Hyderabad

News March 7, 2026

HYD: అక్రమార్కుల ఆకలికి ‘కూలీ’ల బతుకు తెల్లారింది!

image

​టోలిచౌకిలో బిల్డింగ్ గోవా కూలీ ఇద్దరు కూలీలు చనిపోయిన ఘటన సిటీలో కలకలం రేపింది. కేవలం 3 అంతస్తులకే పర్మిషన్ ఉంటే, 6వ అంతస్తు వరకు స్లాబ్‌లు వేశారు. DECలోనే నోటీసులిచ్చామని ఆఫీసర్లు బుకాయిస్తున్నారు. ఇస్తే పని ఎలా సాగింది? మామూళ్ల మత్తులో ఉన్నారా? అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ప్లానింగ్ విభాగంలోని కొందరు అధికారుల అండదండలతోనే అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

News March 7, 2026

తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

image

TPCC మహిళా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ నియామితలయ్యారు. అధ్యక్షురాలిగా పార్టీ చీఫ్ ఖర్గే ఆమోదించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఆమె కాంగ్రెస్‌లో 45 ఏళ్లుగా ఉన్నారు. 1991లో PACS ఛైర్‌పర్సన్‌గా తొలిసారి ఎన్నికవ్వగా 2005లో వరంగల్ నగర మేయర్‌గా పని చేశారు. వరంగల్ పశ్చిమ నుంచి MLAగా పోటీ చేసి ఓటమి చెందారు. 2023-25 వరకు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా పని చేశారు.

News March 7, 2026

HYD: మేడం సార్.. మేడం అంతే!

image

షాద్‌నగర్‌కి చెందిన ఇంద్రార్చిత కర్ణాటక క్యాడర్‌లో సివిల్స్‌లో 627వ ర్యాంకు సాధించి సత్తాచాటారు. ఆమె ప్రాథమికోన్నత విద్య షాద్‌నగర్‌లో పూర్తిచేశారు. HYDలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఆఫ్ ఉమెన్‌లో ఇంటర్, డిగ్రీ వరకు చదివారు. అనంతరం ఇగ్నో యూనివర్సిటీలో MA పొలిటికల్ సైన్స్ పూర్తి చేసి.. ఢిల్లీకి వెళ్లి కోచింగ్ తీసుకొని సివిల్స్‌కు సిద్ధమయ్యారు. నిన్న విడుదలైన ఫలితాల్లో ‘మేడం’ గ్రేట్ అనిపించుకున్నారు.

News March 7, 2026

VFX హబ్‌గా HYD.. ప్రారంభించనున్న సీఎం

image

ప్రముఖ OTT సంస్థ నెట్ ఫ్లిక్స్ తన కార్యాలయాన్ని హైదరాబాదHలో ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఈ నెల 12న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు దీనిని ప్రారంభించనున్నారు. 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ స్టూడియోను ప్రారంభించనుంది. భారతదేశంలో తనకు రెండో కార్యాలయం కానుంది. దీని ద్వారా VFX, గేమింగ్ కామిక్స్ రంగంతో పాటు వివిధ రంగాలలో మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయని చెబుతున్నారు.

News March 7, 2026

HYDలో DANGER కంటి‘న్యూస్’

image

నగరంలో గాలి నాణ్యత పడిపోతుండటంతో ప్రజల ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా రెండంకెల స్థాయిలో ఉండాల్సిన గాలి నాణ్యత సూచీ శనివారం బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో అత్యధికంగా 248గా నమోదైంది. వాహనాల పొగ, చెత్తాచెదారం తగలబెట్టడం కారణంగా కాలుష్య స్థాయిలు పెరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. ప్రజలు మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు.

News March 7, 2026

HYDకు చేరువలో అద్భుతమైన అందాలు.. వెళ్దామా?

image

HYD నగరానికి చేరువలో నల్లమల అడవుల అందాలను ఆస్వాదించాలనుకునే వారికి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ వేదికగా నిలుస్తోంది. ఇక్కడి ‘మన్ననూర్ జంగిల్ రిసార్ట్’లో పులుల సఫారీ, పక్షుల కిలకిలరావాల మధ్య ఉదయం ట్రెక్కింగ్ వంటివి పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తున్నాయి. స్థానిక చెంచులతో కలిసి అడవి రహస్యాలను తెలుసుకునే వీలుంది. ఆధునిక వసతులు, భోజన సౌకర్యాలతో కూడిన ఈ పర్యాటక ప్యాకేజీ కోసం <>ఇక్కడ క్లిక్ <<>>చేయండి.

News March 6, 2026

HYD: సివిల్స్‌లో సత్తా చాటిన ఉమ్మడి రంగారెడ్డి బిడ్డలు

image

సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అభ్యర్థులు సత్తా చాటారు. రాష్ట్రం నుంచి ఎంపికైన మొత్తం 20 మందిలో 8 మంది మన జిల్లాలకు చెందిన వారే కావడం విశేషం. లక్ష్మిరచన 178వ ర్యాంక్, మెరుగు కౌశిక్ 399, ప్రీతీ రాపర్తి 468, విక్రమ్ సింహా రెడ్డి 682, విజయ్ సింహా రెడ్డి 682, శ్రీరామ్ హర్ష 823, ప్రత్యూష 908, దీపక్ శర్మ 951, ఉత్తమ ర్యాంకులు సాధించారు.

News March 6, 2026

గచ్చిబౌలి: గ్యాస్‌ బెలూన్‌ పేలి నలుగురికి గాయాలు

image

గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్‌ శాంతి సరోవర్‌ ప్రాంగణంలో శుక్రవారం గ్యాస్‌ బెలూన్‌ పేలి నలుగురు గాయపడ్డారు. ఓ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన హీలియం బెలూన్‌ ఒక్కసారిగా పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

News March 6, 2026

HYD: ఫైల్ కదలాలంటే సమర్పించుకోవాల్సిందే..!

image

సికింద్రాబాద్ GHMC ఆఫీసులో అకౌంట్స్ ఎగ్జామినర్ సంతోష్ ఓ పెన్షనర్ దగ్గర రూ.35వేలు లంచం తీసుకుంటూ ACBకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన విషయం తెలిసిందే. కాగా ఇది చిన్న శాంపిల్ మాత్రమే. ఇంజినీరింగ్ విభాగంలో 30శాతం కమీషన్ల దందా నడుస్తోందనే ఆరోపణలున్నా కేవలం చిన్న క్లర్కులను పట్టుకొని హడావిడి చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వందల కోట్ల ఆస్తులు వెనకేసిన పెద్ద ఆఫీసర్ల ఫైళ్లు మాత్రం బీరువాల్లోనే మగ్గుతున్నాయి.

News March 6, 2026

HYD: ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా.. జాగ్రత్త..!

image

HYDవాసులను జలమండలి బిల్లుల కంటే కేటుగాళ్ల మెసేజ్‌లే ఎక్కువ భయపెడుతున్నాయి. బిల్లు కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తామంటూ HMWSSBపై ఫేక్ లింకులు పంపిస్తున్నారు. తెలీక ఆ లింక్ నొక్కితే అకౌంట్లు ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే సిటీలో రూ.కోట్లు కాజేసినట్లు సమాచారం. డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు మాత్రం మేము అలాంటి మెసేజ్‌లే పంపమని చేతులు దులుపుకుంటున్నారు. కాగా, కస్టమర్ల వివరాలు బయటకెలా వెళ్తున్నాయో మాత్రం తెల్వట్లేదు.

↑