Adilabad

News June 23, 2024

ఉమ్మడి జిల్లాలో రూ.2,215 కోట్ల రుణాలు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 6 లక్షల మందికి పైగా రైతులు 17 లక్షల ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.2లక్షల లోపు రుణాలు తీసుకున్న దాదాపు 3.90 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాలంటే సుమారు రూ.2,215 కోట్లు నిధులు అవసరమని అధికారుల అంచనా వేశారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు రుణాలు తీసుకున్న రైతులకు ఇది వర్తించనుంది.

News June 23, 2024

ADB: కొనసాగుతున్న POLYCET సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

POLYCET సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ నేడు ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాలలో నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ ప్రక్రియ జరుగుతుందని పాలిసెట్ సమన్వయకర్త భరద్వాజ తెలిపారు. అభ్యర్థులు స్లాట్ బుక్ చేసుకొని తగిన ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుందని తెలిపారు.

News June 23, 2024

ADB: ఉపాధి హామీ పనుల్లో మహిళలే అధికం

image

ఉమ్మడి జిల్లాలో 91వేల ఉపాధిహామీ జాబ్ కార్డులు ఉండగా ఏటా పనిచేసే వారు 1.72 లక్షల మంది ఉన్నారు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 71వేల జాబ్ కార్డులున్న వారికి పని కల్పించగా దాదాపు 1.29 లక్షల మంది భాగస్వాములయ్యారు. ఇందులో పురుషులు 61వేలు, మహిళలు 68 వేలు ఉన్నారు. కేంద్రం కూలికి రోజు రూ.300 కేటాయిస్తుంది.

News June 23, 2024

మందమర్రిలో JCB ఢీకొని కూలీ మృతి

image

JCB ఢీకొని కూలీ మృతి చెందిన ఘటన మందమర్రిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజశేఖర్ వివరాల ప్రకారం.. చెక్ డ్యామ్ నిర్మాణ పనుల కోసం తీసుకువచ్చిన ఇసుక ట్రాక్టర్ మట్టిలో దిగబడింది. దానిని JCB సహాయంతో బయటికి లాగుతుండగా డ్రైవర్ అకస్మాత్తుగా JCBని వెనక్కు తీయడంతో నవీన్(33) అనే కూలీకి బలంగా తాకింది. తీవ్రంగా గాయపడిన నవీన్‌ను మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

News June 23, 2024

ఆదిలాబాద్: విద్యుత్ ఏడీఈ డిస్మిస్

image

రైతు వద్ద లంచం తీసుకున్న కేసులో ఆదిలాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని ADE రేగుంట స్వామిని విధుల నుంచి తొలగిస్తూ TSNPDCL CMD వరుణ్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. స్వామి ఇచ్చోడలో 2010లో పనిచేస్తున్నప్పుడు ఓ రైతు వద్ద రూ.30 వేలు లంచం అడిగాడు. దీంతో రైతు ACB అధికారులను సంప్రదించగా వారు పథకం ప్రకారం ఆ రైతు అతడికి లంచం ఇస్తుండగా పట్టుకున్నారు. నేరం రుజువు కావడంతో స్వామిని విధుల నుంచి తొలగించారు.

News June 23, 2024

ఆదిలాబాద్: సివిల్స్ కై ఉచిత శిక్షణ APPLY NOW

image

సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల కొరకు హైదరాబాద్ బంజారాహిల్స్‌లో గల TG స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ADB SC సంక్షేమ శాఖ అధికారిని సునీత కుమారి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు జులై 10 లోపు http://tsstudycircle.co.in/ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జులై 21 న నిర్వహించనున్న ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేసి 10 నెలల పాటు ఉచితభోజన వసతితో కోచింగ్ ఉంటుందన్నారు.

News June 22, 2024

MNCL: పోలీస్ అధికారులకు సేవా పతకాలు

image

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందికి మహోన్నత సేవా పతకాలను ప్రకటించింది. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న అడిషనల్ DCPఅడ్మిన్ C.రాజుకు తెలంగాణ స్టేట్ పోలీస్ మహోన్నత సేవా పతకం, టాస్క్‌ఫోర్స్ T.మల్లారెడ్డి తెలంగాణ స్టేట్ సేవా పతకం అందుకున్నారు.

News June 22, 2024

ఆదిలాబాద్: ఈనెల 24 నుంచి CBRT పరీక్షలు

image

TGPSC CBRT హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ (works Grade-ll). పరీక్షలకు సంబంధించి శనివారం ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తన ఛాంబర్‌లో లైన్ డిపార్ట్మెంట్స్ తో సమావేశం నిర్వహించారు. ఈ నెల 24 నుంచి 29 వరకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్ష జరుగుతుందని, జూన్ 30 నుంచి జులై 4 వరకు డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని నలంద కళాశాలలో పరీక్ష కేంద్రం ఉందన్నారు.

News June 22, 2024

నిర్మల్: మద్యానికి బానిసై ఆత్మహత్య

image

మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా బాసర మండలంలోని కీర్గుల్ కే గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కదం గంగాధర్ (45) అనే వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు. జీవితం మీద విరక్తితో రోడ్డమోడ్ గుట్ట వద్ద గల చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News June 22, 2024

ADB: అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమెరాకు చిక్కిన చిరుత

image

ఆదిలాబాద్ జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. తలమడుగు మండలం కుచులాపూర్ అటవీప్రాంతంలో సంచరిస్తున్న చిరుత అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమరాకు చిక్కింది. తాజాగా అటవీశాఖ అధికారులు చిరుత ఫొటోను విడుదల చేశారు. కాగా అడవికి పశువుల కాపరులు ఎవరూ వెళ్లకుండా అవగాహన కల్పిస్తున్నట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రణ్‌వీర్ తెలిపారు. బేస్ క్యాంపులు సైతం ఏర్పాటు చేశామన్నారు.