Hyderabad

News March 12, 2026

HYD: బస్తీ గర్భిణులకు ‘ఏఐ’ భరోసా

image

HHF-విప్రో సహకారంతో అర్బన్ స్లమ్స్‌లో ఆనందిమా కిట్ల ద్వారా ఉచిత వైద్య పరీక్షలు షురూ అయ్యాయి. ఈ స్మార్ట్ AI కిట్‌తో BP, షుగర్, హిమోగ్లోబిన్ పరీక్షలతో పాటు కడుపులోని బిడ్డ గుండె చప్పుడునూ నిమిషాల్లో తెలుసుకోవచ్చు. ఏవైనా తేడాలుంటే AI హెచ్చరిస్తుంది. ‘కేర్ మదర్’ యాప్ ద్వారా హైరిస్క్ కేసులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ తల్లీబిడ్డల ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్నారు. గర్భిణుల పాలిట AI వరంగా నలిచింది.

News March 12, 2026

HYD: బస్తీ గర్భిణులకు ‘ఏఐ’ భరోసా

image

హెచ్‌హెచ్‌ఎఫ్-విప్రో సహకారంతో అర్బన్ స్లమ్స్‌లో ‘ఆనందిమా’ కిట్ల ద్వారా ఉచిత వైద్య పరీక్షలు షురూ అయ్యాయి. ఈ స్మార్ట్ ఏఐ కిట్‌తో బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ వంటి పరీక్షలతో పాటు కడుపులోని బిడ్డ గుండె చప్పుడును కూడా నిమిషాల్లో తెలుసుకోవచ్చు. ఏవైనా తేడాలుంటే AI వెంటనే హెచ్చరిస్తుంది. ‘కేర్ మదర్’ యాప్ ద్వారా హైరిస్క్ కేసులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ తల్లీబిడ్డల ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్నారు.

News March 11, 2026

జీహెచ్‌ఎంసీ చట్టానికి మంగళం.. HYDలో కొత్త చట్టం!

image

GHMCని మూడు కార్పొరేషన్లుగా విభజించడమే కాకుండా, పాత ‘GHMC యాక్ట్-1955’ స్థానంలో కొత్తగా Core Urban Act తీసుకురావడానికి ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే భవన నిర్మాణాల నుంచి రోడ్ల నిర్వహణ వరకు అంతా కేంద్రీకృత పద్ధతిలో సాగుతుంది. స్థానిక కార్పొరేషన్ల అధికారాలను కుదించి, నేరుగా రాష్ట్ర ప్రభుత్వం (MAUD శాఖ) చేతుల్లోకి పాలనను తెచ్చుకోవడమేనని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.

News March 11, 2026

రూ.126 కోట్ల ‘గ్రీన్’ టెండర్లు.. పచ్చదనం ముసుగులో నిధుల దోపిడీయేనా?​

image

HMDA గ్రీన్ ప్లాన్‌లో మతలబు ఏంటి? పదేళ్ల పాటు మొక్కల సంరక్షణ పేరుతో రూ. 126 కోట్లు ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఉన్న ప్లాంటేషన్ పరిస్థితి దారుణంగా ఉంటే, కొత్తగా ఇన్ని కోట్లు కుమ్మరించడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. చట్టబద్ధంగా టెండర్లు పిలిచామని అధికారులు చెబుతున్నా, కాంట్రాక్టుల కేటాయింపులో పారదర్శకత ప్రశ్నార్థకంగా మారింది.

