Hyderabad

News March 14, 2026

HYD: ఓల్డ్ సిటీ ఇక ‘హైటెక్’ గుమ్మం!

image

ట్రాఫిక్ సమస్యతో విసిగిపోయిన టోలిచౌకీ వాసులకు త్వరలో కొత్త అనుభూతి పలకరించనుంది. టూంబ్స్ నుంచి బంజారా దర్వాజా వరకు రోడ్డు మధ్యలో పచ్చని మీడియన్లు, ఫ్లైఓవర్ కింద అందమైన జంక్షన్లతో ఈ ప్రాంతం సరికొత్తగా ముస్తాబవుతోంది. సుమారు రూ.3.05 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ పనులు ప్రయాణికులకు కంటికి ఇంపుగా, మనసుకు హాయినివ్వనున్నాయి. భాగ్యనగర వైభవం మీ గుమ్మం ముందుకు రాబోతోంది.

News March 14, 2026

సమ్మర్ ఎఫెక్ట్.. HYDలో KG@325

image

ఎండకాలం ప్రారంభంలోనే చికెన్ ధరలు కొండెక్కాయి. శనివారం KG చికెన్ రూ.325 నుంచి 330 వరకు పలకడం గమనార్హం. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కిలో స్కిన్‌తో కూడిన చికెన్ ధర రూ.286గా ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.325కు చేరుకుంది. వేసవి మొదలులో ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ధరలు ఇంకెంత పెరుగుతాయోనని చికెన్ ప్రియులు సందేహ పడుతున్నారు. మీ ఏరియాల్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి.

News March 14, 2026

HYD: రూ.5‌కే భోజనం.. గ్యాస్ ఇబ్బందులు లేవు!

image

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ.5 కే భోజనానికి గ్యాస్ ఇబ్బంది ఇప్పట్లో లేనట్లే. ఎందుకంటే ఇక్కడ అన్నం, పప్పును సోలార్ ప్యానల్ ద్వారా వచ్చే విద్యుత్‌తో వండుతారు. తక్కువ మొత్తంలో మాత్రమే గ్యాస్ వినియోగం ఉంటుంది. అయితే దీనికి నిల్వలు ఉన్నాయని, మరికొంత కాలం ఇలాగే కొనసాగితే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదే రీతిలో అందరూ వాడితే గ్యాస్ వినియోగం తగ్గించుకోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

News March 14, 2026

‘500 మంది ‘సైబర్ సింబా’లకు శిక్షణ’

image

సైబర్ నేరగాళ్లను అడ్డుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ప్రజలకు అవగాహన కల్పిస్తున్న నేరాలు ఆగడం లేదు. దీంతో ‘సైబర్ సింబా’ పేరుతో వాలంటీర్లను సిద్ధం చేశారు. తొలిదశలో 500 మందికి శిక్షణ ఇచ్చారు. వీరు పోలీస్ స్టేషన్‌తో అనుసంధానమై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. వీరికి హైదరాబాద్ సీపీ సజ్జనార్ శుభాకాంక్షలు తెలిపారు. సైబర్ నేరాల అడ్డుకట్టలో భాగం కావాలని పిలుపునిచ్చారు.

News March 14, 2026

HYD: 600 ఎకరాల భూమి వేలం!

image

బడ్జెట్‌లో నిధుల లోటును పూడ్చుకోవడానికి ప్రభుత్వం నగర శివార్లలోని ప్రభుత్వ భూములను విక్రయించేందుకు సిద్ధమైంది. కోకాపేట, బుద్వేల్ తర్వాత ఇప్పుడు ‘కిస్మత్‌పూర్’, ‘తారామతి-బారామతి’ పరిసరాల్లో సుమారు 600 ఎకరాల వివాదరహిత భూములను వేలం వేయాలని క్యాబినెట్ రహస్యంగా నిర్ణయించింది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. కనీసం ₹15,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా.

News March 14, 2026

హైదరాబాద్‌లో పెరిగిన ఎయిర్ పొల్యూషన్

image

నగరంలో గాలి నాణ్యత పడిపోతుండటంతో ప్రజల ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా రెండంకెల్లో ఉండాల్సిన గాలి నాణ్యత సూచీ శనివారం అంబియాన్స్ పోర్టు హైదరాబాద్‌లో 240గా నమోదైంది. వాహనాల పొగ, చెత్తాచెదారం తగలబెట్టడం కారణంగా కాలుష్య స్థాయిలు పెరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. ఇటీవల మొదలైన కట్టెల పొయ్యితో మరింత క్షీణించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

News March 14, 2026

మూసీ ప్రక్షాళన: భూసేకరణ గండం.. బడ్జెట్‌లో ‘నిశ్శబ్దం’!

image

మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వడం లేదు. లండన్ థేమ్స్ నదిలా మారుస్తామన్న హామీ బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో 3,279 ఎకరాల భూసేకరణ అతిపెద్ద సవాలుగా మారింది. సుమారు 10,017 ఆస్తులను స్వాధీనం చేసుకోవాల్సి ఉండగా బాధితుల నుంచి వస్తున్న నిరసనలను అసెంబ్లీలో చర్చకు రాకుండా జాగ్రత్త పడుతోంది. నిధుల సమీకరణపై ‘గోప్యత’ పాటిస్తోంది.

↑