Hyderabad

News August 12, 2024

మౌస్ డీర్ సంతతి కేంద్రంగా నెహ్రూ జూపార్క్

image

నెహ్రూ జూపార్క్ మూషిక జింకల (మౌస్ డీర్) సంతతి వృద్ధి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇండియన్ వైల్డ్ యానిమల్ యాక్ట్ 1972 ప్రకారం అంతరించిపోతున్న జంతువుల జాబితాలోని షెడ్యూల్-1లో మూషిక జింకను చేర్చారు. దేశంలో ఇవి కనుమరుగవుతున్న నేపథ్యంలో 2010 మార్చి 3న, నెహ్రూ జూపార్క్‌ను ఢిల్లీ సెంట్రల్ జూ అథారిటీ వాటి సంతతి కేంద్రంగా దీన్నిిి గుర్తించింది. ఆ తర్వాత ఇందులో 500 మూషిక జింకలు జన్మించాయి.

News August 12, 2024

HYD: రేవంత్‌ను అంటే బండి సంజయ్‌కు కోపమెందుకు?: రావుల

image

హామీల విషయంలో రేవంత్‌ను తమ పార్టీ నేతలు ప్రశ్నిస్తుంటే కాంగ్రెసోళ్లే పట్టించుకోరని, కానీ బండి సంజయ్‌కు కోపమెందుకు వస్తుందని BRS సీనియర్ నేత రావుల శ్రీధర్ రెడ్డి తెలంగాణ భవన్‌లో ప్రశ్నించారు. KTRను జైల్లో పెట్టాలని బండి అంటున్నారని, పదేళ్లు KTRఐటీ మంత్రిగా ఉండి ఎంతో అభివృద్ధి చేశారన్నారు.బండిని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌‌‌కు పంపించాలని మండిపడ్డారు. కేంద్రమంత్రిగా ఉండి తెలంగాణకు నిధులు తేలేదన్నారు.

News August 12, 2024

HYD: 1000 లైబ్రరీ పోస్టులతో నోటిఫికేషన్‌కు వినతి

image

గ్రేడ్-1, 2, 3లో 1000 లైబ్రరీ పోస్టులకు తగ్గకుండా త్వరలో నోటిఫికేషన్లు వచ్చేలా చూడాలని రాష్ట్ర పబ్లిక్ లైబ్రరీ ఛైర్మన్ డా. రియాజ్‌ను లైబ్రేరియన్ విద్యార్థులు కోరారు. డా.రియాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ పబ్లిక్ లైబ్రరీ డెవలప్‌మెట్ ఫోరం HYDలో నిర్వహించిన వన్ డే వర్క షాప్‌లో పాల్గొన్న విద్యార్థులు ఈమేరకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేలా న్యాయం చేయాలన్నారు.

News August 12, 2024

AP సీఎం చంద్రబాబుతో HYD BRS ఎమ్మెల్యే

image

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కూకట్‌పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి దర్శనాలకు తెలంగాణ ఎమ్మెల్యేలు ఇచ్చే సిఫారసు లేఖలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. దీనిపై ఏపీ సీఎం సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

News August 12, 2024

HYD: బడ్జెట్లో రింగ్ రైలుకు నిల్.. ఆశలు గల్లంతు!

image

రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో రవాణా ఆధారిత అభివృద్ధి కోసం రీజనల్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ప్రతిపాదిత రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్ట్ చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. స్వయంగా రూ.12,048 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది. అయినా తాజా బడ్జెట్లో దీనికి ఎలాంటి మోక్షం కలగలేదు. దీంతో ప్రస్తుతానికి రింగ్ రైల్ ఆశలు గల్లంతయ్యాయినట్టే!

News August 12, 2024

HYD: రూ.3,849 కోట్లతో.. 39 మురుగు శుద్ధి ప్లాంట్లు

image

HYDలో ఇక మురుగు శుద్ధి 100% జరగనుందని అధికారులు చెబుతున్నారు. రూ.3,849 కోట్లతో 39 సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(STP)లను నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అమృత 2.0 ట్రాంచి -3 ప్రోగ్రాంలో భాగంగా నిర్మించనున్నారు. మొత్తం వీటిని 2 ప్యాకేజీలలో పూర్తి చేయనున్నారు. మొదటి ప్యాకేజీలో 16, రెండో ప్యాకేజీలు 22 పూర్తి కానుండగా.. వీటితో 972 MLD మురుగునీరు శుద్ధి కానుంది.

News August 11, 2024

HYD: JNTUలో ఒకేసారి 2 డిగ్రీలకు ఛాన్స్!

image

HYD జేఎన్టీయూలో బీటెక్ ఇంజనీరింగ్‌తో పాటు BFSI బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ మైనర్ డిగ్రీ కోర్సును చదివే అవకాశం కల్పించనున్నట్లు జేఎన్టీయూ అధికారులు తెలిపారు. బ్యాంకింగ్ రంగంలో సుమారు 5,000 మంది ఇంజనీరింగ్, మరో 5,000 నాన్ ఇంజనీరింగ్ నిపుణుల అవసరం ఉందని ఆ సంస్థ ప్రతినిధులు JNTU దృష్టికి తీసుకెళ్లగా.. ఈ విధానానికి శ్రీకారం చుట్టారు.

News August 11, 2024

HYD: ఆలస్యం జరిగితే చెరువులు కనుమరుగు!

image

HYD మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న 3,500 చెరువులన్నింటిని 3 నెలల్లో బఫర్ జోన్లను గుర్తించి నోటిఫై చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో జాప్యం జరిగితే అక్రమాలతో చెరువులే కనిపించకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. రామన్నకుంట చెరువు పరిధిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదని హ్యూమన్ రైట్స్ గత ఏడాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది.

News August 11, 2024

HYD: ఓపెన్ డిగ్రీ, డిప్లొమా, PG చేయాలని ఉందా!

image

HYDలోని డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లమా, సర్టిఫికెట్ కోర్సుల ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసినట్లుగా యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. ఆగస్టు 31 దరఖాస్తుకు చివరి తేదీగా ప్రకటించారు. www.braouonline.in వెబ్‌సైట్ ద్వారా ఓపెన్ కోర్సులకు దరఖాస్తు చేసుకొని ఉన్నత విద్య అభ్యసించవచ్చని తెలిపారు.

News August 11, 2024

HYD: రేవంత్, బండి సంజయ్‌పై ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

image

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సీఎం సహాయ మంత్రిగా మారిపోయారని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడి కంపెనీల్లోకి పెట్టుబడి తీసుకొస్తుంటే ఆయన ఏం చేస్తున్నారని ఆదివారం తెలంగాణ భవన్‌లో నిలదీశారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థిస్తుందా అని MLA ప్రశ్నించారు. నిరుద్యోగులు ఎన్ని పోరాటాలు చేసినా బీజేపీ నాయకులు మద్దతు ఇవ్వరని మండిపడ్డారు.