Hyderabad

News March 9, 2026

HYD: పట్టాల మాటున ప్లాట్ల వ్యాపారం!

image

రైలు పట్టాల కింద ఉన్న భూములే మెట్రో ఫేట్ డిసైడ్ చేస్తున్నాయా? 2వ దశ విస్తరణలో అలైన్‌మెంట్ మార్పుల వెనుక రియల్ ఎస్టేట్ మాఫియా హస్తం స్పష్టంగా కనిపిస్తోంది. JAN 2026లో ప్రభుత్వం ₹2,787 కోట్ల భూసేకరణ నిధులను కేటాయించింది. ఎయిర్‌పోర్ట్, ఫోర్త్ సిటీ మెట్రో రూట్లను పదేపదే మార్చడంతో ప్రైవేట్ వెంచర్ల విలువ ₹వేల కోట్లకు చేరింది. TOD పేరుతో జరుగుతున్న ఈ భూముల కేటాయింపులపై ఇప్పటికే హైకోర్టులో PIL దాఖలయ్యాయి.

News March 9, 2026

బిన్ ఫ్రీ HYD.. చెత్తంతా ఖాళీ ప్లాట్లలోనే

image

నగరాన్ని GHMC, CMC, MMC కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసింది అవార్డుల కోసమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. HYD బిన్ ఫ్రీ అయిందని ఆఫీసర్లు ఢిల్లీకి రిపోర్టులు పంపుతున్నారని టాక్. కానీ, గల్లీల్లోకి వస్తే అసలు రంగు బయట పడుతుందన్నది ప్రజల మాట. టాప్ ర్యాంక్ వస్తే ‘మేమే NO.1’ అని చెప్పుకోవచ్చనేది ప్లాన్‌గా తెలుస్తోంది. దీంతో కేంద్రాన్ని మెప్పించినా, రోజూ ఆ దుర్వాసన పీల్చే జనాల్ని ఎలా నమ్మిస్తారనేది ప్రశ్న.

News March 9, 2026

HYD: నేడు స్కాట్లాండ్‌తో భారత్ ఢీ

image

మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ 2026లో భాగంగా నేడు భారత్, స్కాట్లాండ్ జట్లు తలపడనున్నాయి. గచ్చిబౌలి స్టేడియంలో ఈ కీలక మ్యాచ్ జరగనుంది. పూల్-బీలో ఇప్పటికే ఒక విజయం సాధించిన భారత మహిళల జట్టు రెండో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరోవైపు స్కాట్లాండ్ జట్టు కీలక పాయింట్ల కోసం పోరాడనుంది. ఉత్కంఠభరితంగా సాగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 గం.కు ప్రారంభం కానుంది.

News March 9, 2026

HYD: చెత్త కనిపిస్తే వాట్సాప్ చేయండి

image

పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో ప్రజలు కార్యాలయాల దాకా రాకుండానే పారిశుద్ధ్య సమస్యలు తెలియజేసేందుకు వాట్సాప్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. రోడ్లపై చెత్త పేరుకుపోయినా, చెత్త బిన్లు నిండిపోయినా, నాలాల్లో వ్యర్థాలు ఉన్నా ఫొటో తీసి, లొకేషన్‌తో వాట్సాప్ నంబర్‌కు పంపాలన్నారు. ఈ నంబర్లు సేవ్ చేసుకోండి
GHMC: 8125966586
మల్కాజిగిరి: 9063421300
సైబరాబాద్: 9063421347

News March 9, 2026

HYD: 20 కిలోల టమాట రూ.60.. రైతుల ఆవేదన!

image

HYDలో టమాట ధరలు రోజు రోజుకు పడిపోతున్నాయి. బోయిన్‌పల్లి మార్కెట్‌లో గత 3, 4 రోజులుగా టమాట ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం 20 కిలోల టమాట క్రేట్ ధర కేవలం రూ.60 నుంచి రూ.150 మధ్య మాత్రమే పలుకుతోంది. సరఫరా ఎక్కువగా రావడం, వివాహాది శుభకార్యాలు ఇంకా మొదలవ్వకపోవడంతో వినియోగం తగ్గి ధరలు పడిపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News March 9, 2026

