Hyderabad

News March 6, 2026

HYD: మార్కెటింగ్‌పై మహిళలకు ఉచిత శిక్షణ

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ మహిళలు, యువతులకు మార్కెటింగ్‌పై ఉచిత శిక్షణ ఇస్తామని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం జిల్లా మేనేజర్ శైలకుమారి తెలిపారు. చిలుకూరులోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో ఈనెల 17 నుంచి 3 నెలల పాటు రిటైల్ సేల్స్ అసిస్టెంట్ కోర్సుల్లో శిక్షణ ఇస్తామని, పదో తరగతి పాసై, 18 ఏండ్లు నిండిన వారు ఈనెల 16లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 7660022524ను సంప్రదించాలన్నారు.

News March 6, 2026

HYD: మీ గుడి నుంచి పూజలు.. రూ.50 వేల ఆదాయం

image

ప్రముఖ ఆధ్యాత్మిక ప్లాట్‌ఫాం వేదమందిర్‌కు సేవలందించేందుకు పురోహితులు కావలెను. మీ ప్రాంతంలోనే ఉండి, మీ దైనందిన కార్యక్రమాలు చూసుకుంటూనే మా కస్టమర్లకు సేవలు అందించవచ్చు. దీంతో మీరు నెలకు రూ.40వేల నుంచి రూ.50 వేల వరకు పొందుతారు. ఆసక్తి గల పురోహితులు <>ఇక్కడ క్లిక్ <<>>చేసి మీ వివరాలు నమోదు చేయండి. మా ప్రతినిధులే మిమ్మల్ని సంప్రదిస్తారు.

News March 6, 2026

HYDలో ఆకాశమే హద్దుగా హోర్డింగ్‌లు!

image

అడ్వర్టైజ్‌మెంట్ పాలసీలో మార్పులతో ​సిటీలో యాడ్ బోర్డుల గోల మొదలైంది. 6ఏళ్లుగా 15 ఫీట్ లిమిట్‌ను సర్కార్ సైలెంట్‌గా ఎత్తేసింది. GHMC, CMC, MMCల్లో ఇక ఆకాశమే హద్దుగా హోర్డింగ్‌లు వెలవనున్నాయి. పెద్ద కంపెనీలకు మేలు చేసేలా టెండర్ కండీషన్లు మార్చారని, చిన్న అడ్వర్టైజర్లు నష్టపోతారనే అరోపణలు ఉన్నాయి. 5ఏళ్ల కాంట్రాక్టుల పేరుతో రూ.కోట్లు ఆదాయానికి గండి కొట్టేలా తెర వెనుక పెద్ద స్కెచ్ నడిచిందని టాక్.

News March 6, 2026

HYD: ఇంజినీరింగ్ కాలేజీలో కొత్త ఫీజులు ఖరారు

image

నగరంలోని పలు ఇంజినీరింగ్ కళాశాలలకు ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచే ఈ ఫీజులు అమలుచేయనున్నారు. 3 సంవత్సరాలపాటు (2027- 28వరకు) ఈ నిబంధనలు అమలవుతాయి. ఇదిలా ఉండగా CBITకి అత్యధిక ఫీజు రూ.1.83 లక్షలు, ఆ తర్వాత వాసవికి రూ.1.75 లక్షలు, MGITకి రూ.1.67 లక్షలు, CVRకు రూ.1.63 లక్షలు, నారాయణమ్మకు రూ.1.62 లక్షలుగా నిర్ధారించారు.

News March 6, 2026

HYDలో స్విమ్మింగ్ పూల్స్ ఇవే!

image

సమ్మర్ షురూ అవ్వగానే పిల్లల్లో ఈతపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో GHMC నగరవ్యాప్తంగా మొత్తం 14 స్విమ్మింగ్ పూల్స్‌ను సిద్ధం చేసింది. వనస్థలిపురం సచివాలయనగర్, ఫేజ్-4 కాలనీ, మొఘల్‌పురా, చందులాల్ బారాదరి, విజయ్‌నగర్ కాలనీ, గోల్కొండ, అంబర్‌పేట్, అమీర్‌పేట, సనత్‌నగర్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్, KPHB 6వ ఫేజ్ తదితర ప్రాంతాల్లో పూల్స్‌ను ఏర్పాటు చేశారు.
# SHARE IT

