేక నరకయతన పడుతున్నాం. విద్య, వైద్యం పొందలేక అవస్థలు పడుతున్నాం. వర్షాకాలంలో అనారోగ్యం బారిన పడితే హాస్పిటల్ వెళ్లలేని పరిస్థితి. నిత్యవసరాలకీ నరకం అనుభవిస్తున్నాం. రోడ్డు సరిగ్గా లేక పిల్లలు చదువులకు దూరమయ్యారు” అంటూ గుబిడి గ్రామస్థులు కలెక్టర్‌కు రాసిన వినతిపత్రం చర్చనీయంగా మారింది. మండల పర్యటనకు రానున్న కలెక్టర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్‌కు సైతం పదోన్నతి లభించింది. ఈ మేరకు ఆమెకు అదనపు ఎస్పీగా పదోన్నతి కల్పించారు. తిరిగి యధా స్థానంలో అదనపు ఎస్పీగా కొనసాగనున్నారు. ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.

జిల్లా స్థాయిలో పోలీసులకు క్రికెట్ టోర్నమెంట్ పూర్తయినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ మైదానంలో నాలుగు రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్‌ను పోలీసు ఉన్నతాధికారులతో కలిసి నిర్వహించారు. చివరి రోజు ముగింపు కార్యక్రమ సందర్భంగా గెలుపొందిన సూపర్ స్ట్రైకర్స్ బృందానికి మొదటి బహుమతి, రన్నరప్‌గా నిలిచిన ఆదిలాబాద్ రాయల్స్ బృందానికి 2వ బహుమతిని అందజేశారు.

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలపను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. గురువారం పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో దేవాపూర్ సమీపంలోని MS గార్డెన్లో సిబ్బంది తనిఖీలు చేశారు. రూ.84 వేల విలువైన టేకు కలప దొరికినట్లు చెప్పారు. కలపను జప్తు చేసి యజమాని మొహమ్మద్ మూసా, లక్షణ్ పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

కేశవపట్నంలో ఫారెస్ట్ అధికారులు, పోలీసులపై దాడి చేసిన ప్రధాన నిందితుడు షేక్ అల్తాఫ్ అరెస్ట్ చేసినట్లు ఇచ్చోడ సీఐ బండారి రాజు తెలిపారు. నిందితుడిని గురువారం అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేసే వారిపై జిల్లా పోలీస్ యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని హెచ్చరించారు.

విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఆదిలాబాద్ ప్రభుత్వ ఆర్ట్స్& కామర్స్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ డా.బేగం అన్నారు. గురువారం ఆ కాలేజీలో విద్యార్థులకు ఉమెన్ ఎంపవర్మెంట్పై అవగాహన కల్పించారు. షీటీమ్ ఇన్ఛార్జ్ ఎస్ఐ సుశీల మాట్లాడారు. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, స్నాప్ చాట్, వాట్సాప్‌ను యువత అవసరం మేరకే వినియోగించాలన్నారు. ఆడపిల్లలలు అత్యవసర సమయాల్లో 8712659953 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.