India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD, RR, MDCL, VKB ప్రాంతాల ప్రజలు ఆగస్టు నెల పైన ఆశలు పెట్టుకున్నారు. జూన్, జులై నెలల్లో పెద్దగా భూగర్భ జలమట్టాలు పెరగలేదు. 250 ప్రాంతాల్లో అధికారులు నిర్వహించిన ఫీజోమీటర్ తనిఖీల్లో HYD జిల్లాలో మేలో 9.42 మీటర్ల లోతుకు పడిపోతే, జూన్లో 8.56 మీటర్లకు మాత్రమే పెరిగింది. మరోవైపు రంగారెడ్డిలో మే నెలలో 14.06 నుంచి జూన్లో 13.99, మేడ్చల్ జిల్లాలో 13.99 నుంచి 12.89 మీటర్లకు స్వల్పంగా పెరిగాయి.
HYDలోని హైటెక్ సిటీలో అమింగ్ ఇండియా సంస్థ ఏర్పాటుకు ముందుకొచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దాదాపుగా 3000 మంది నిపుణులతో దీన్ని ఏర్పాటు చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, డేటా సెన్స్, లైఫ్ సైన్సెస్ లాంటివి అనేక డిజిటల్ అంశాలపై బయోలాజికల్ సంస్థ సేవలు అందించనుంది. వరల్డ్ క్లాసు లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టం అందుబాటులోకి రానున్నట్లు సీఎం తెలిపారు.
HYD మహా నగరంలో సైరన్లతో వెళ్లే ఫేక్ అంబులెన్స్‌లపై అధికారులు ఫోకస్ పెట్టారు. బోయిన్‌పల్లి మీదుగా నగరంలోని పలు ప్రాంతాలకు ప్రవేశించిన పలు జిల్లాలకు చెందిన ఫేక్ అంబులెన్స్‌లపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా.. 38కి పైగా సైరన్ మోగిస్తూ ఫేక్ అంబులెన్స్ వాహనాలను అధికారులు గుర్తించారు.
గ్రేటర్ HYD పరిధిలో మలక్‌పేట్ ప్రాంతానికి చెందిన సయ్యద్ అబ్దుల్ రహీం 1950 నుంచి 1963 వరకు భారత్ ఫుట్ బాల్ టీమ్ కోచ్‌గా వ్యవహరించారు. ఈ కాలం భారత ఫుట్ బాల్ క్రీడకు స్వర్ణ యుగం అని చెప్పవచ్చు. సయ్యద్ అబ్దుల్ రహీం ఫుట్ బాల్ క్రీడకు చేసిన సేవలు ఇతివృత్తంతో ఇటీవల మైదాన్ సినిమా సైతం తీశారు. కాగా తాజాగా ఫుట్ బాల్ మైదానాల ఏర్పాటుకు GHMC రంగం సిద్ధం చేయడంతో మళ్లీ మన HYD ఫుల్‌బాల్ క్రీడలో దూసుకుపోనుంది.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వికారాబాద్‌కు చెందిన విజయ్‌ను HYD సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ మాట్లాడిన వీడియోలను సేకరించి కించపరిచేలా పోస్టులు చేశాడని పోలీసులు తెలిపారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉందని హెచ్చరించారు.
PHD ఫలితాల విడుదలపై కొనసాగుతున్న ఉత్కంఠ అనే శీర్షికపై Way2 Newsలో వచ్చిన కథనానికి JNTU యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు స్పందించారు. సోమవారం PHD ఫలితాలను విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని దానికి అనుగుణంగా నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి ఈ ప్రక్రియ కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
గ్రేటర్ HYD నగరంలో ఫుట్‌బాల్ పై ఆసక్తి పెంచడంతో పాటు, క్రీడాకారులను తయారు చేసినందుకు జీహెచ్ఎంసీ ప్రణాళిక రచిస్తోంది. అనువైన ప్రాంతాల కోసం అన్వేషిస్తోంది. 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఒక్కో జోన్ ప్రాంతంలో ఒక్కో ఫుట్ బాల్ కోర్టు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
HYD శివారు RR జిల్లా ముచ్చర్ల ప్రాంతంలో స్కిల్ యూనివర్సిటీకి ఇటీవల శంకుస్థాపన జరిగిన విషయం విదితమే. స్కిల్ యూనివర్సిటీ ఈ విద్యా సంవత్సరంలోనే 6 కోర్సులతో ప్రారంభం కానుంది. అయితే మొత్తం వర్సిటీలో 17 కోర్సులు ప్రవేశపెడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శిక్షణ 3 నుంచి 6 నెలలు ఉంటుందని, డిగ్రీతో పాటు డిప్లొమా కోర్సులు ఉంటాయన్నారు. ఏడాదికి రూ.50 వేల నామమాత్రపు ఫీజు వసూలు చేయనున్నారు.
పాతబస్తీ పరిధి బహుదూర్‌పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్‌ను పోలీసులు ఈరోజు హౌస్ అరెస్ట్ చేశారు. శాస్త్రిపురంలో 12 ఎకరాల విస్తీర్ణం కలిగిన చెరువులో 5 ఎకరాలను కబ్జా చేసి వెంచర్ ఏర్పాటు చేసినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. శనివారం అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న నేపథ్యంలో ముందస్తుగా ఎమ్మెల్యే ముబీన్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. ఎంఐఎం కార్పొరేటర్లను కూడా హౌస్ అరెస్ట్ చేసినట్లు సమాచారం.
JNTU పరిధిలో PHD పరీక్షల ఫలితాల విడుదలపై స్పష్టత లేకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. జులై 20,21వ తేదీన ప్రవేశ పరీక్షలు నిర్వహించగా ఇప్పటివరకు ఫలితాలు వెల్లడించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా ఫలితాలు విడుదల ఆలస్యం కావడంతో విద్యార్థులు దానిపై సుముఖత చూపకపోవడంతో సీట్లు మిగిలిపోయాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఫలితాలు విడుదల చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.