India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వాణిజ్య గ్యాస్ కొరత సాకుతో నగరంలో హోటల్ తిండి హోరెత్తుతోంది. టీ కప్పు నుంచి టిఫిన్ ప్లేట్ దాకా రూ. 5 నుంచి రూ. 10 పెంచేసిన హోటళ్లు.. గ్యాస్ సరఫరా చక్కబడినా ధరలు తగ్గించే ‘చరిత్ర’ మాత్రం లేదు. గతంలో ధరలు పెరిగినప్పుడు పెంచిన రేట్లు, మళ్లీ తగ్గినా కిందికి రాలేదు. ఉదాహరణకి ఆనియన్ సలాడ్! ఈ భారమంతా ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన విద్యార్థులు, మధ్యతరగతి జీవుల మీదనే పడుతోంది. ఈ దోపిడీని అడ్డుకోరా?

తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి తీవ్రంగా ఖండించారు. పార్టీ మారుతున్నాననే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. “నా వయస్సు 73 ఏళ్లు, ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో నాకు బాగా తెలుసు” అని పేర్కొన్న ఆయన కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే లాంటిదని ఎద్దేవా చేశారు. ఇటీవల CMని కలిసింది కేవలం తన ఓ వేడుకకు ఆహ్వానించడానికి మాత్రమేనన్నారు.

సంతానం లేని దంపతుల బలహీనతను ఆసరాగా చేసుకొని సాగుతున్న భారీ దందాను ED బయటపెట్టింది. పేద మహిళలను ప్రలోభపెట్టి, వారితో పుట్టిన పిల్లలను భారీ ధరలకు అమ్ముతున్నట్లు దర్యాప్తులో తేలింది. ఆడపిల్లకు ₹3.5 లక్షలు, మగపిల్లకు ₹4.5 లక్షల చొప్పున బేరసారాలు సాగుతున్నాయి. ఈ అక్రమ సంపాదనతో కొన్న సుమారు 50 ఆస్తులను అధికారులు జప్తు చేశారు. ‘మనీ లాండరింగ్’ నెట్‌వర్క్ అని పక్కాగా నిర్ధారించారు.

నగరంలో వీకెండ్ రక్తపాతం జరిగింది. వరుస ప్రమాదాలు, దారుణ ఘటనలు కలకలం రేపాయి. మేడిపల్లిలో కారు ఢీకొనడంతో దంపతులు దుర్మరణం పాలయ్యారు. ఒక్కగానొక్క కొడుకు అనాథయ్యాడు. ఉప్పల్‌లో కానిస్టేబుల్ సుధీర్‌ను దారుణంగా కత్తులతో హత్య చేశారు. శంషాబాద్‌లో వాహనం ఢీకొని విజయ్ (32) మృతి చెందాడు. గచ్చిబౌలిలో కర్ణాటక RTC బస్సు ఢీకొనడంతో బాలమ్మ (68) ప్రాణాలు కోల్పోయింది. ఒకే రోజు ఇన్ని దారుణాలు జరిగాయి.

‘‘పార్టీ ఏదైనా హైదరాబాద్ ప్రజలు మిమ్మల్ని నాయకుడిగా ఆదరించారు. సిటీ సమస్యలను పరిష్కరిస్తారనే ఆశతోనే మీకు ఓటు వేశారు. ఇప్పటికి రెండు సంవత్సరాలు పూర్తి అయ్యాయి. సిటీలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ రోజు జరిగే అసెంబ్లీలో మీరు (సిటీ ఎమ్మెల్యేలు) గళం విప్పితే సర్కారు వింటుంది. అపుడు సమస్యలు పరిష్కారమయ్యేందుకు వీలుంటుంది. అందుకే MLA సాబ్ సభలో లొల్లిజేశైనా సమస్యను తెంపు’ అని నగరవాసులు కోరుతున్నారు.

HYDలో గ్యాస్ కొరత వార్తలు సామాన్య ప్రజల పాలిట శాపంగా మారింది. బషీర్‌బాగ్‌లోని ఫుల్‌బాగ్ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గ్యాస్ ధరలు పెరిగాయనే నెపంతో ప్రతి ఫుడ్ ఐటమ్ మీద అదనంగా రూ.20 వసూలు చేస్తున్నారు. ఇష్టానుసారంగా పెంచుతోన్న ధరలతో సామాన్య ప్రజలు వాపోతున్నారు. కట్టడి చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు.

HYDలో నేడు భారీ ఈవెంట్లు జరగనున్నాయి. యూసుఫ్‌గూడలో ‘<<19385959>>ఉస్తాద్ భగత్ సింగ్<<>>’ ప్రీరిలీజ్, LBస్టేడియంలో ‘ఇఫ్తార్’తో రోడ్లు క్లోజ్ అవ్వనున్నాయి. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్↦ KVBR స్టేడియం↦ పంజాగుట్ట, మైత్రీవనం↦ కృష్ణానగర్ జంక్షన్↦ జూబ్లీహిల్స్, మాదాపూర్..
ఎల్బీస్టేడియం↦ ARపెట్రోల్ పంప్, బషీర్‌బాగ్, సుజాత స్కూల్ రోడ్లు క్లోజ్ అవుతాయి. లక్డికాపూల్, రవీంద్రభారతి, లిబర్టీ వద్ద రద్దీ ఉంటుందని పోలీసులు తెలిపారు.

‘కారు’ దిగి ‘చేయి’ వచ్చినా కాళేశ్వరం, మూసీ కూల్చివేతలపై సభ కుదిపేయనుంది. నిధుల కొరతతో సర్కార్, ఫిరాయింపులతో విపక్షం కత్తులు నూరుతున్నాయి. బయ్యారం ఉక్కు, గిరిజన వర్సిటీ కాగితాలకే పరిమితం కాగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రిపేర్ యూనిట్‌గా మారింది. కమలం విభజన హామీలని మర్చిపోగా పతంగి, కొత్త బీసీ పార్టీలు, ఎర్రజెండా అంతా ఓటు బ్యాంకు రాజకీయంలో మునిగారు. ఇందులో అమ్మడుపోయిన ఓటర్లూ బాధ్యులే. దీనిపై మీ కామెంట్?

ఈ సండే సిటీ అంతా సందడిగా మారనుంది. ఓవైపు యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో అభిమానుల కోలాహలం, మరోవైపు LBస్టేడియంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఇఫ్తార్ విందు’తో వీఐపీల రాక, వీటికి తోడు రంజాన్ నెల చివరి ఆదివారం కావడంతో పాతబస్తీ నైట్ బజార్‌కు పోటెత్తనున్న జనం. ఇలా నగరం నలుమూలలా భారీ ఈవెంట్లతో హైదరాబాద్ నేడు ‘ఫుల్ జోష్’లో ఉండబోతోంది.

మనుషుల దాహాన్ని తీర్చి, పొలాలకు నీరందించే నదులు నేడు కన్నీరు పెడుతున్నాయి. మానవ అవసరాల కొరకు నదిలోని ఇసుక తవ్వేస్తున్నాడు. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. రసాయనాలను విడుదల చేసి నదులను కలుషితం చేస్తున్నాడు. నదులు మన సంస్కృతికి చిహ్నాలు. మన జిల్లాలోనే పుట్టి సర్వ నాశనం అయిన మూసీ ఇందుకు ఉదాహరణ. ఇకనైనా మేల్కొందాం.. రాజకీయాలకు అతీతంగా మన మూసీని కాపాడుకుందాం.
నేడు International Day of Action for Rivers
Sorry, no posts matched your criteria.