Hyderabad

News February 27, 2026

KPHBలో గజం భూమి రూ. 2.65 లక్షలు

image

KPHBలో హౌసింగ్ బోర్డు స్థలాలు, ఫ్లాట్లు రికార్డు ధరలకు అమ్ముడయ్యాయి. తెలంగాణ హౌసింగ్ బోర్డు నిర్వహించిన బహిరంగ వేలంలో KPHBలో చదరపు గజం భూమి గరిష్ఠంగా రూ.2.65 లక్షలకు విక్రయమైంది. 1400 ఎస్‌ఎఫ్‌టీ ఫ్లాట్ ధర రూ.1.10 కోట్లకు చేరింది. మొత్తం 12 ఆస్తుల వేలం ద్వారా రూ.24.26 కోట్ల ఆదాయం లభించినట్లు వైస్‌ ఛైర్మన్ వి.పి.గౌతం తెలిపారు. ఓపెన్ ప్లాట్స్ ద్వారా రూ.15.81 కోట్లు, ఫ్లాట్స్ రూ.8.45 కోట్లు వచ్చాయి.

News February 27, 2026

HYD: ఆ రోజు ఆలయాలు బంద్!

image

చంద్రగ్రహణం దృష్ట్యా మార్చి 3న కడ్తాల్‌లోని మైసిగండి మైసమ్మ ఆలయంతో పాటు శివాలయ, రామాలయాలు మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో స్నేహలత చెప్పారు. మూడో తేదీ ఉదయం ఏడు గంటల నుంచి 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఆలయాలను మూసివేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆలయ శుద్ధి, అభిషేకం, అలంకరణ అనంతరం భక్తుల దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. గ్రహణం దృష్య్టా నగరంలోని ప్రముఖ ఆలయాలను సైతం మూసివేయనున్నారు.
SHARE IT

News February 27, 2026

HYD: ‘గాలి’ రిపేర్లు.. ‘అసలు’ బిల్లులు!

image

భూమి లోపల పైపులైన్ రిపేరు జరగదు కానీ కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి మాత్రం నిధులు చేరిపోతున్నాయి. పాత లీకేజీల ఫొటోలనే కొత్తవిగా చూపిస్తూ క్షేత్రస్థాయిలో పని చేయకుండానే బిల్లులు డ్రా చేసే ‘ట్రిక్కు’ జలమండలిలో వైరల్ అయ్యింది. సెక్షన్ ఆఫీసర్ల అండదండలతోనే ఈ బోగస్ బిల్లుల దందా సాగుతోంది. థర్డ్ పార్టీ క్వాలిటీ చెక్ పేరుకే తప్ప అంతా కాంట్రాక్టర్ల కనుసన్నల్లోనే నడుస్తోంది. ఈ అవినీతి మురికిని కడగాల్సి ఉంది.

News February 27, 2026

HYD: మామూళ్ల మోజులో అధికారులు.. మెమోలు..!

image

​శివారు కాలనీల్లో నీటికోసం జనం తపిస్తుంటే అధికారులు మాత్రం ట్యాంకర్ మాఫియాతో చేతులు కలిపారు. కావాలనే పైపులైన్లలో ప్రెజర్ తగ్గించి ప్రైవేట్ ట్యాంకర్లకు కొమ్ము కాస్తున్నారు. ప్రభుత్వ ఫిల్లింగ్ పాయింట్ల వద్దే తక్కువ ధరకు నీటిని నింపుకొని బయట రూ.2000 వరకు అమ్ముతూ సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నారు. ఈ దందాలో కిందిస్థాయి నుంచి పైదాకా వాటాలు వెళ్తున్నాయని తేలడంతో కొందరు అధికారులకు మెమోలు జారీ అయ్యాయి.

News February 27, 2026

HYD: జరిగింది సరే.. ఎవరు బాధ్యత వహిస్తారు..?

image

​దాదాపు 30% డిజిటల్ మీటర్లు పనిచేయడం లేదని స్వయంగా హైదరాబాద్ మహానగర జలమండలి అధికారులే క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించారు. మీటర్లు రీడింగ్ చూపించకపోవడం వల్ల వినియోగదారులకు ‘లాక్డ్ రీడింగ్’ (Locked Reading) పడటం లేదు. దీంతో వచ్చే అదనపు ఆదాయం బోర్డుకు వెళ్తున్నా, మీటర్ల కొనుగోళ్లలో జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు..?