News March 11, 2026

HYD: తక్షణమే సిలిండర్ డెలివరీ.. CP వార్నింగ్

image

వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న ఆందోళనను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని CP సజ్జనార్ తెలిపారు. తక్షణమే సిలిండర్ డెలివరీ, అదనపు సిలిండర్లు ఇస్తామంటూ SMలో నకిలీ ప్రకటనలు ఇస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. వాట్సాప్, ఎస్ఎంఎస్‌ల ద్వారా ఫేక్ వెబ్‌సైట్ లింకులను పంపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదని CP హెచ్చరించారు.
SHARE IT

News March 11, 2026

డ్రగ్స్ నెట్‌వర్క్‌కు ‘ఈగిల్’ షాక్.. ఏఐతో నేరగాళ్ల గుట్టు రట్టు!

image

ఇక డ్రగ్స్ మాఫియా ఆటలు సాగవు..! గంజాయి, డ్రగ్స్ దందా చేసే కేటుగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేందుకు తెలంగాణ ‘ఈగిల్ ఫోర్స్’ సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది. నేరగాళ్ల ఫోన్లు, కంప్యూటర్లలోని డేటాను సెకన్లలో చిదిమేసేందుకు అత్యాధునిక ‘ఏఐ డిజిటల్ ఫోరెన్సిక్’ సిస్టమ్‌ను తీసుకొస్తోంది. వాట్సాప్ చాట్లు, సోషల్ మీడియా గుట్టును విప్పడమే కాకుండా.. AIతో అనుమానిత సంభాషణలను ఇట్టే పట్టేస్తుంది.

News March 11, 2026

నెక్లెస్ రోడ్‌ నీరా కేఫ్ భవనం లీజుకు టెండర్ల ఆహ్వానం

image

నెక్లెస్ రోడ్ వద్ద ఉన్న నీరా కేఫ్ భవనాన్ని లీజుకు ఇవ్వడానికి తెలంగాణ TD టాపర్స్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ టెండర్లను ఆహ్వానించింది. ఈ భవనంలో నీరా ప్రాసెసింగ్ యూనిట్, బ్యాంకెట్ హాల్‌తో పాటు 7వాణిజ్య దుకాణాలు ఉన్నట్లు మేడ్చల్ జిల్లా BC అభివృద్ధి శాఖ అధికారి ఝాన్సీరాణి తెలిపారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో గౌడ వృత్తికి చెందిన సంఘాల నుంచి నిర్దిష్ట నిబంధనలు, మేరకు టెండర్లు ఆహ్వానిస్తున్నారు.

News March 11, 2026

యుద్ధం సెగలు.. HYDలో పెరిగిన ధరలు

image

మిడిలీస్ట్ యుద్ధం మంటలతో IT కారిడార్ హాస్టళ్లలో ఉండేవారికి, నిరుద్యోగుల కడుపు కాలుతోంది. యుద్ధ నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్ సరఫరా తగ్గడంతో చిన్న హోటళ్లలో ప్లేట్ టిఫిన్‌పై ₹5 వరకు పెంచేశారని ప్రజలు చెబుతన్నారు. దీనికి తోడు మధ్యాహ్నానికే గ్యాస్ అయిపోవడం, షట్టర్ కట్టేస్తుండటంతో 2 పూటలు కడుపు కాలుతోందంటున్నారు. హాస్టళ్లలో బేసిక్ మీల్స్ ఇవ్వాలని హాస్టళ్ల <<19350638>>అసోసియేషన్<<>> నిర్ణయించింది. దీనిపై మీ కామెంట్

News March 11, 2026

హైదరాబాద్‌లో హై టెన్షన్ తీర్పు

image

BRS నుంచి గెలిచి పార్టీ మారారనే ఆరోపణలు వచ్చిన 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మందికి స్పీకర్ క్లీన్‌చిట్ ఇచ్చారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి వాదనలు విన్న స్పీకర్ తీర్పు హై టెన్షన్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం ఈనెల 12లోపు నిర్ణయం ప్రకటించాలి. ఎంపీగా పోటీ చేసిన ఖైరతాబాద్‌ MLA దానాన్ని అనర్హుడిగా ప్రకటిస్తారా? క్లీన్ చిట్ ఇస్తారా? లేదా మరోసారి పొడిగిస్తారా? కాసేపట్లో తేలనుంది.

News March 11, 2026

TG గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణం

image

నేడు 11.30 గంటలకు HYDలోని లోక్ భవన్‌లో తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణం చేయనున్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ ప్రసాద్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సీఎస్, మంత్రులు తదితరులు హాజరవుతారు.

↑