HYD: CITD డిప్లొమా అడ్మిషన్స్ నోటిఫికేషన్

image

బాలానగర్‌లోని కేంద్ర టూల్ డిజైనింగ్(CITD) విద్యాసంస్థ డిప్లొమా అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదలైనట్లు వెల్లడించింది. కనీసం 10వ తరగతి పాసైన విద్యార్థులు, ఈ కోర్సులు చేయడానికి అర్హులు. టూల్ డిజైనింగ్, ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్ కోర్సులు ఇందులో ఉన్నాయి. ఒక్కో కోర్సు 3 ఏళ్లు. అప్లికేషన్స్ స్వీకరణ ప్రారంభమైందని, మే 22 వరకు tinyurl.com/citddiploma2026 ద్వారా దరఖాస్తు చేసుకోండి.

News March 8, 2026

రూ.5,812 కోట్లతో మూసీ నది ప్రాజెక్టు ఫేస్-1

image

రూ.5,812 కోట్లతో మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు ఫేస్-1 పనులు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా మహాత్మా గాంధీ విగ్రహానికి రూ.73.8 కోట్లు వెచ్చించనట్లు తెలిపారు. గాంధీ విగ్రహ వేదికకు రూ.22.6 కోట్లు, మ్యూజియం, భవనానికి రూ.220 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రూ.79 కోట్లతో ఎలక్ట్రో-మెకానికల్ పనులు చేపట్టనున్నారు.

News March 8, 2026

HYD: యూట్యూబ్ చూసి డాలర్లలో సంపాదన!

image

HYD శివార్లలోని బాచుపల్లి, నిజాంపేట్ బస్తీల్లో ఇప్పుడు సీన్ మారింది. కుర్రాళ్లు సాయంత్రం అయితే చాలు కిరాణా కొట్టుల దగ్గర కూర్చుని ‘పైథాన్’ కోడింగ్ చిక్కుముడులు విప్పుతున్నారు. సాఫ్ట్‌వేర్ ఆఫీసుల ఏసీ గదుల కంటే గల్లీలోని వేపచెట్టు కింద కూర్చుని విదేశీ క్లయింట్లకు ప్రాజెక్టులు చేసివ్వడమే వీరి స్టైల్. ఏ డిగ్రీలు లేకపోయినా యూట్యూబ్ చూసి నేర్చుకున్న విద్యతో డాలర్లు సంపాదిస్తున్నారు.

News March 8, 2026

HYD: ఈ వాట్సాప్ నంబర్ సేవ్ చేసుకోండి!

image

హైదరాబాద్‌లో పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం కోసం జీహెచ్‌ఎంసీ సరికొత్త వాట్సాప్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. రోడ్లపై చెత్త, నిండిన బిన్లు, మురుగునాళాల సమస్యలపై పౌరులు ఇకపై నేరుగా 8125966586 నంబర్‌కు ఫొటో, లొకేషన్‌ను వాట్సాప్ చేయవచ్చు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా చేపట్టిన ఈ విధానం ద్వారా ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరిస్తారు.

News March 8, 2026

ఫ్యూచర్‌ సిటీలో జర్నలిస్టులకు కాలనీ: CM

image

ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు కాలనీ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు CM రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మహిళా జర్నలిస్టులకు సన్మానం చేశారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ఫ్యూచర్ సిటీలో కాలనీలు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే జర్నలిస్టులకు కూడా శుభవార్త చెబుతామని వెల్లడించారు. అసెంబ్లీలో జర్నలిస్టుల కోసం చట్టం తీసుకొస్తామని ఆయన వెల్లడించారు.

↑