News February 27, 2026

HYD: రూల్స్‌ జానతా నై.. ‘సిండికేట్’గా నొక్కేశారు..!

image

హైదరాబాద్ మహానగర జలమండలి అంతర్గత ఆడిట్ విభాగం <<19251869>>రూ.450 కోట్ల<<>> వ్యయంలో జరిగిన తేడాలను గుర్తించింది. ముఖ్యంగా మీటర్ల కొనుగోలులో టెండర్ నిబంధనలను ఒక నిర్దిష్ట కంపెనీకి అనుకూలంగా మార్చినట్లు (Tailor Made Conditions) తేలింది. నిబంధనల ప్రకారం కనీసం మూడు కంపెనీలు పోటీ పడాలి, కానీ ఇక్కడ ‘సిండికేట్’గా ఏర్పడి రూల్స్‌ను గాలికొదిలేశారు.

News February 27, 2026

HYDలో మీటర్ల ‘మాయాజాలం’.. ₹450 కోట్ల SCAM..?

image

నగరంలో ఉచిత నీళ్ల పేరుతో మీటర్ల దందా జోరుగా సాగుతోంది. పనికిరాని డిజిటల్ మీటర్లను సిండికేట్ కంపెనీల నుంచి భారీ రేట్లకు కొనేశారు. దాదాపు 30% మీటర్లు డబ్బాలే అని ఆడిట్‌లో తేలినా అధికారులు కళ్లు మూసుకున్నారు. రూ.450 కోట్ల ప్రజాధనం పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. టెండర్ల నిబంధనలు మార్చి మరీ ‘ఫేవరెట్’ కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం వెనుక పెద్దల హస్తం ఉందన్నది కాదనలేని సత్యం. అసలు తిమింగలాలు వేరే ఉన్నాయి.

News February 27, 2026

మేడ్చల్: వృద్ధుడికి సెంచరీ సెలబ్రేషన్స్.. అంతలోపే

image

ఆయనకు నిండునూరేళ్లు నిండాయి. గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ చేద్దామని కుటుంబం ఏర్పాట్లు చేసుకుంది. అంతలోనే ఆ వృద్ధుడు మృతిచెందారు. బీదర్‌కు చెందిన దొండచార్య జోషి(100) బోడుప్పల్ గాయత్రినగర్‌లో స్థిరపడ్డారు. బీదర్ HYD సంస్థానంలో ఉన్న సమయంలో రజాకార్ల దౌర్జన్యంపై ఈయన దండెత్తారు. KA, MH రాష్ట్రాల విభజనలో పాల్గొన్నారు. గతేడాది బోడుప్పల్‌లో అఖిల బ్రాహ్మణ వికాస సమితీ ఆధ్వర్యంలో 99వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.

News February 27, 2026

HYD: ఛీ.. ఛీ.. శవాల మీద పేలాలు ఏరుకోవడమంటే ఇదేనేమో..!

image

అవినీతికి కాదేదీ అనర్హం అన్నట్లుగా ఉంది GHMC తీరు. ఆఖరికి ప్రజారోగ్యానికి చేసే దోమల ఫాగింగ్‌లోనూ స్కాంకు పాల్పడుతున్నారు. తాజాగా మల్కాజ్‌గిరి సర్కిల్‌లో ఫాగింగ్‌కు వాడే డీజిల్‌ను సూపర్వైజర్లు, AE, SEల అండతో సిబ్బంది రూ.10ల కమీషన్ చొప్పున పెట్రోల్ బంకులకు అమ్ముకుంటోంది. పంపకాల్లో తేడాలు రావడంతో ఈ ‘దోమల దండు’ బాగోతం బయటకు పొక్కింది. కాగా ప్రభుత్వం దోమల నివారణకు ఏడాదికి రూ.32 కోట్లు ఖర్చు చేస్తోంది.

News February 27, 2026

HYD: సారూ.. అందెశ్రీకి ఇచ్చే గౌరవం ఇదేనా?

image

ప్రముఖ కవి, TG గేయ రచయిత అందెశ్రీ మరణించి 108 రోజులు గడిచినా సమాధి కోసం ఒక్క ఇటుక కూడా పెట్టకపోవడం సిగ్గుచేటని జనాలు మండిపడుతున్నారు. TG ఉద్యమానికి స్వరం ఇచ్చిన కవికి కనీస గౌరవం లేకపోవడం దురదృష్టకరమని దుమ్మెత్తిపోస్తున్నారు. పాడె మోసి, స్మృతి వనం కడతామని హామీ ఇచ్చిన సీఎం మాటలు నీటి మూటలయ్యాయని కొందరు పెదవి విరుస్తున్నారు. నెలలు గడుస్తున్నా సమాధి పనులు మొదలుకాకపోవడంపై విమర్శలొస్తున్నాయి.

↑