Hyderabad

News March 13, 2026

HYD: ఫ్యాన్సీ నంబర్లతో భారీగా ఆదాయం

image

ఖైరతాబాద్ RTA కార్యాలయంలో ఫ్యాన్సీ నంబర్లు దక్కించుకొనేందుకే వాహనదారులు పోటీ పడ్డారు. TG 09 L 0009ను రూ.10,50,000కు, TG 09 L 0007కు రూ.3,19,999, TG 09 L 0005ను రూ.2,00,005కు, TG 09 K 9999ను రూ.1.5 లక్షలకు, TG 09 L 0024ను రూ.1.24 లక్షలకు, TG 09 L 0001ను రూ.లక్షకు దక్కించుకున్నారు. ఈ నంబర్లతో RTA ఆఫీస్‌కు రూ.31,14,730 ఆదాయం వచ్చింది.

News March 13, 2026

HYD: రూ.5 భోజనం వెనక పక్కా ప్రణాళిక

image

HYDలో రూ.5 భోజనం వెనక పక్కా ప్రణాళిక ఉంది. ప్రతి ప్లేటు ఖరీదు దాదాపు రూ 24.25 అవుతుండగా, సామాన్యుడు చెల్లించేది రూ.5 మాత్రమే. మిగిలిన రూ.19.25 సబ్సిడీని GHMC భరిస్తోంది. ప్రభుత్వం బడ్జెట్‌లో ఏటా రూ.కోట్లు కేటాయిస్తోంది. హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ కేవలం వంట వండటమే కాకుండా నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణ బాధ్యతను తీసుకుంది. ఈ సమన్వయం వల్లే నగరంలో రోజూ <<19364297>>45 వేల<<>> మందికి పైగా ఆకలి తీరుతోంది.

News March 13, 2026

HYD అభివృద్ధి@2050.. కీలక ప్రతిపాదనలు

image

HYD మెట్రోపాలిటన్ ప్రాంతం కోసం సమగ్ర మొబిలిటీ ప్రణాళిక వర్క్‌షాప్‌‌లో ఉన్నతాధికారులు కీలక ప్రతిపాదనలు చేశారు. 2050 వరకు మౌలిక సదుపాయాల ప్రణాళిక కోసం బ్లూ, గ్రీన్ మాస్టర్ ప్లాన్‌కు ప్రతిపాదించారు. మెట్రో నెట్‌వర్క్ పెంపు, రోడ్లు, హైవేలు, ఆర్టీరియల్, సబ్ ఆర్టీరియల్ కారిడార్లు, 120 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు/స్కైవాక్‌లు, 34 ROBలు, 16 RUBలు, 8 ఎలివేటెడ్ రోడ్లు, మూసీ నదిపై 29 వంతెనల కోసం ప్రతిపాదించారు.

News March 12, 2026

Trending: HYDలో నైట్ లైఫ్‌కు కొత్త VIBE

image

సిటీలో నైట్ సీన్ మామూలుగా లేదు బాసూ. కేవలం బిర్యానీతోనే సరిపెట్టకుండా మన GEN-Z కొరియన్ ఫుడ్, చీజ్ బర్స్ట్ స్నాక్స్ కోసం క్యూ కడుతున్నారు. రీల్స్ కోసం ‘ఫైర్’ ఐటమ్స్, క్యాన్ డెజర్ట్స్ ఇప్పుడు ట్రెండింగ్. వీకెండ్ వచ్చిందంటే చాలు.. లేట్ నైట్ డ్రైవ్స్, అదిరిపోయే డీజే మ్యూజిక్, లైవ్ గిగ్స్‌తో హైదరాబాద్ హోరెత్తిపోతోంది. అటు తిండి.. ఇటు మ్యూజిక్ కలిసి హైదరాబాద్ నైట్ లైఫ్ ఇప్పుడు నెక్స్ట్ లెవల్‌లో ఉంటోంది.

News March 12, 2026

HYD: ఫ్లై ఓవర్ కింద అద్భుతం.. స్పోర్ట్స్ అరేనా సూపర్

image

నగర యువతకు అదిరిపోయే శుభవార్త. మైదానాల కొరతతో ఆటలకు దూరమవుతున్న క్రీడా ప్రేమికుల కోసం MMC కార్పొరేషన్ ఒక అద్భుతమైన కానుకను సిద్ధం చేస్తోంది. బైరామల్‌గూడ ఫ్లైఓవర్ కింద నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాన్ని సకల వసతులతో కూడిన రంగురంగుల ‘స్పోర్ట్స్ అరేనా’గా తీర్చిదిద్దారు. పనులు చివరి దశకు చేరుకొన్నాయి. త్వరలోనే ఫ్లైఓవర్ నీడన ఆటలు ఆడుకోవచ్చు. నగరంలోని అన్ని ఫ్లై ఓవర్ల కింద ఇలా చేస్తే బాగుంటుంది. మీ కామెంట్?

