India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తెలంగాణ ఉద్యమాలకు నిలయమైన ఈ నేలపై మరోసారి నిరుద్యోగుల ఆగ్రహం ఉప్పొంగుతోంది. ఏడాదిలోపే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు గుస్సా మీద ఉన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన మిలియన్ మార్చ్‌కు 15 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఇవాళ ‘నిరుద్యోగ మిలియన్ మార్చ్’కు పిలుపునిచ్చారు. ఉ. 10 గంటలకు దిల్‌సుఖ్‌నగర్‌కు భారీగా తరలిరావాలన్నారు.

గ్రేటర్ HYDలో గ్యాస్ సెగ రేగుతోంది. అంతర్జాతీయ యుద్ధ పరిణామాల సాకుతో వాణిజ్య సిలిండర్ల సరఫరాకు బ్రేక్ పడటంతో హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు బెంబేలెత్తుతున్నారు. అమాంతం పెరిగిన ధరలకు తోడు.. రీఫిల్లింగ్ గడువును 25 రోజులకు పెంచడం వ్యాపారులకు శాపంగా మారింది. డొమెస్టిక్ సిలిండర్లకే మొగ్గు చూపుతుండటంతో వాణిజ్య అవసరాలకు కొరత ఏర్పడిందని హోటల్ యజమానులు విలవిలలాడుతున్నారు.

EPFOకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు బాలానగర్ పరిధిలోని ప్రశాంత్‌నగర్‌లో ఉన్న EPFO కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచించారు. PF విత్‌డ్రా, నామినీ యాడ్ చేయడం, KYC అప్‌డేట్, అకౌంట్ సంబంధిత ఇతర సమస్యలను అక్కడే పరిష్కరిస్తామని తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు.

మార్చి 10, 2011.. పట్నం తీరు యాదుందా? 15 ఏండ్లు ఎనకకు పోదాం పార్రి.! భాగ్యనగరమంతా బారీకేడ్లు.. పట్నమంతా పారా మిలిటరీ బలగాలు.. అడుగడుగునా అరెస్టులు.. అయినా దరువేస్తూ తెలంగాణ దండు కదిలింది. ట్యాంక్‌బండ్ మీద కవాతు చేసింది. మలిదశ TG ఉద్యమాన్ని మలుపు తిప్పిందే మిలియన్ మార్చ్. నిరోధాలను ఛేదించి చరిత్ర సృష్టించింది. ఆ రోజు తెలంగాణ కోసం పోరాడిన ప్రతీ అడుగూ స్వరాష్ట్ర కాంక్షకు సంకేతమైంది. #జై తెలంగాణ.

రంజాన్ పండుగ సమీపిస్తున్న తరుణంలో HYDలో పది రోజుల పాటు సందడి నెలకొననుంది. చార్మినార్, టోలిచౌకి, పాతబస్తీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నైట్ బజార్లకు నగర నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివస్తుండటంతో అర్ధరాత్రి వేళ కూడా ఆ వీధులన్నీ షాపింగ్ ప్రియులతో కళకళలాడుతున్నాయి. పాతబస్తీలో వ్యాపారాలు జోరందుకోగా, పెరిగిన వాహనాల రాకపోకలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు.

నగరంలోని వివిధ ప్రాంతాల స్టేడియాలకు మహర్దశ పట్టనుంది. సరూర్‌నగర్ స్టేడియం, ఎల్బీ స్టేడియం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, లాల్ బహుదూర్ శాస్త్రి స్టేడియాలను ఆధునికరించాలని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆయా సంబంధిత శాఖకు నేడు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ప్రణాళికలు రచించి వేసవిలో పనులు ప్రారంభించి పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

HYD యువత ఇప్పుడు ఇంటర్నేషనల్ వైబ్స్‌ను మన లోకల్ స్టైల్‌తో కలిపేస్తోంది. జూబ్లీహిల్స్ నుంచి పాతబస్తీ వరకు గ్లామర్, క్లీన్-గర్ల్ మినిమలిజం ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్. ఓవర్ సైజ్డ్ టీ షర్ట్స్, కార్గోలతో హుషారుగా కనిపిస్తూనే మన దేశీ జ్యువెలరీతో ‘ఫ్యూజన్’ క్రేజ్ పుట్టిస్తున్నారు. చిన్న ఆన్‌లైన్ లేబుల్స్, స్నీకర్ల స్టైలింగ్‌తో మన HYD Gen-Z అదరగొట్టేస్తున్నారు. మరి మీ స్టైల్ ఏంటో చెప్పండి?

హైదరాబాద్ మెట్రో మొదటి దశను ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకునే ప్రక్రియ ఈ మార్చి నాటికి తుది దశకు చేరుతుంది. సుమారు ₹13,000 కోట్ల అప్పులతో పాటు L&Tకి ₹2,000 కోట్ల సెటిల్మెంట్ చెల్లించేలా ఒప్పందం కుదిరింది. PPP మోడల్ విఫలమైందని అడ్మినిస్ట్రేషన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ, ప్రభుత్వంపై పడుతున్న ఈ భారీ ఆర్థిక భారం భవిష్యత్తులో సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.