News March 6, 2026

HYD: హాస్టల్ నుంచి వెళ్లి.. VKBలో లవ్ మ్యారేజ్

image

పర్మిషన్ లేకుండా హాస్టల్ నుంచి ఓ విద్యార్థిని వెళ్లిపోయిన ఘటన ఘట్‌కేసర్ PS పరిధిలో జరిగింది. SHO బాలస్వామి వివరాలిలా.. వికారాబాద్(D) ధారూర్‌కు చెందిన విద్యార్థిని(19) అంకుషాపూర్ సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కాలేజీలో 2nd ఇయర్ చదువుతోంది. ఈ నెల 4న హాస్టల్ నుంచి వెళ్లింది. ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. VKBలో ప్రియుడితో వివాహం చేసుకున్నట్లు లోకల్ PS నుంచి ఘట్‌కేసర్‌ ఠాణాకు సమాచారమందింది.

News March 6, 2026

HYD: 36 గంటలు నీటి సరఫరాకు బ్రేక్

image

HYDలోని పలు కీలక ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి 36 గం. పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని జలమండలి తెలిపింది. ట్రాన్స్‌మిషన్ I & ll విభాగాలతో పాటు మణికొండ, కోకాపేట్, నార్సింగి, షేక్‌పేట్‌తో పాటు భోజగుట్ట ప్రాంతానికి తక్కువ ప్రెజర్‌తో నీరు సరఫరా అవుతుందని, సరఫరాలో అంతరాయం ఉంటుందని ప్రకటించింది. మంజీరా ఫేజ్-3, పెద్దాపూర్ పంప్ హౌస్‌లో మరమ్మతులు, ఆధునీకరణ పనుల కారణంగా HMWSSB ఈ నిర్ణయం తీసుకుంది.

News March 6, 2026

HYD: మీ గుడి నుంచి పూజలు.. రూ.50 వేల ఆదాయం

image

ప్రముఖ ఆధ్యాత్మిక ప్లాట్‌ఫాం వేదమందిర్‌కు సేవలందించేందుకు పురోహితులు కావలెను. మీ ప్రాంతంలోనే ఉండి, మీ దైనందిన కార్యక్రమాలు చూసుకుంటూనే మా కస్టమర్లకు సేవలు అందించవచ్చు. దీంతో మీరు నెలకు రూ.40వేల నుంచి రూ.50 వేల వరకు పొందుతారు. ఆసక్తి గల పురోహితులు <>ఇక్కడ క్లిక్ <<>>చేసి మీ వివరాలు నమోదు చేయండి. మా ప్రతినిధులే మిమ్మల్ని సంప్రదిస్తారు.

News March 6, 2026

HYD: నీరు వృథా.. ఖజానా ఖాళీ!

image

జలమండలిని ఇప్పుడు ‘నాన్-రెవెన్యూ వాటర్’ (NRW) భూతం వేధిస్తోంది. నగరానికి సరఫరా అవుతున్న నీటిలో దాదాపు 40% లీకేజీలు, అక్రమ కనెక్షన్ల ద్వారా వృథా అవుతుండటంతో బోర్డు దివాలా తీసే స్థితికి చేరింది. అటు సుంకేసుల ఇన్-టేక్ వెల్ వద్ద సాంకేతిక సమస్యల భయం వెంటాడుతుంటే ఇటు కొండాపూర్, శేరిలింగంపల్లి వంటి ప్రాంతాల్లో తాగునీటిలో మురుగు కలుస్తోందన్న ఫిర్యాదులు కలకలం రేపుతున్నాయి.

​

News March 5, 2026

HYDలో ఇక ‘RED’ నోటీసులు

image

ఆర్థిక కష్టాల్లో ఉన్న జీహెచ్‌ఎంసీ ఇప్పుడు ట్యాక్స్ బాకీదార్లపై కన్నెర్ర చేస్తోంది. ₹3,000 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు పేరుకుపోవడంతో ‘రెడ్ నోటీసుల’ పర్వం మొదలైంది. గడువు దాటితే సెక్షన్ 269 ప్రయోగించి ఆస్తుల జప్తుకు అధికారులు సిద్ధమవుతున్నారు. విడ్డూరమేంటంటే.. ప్రభుత్వ భవనాలే వెయ్యి కోట్ల బకాయి ఉండటం. ఈ నిధులు రాకపోతే వరద నివారణ, రోడ్ల మరమ్మతు పనులు గంగలో కలవడం ఖాయమనే విమర్శలొస్తున్నాయి.

↑