News March 12, 2026

HYD: గ్యాస్ లేకపోతే ఈ ఆలోచన మీకు రాదా?

image

రూ.5కే కడుపు నింపుతున్న సంస్థలు స్టీమ్ బాయిలర్లు వాడుతుంటే.. వేలల్లో బిల్లులు వసూలు చేసే 5 స్టార్ హోటళ్లు, హాస్టళ్లు గ్యాస్ వాడుతున్నాయి. గ్యాస్ ధర పెరిగిందని కస్టమర్ల జేబులు కత్తరించే బదులు హరే రామ హరే కృష్ణ ట్రస్ట్‌ల స్టీమ్ వంట పద్ధతికి మారితే ఖర్చు తగ్గుతుంది కదా. కార్పొరేట్ హాస్టళ్లు గ్యాస్ సంక్షోభం సాకుతో మెస్ ఛార్జీలు పెంచడం కరెక్టేనా? గ్యాస్ లేకపోతే.. స్టీమ్ బాయిలర్లు ఉన్నాయి. <<19364190>>సోచో జరా!<<>>

News March 12, 2026

HYDలో గ్యాస్ సెగ.. రూ.5 ‘బువ్వే దిక్కు’

image

నగరంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2100 దాటి సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. హోటళ్లలో ప్లేట్ మీల్స్ ధరలు ఆకాశాన్ని తాకుతుంటే లక్షలాది మంది విద్యార్థులు, కార్మికులకు రూ.5 భోజనం ప్రాణవాయువులా మారింది. గ్యాస్ కష్టాలను అధిగమించడానికి ఈ కేంద్రాల్లో స్టీమ్ ఆధారిత వంట పద్ధతులను వాడుతున్నారు. గతంలో 150 ఉన్న యూనిట్లు ఇప్పుడు దాదాపు 170కి పెరగడం డిమాండ్‌కు నిదర్శనం.

News March 12, 2026

HYD: ఇది సంక్షోభం కాదు.. ప్రమాదం!

image

HYDలో పైపుల లీకేజీ సమస్యతో సంక్షోభం కాదు, భూగర్భ జలాలు వేగంగా పడిపోవడమే ప్రమాదం. పాతబస్తీ, ఖైరతాబాద్, అమీర్‌పేట్‌లో భూగర్భ జలాలు గతంతో పోలిస్తే 2.5మీటర్లకు పడిపోయాయి. భారీ నిర్మాణాలు, కాంక్రీటు జంగిల్‌గా మారుతున్న నగరంలో వర్షపు నీరు భూమిలోకి ఇంకడం లేదు. ఇంకుడు గుంతలు తప్పనిసరి అని చెబుతున్నా, పాత భవనాల్లో వీటి అమలు సున్నా. వేసవిలో ట్యాంకర్ల వ్యాపారం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

News March 12, 2026

HYD: ఆస్తి పన్ను వడ్డీపై 90% రాయితీ

image

పాత ఆస్తి పన్ను బకాయిలు ఉన్న నగరవాసులకు జీహెచ్‌ఎంసీ భారీ ఊరటనిస్తూ OTS పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద పన్ను బకాయిలపై ఉన్న వడ్డీలో 90 శాతం రాయితీ కల్పిస్తున్నారు. ఈ అవకాశాన్ని కేవలం మార్చి 31వ తేదీలోపు పన్ను చెల్లించిన వారు మాత్రమే పొందగలరని అధికారులు స్పష్టం చేశారు. ఆసక్తి గల వారు జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్, MyGHMC యాప్, మీసేవ కేంద్రాల ద్వారా తమ బకాయిలను చెల్లించవచ్చు.
SHARE IT

News March 12, 2026

ఇదే కొనసాగితే హైదరాబాద్‌‌లో బంద్!

image

నగరాన్ని గ్యాస్ కొరత కలవరపెడుతోంది. CNG స్టేషన్ల వద్ద బారులు తీరిన ఆటోలు, చర్లపల్లి గ్యాస్ ప్లాంట్ వద్ద నిలిచిన లారీలు, పలు రెస్టారెంట్లు, హోటళ్లలో ఖాళీ కుర్చీలు, స్టోర్‌లలో నిండుకుంటున్న ఇండక్షన్ స్టౌవ్‌లు, ప్రజల ముఖంలో దిగులు ఇవి HYDలో కనపడుతున్న దృశ్యాలు. గ్యాస్ సరఫరాలో ఇబ్బంది కొనసాగితే ‘HYD బంద్’ అయ్యి జనజీవనం స్తంభించడం, కడుపుమండటం, ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

↑