India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇంజినీరింగ్ కళాశాలల్లో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను రీషెడ్యూల్ చేశారు. కొత్త షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 2 నుంచి ఈ ప్రక్రియ మొదలుకానుంది. TGPGEC/టీజీపీజీఈసెట్-2024 ప్రవేశాల రీషెడ్యూల్ ప్రకారం ఈ నెల 24 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. అనంతరం 25న అర్హుల జాబితా ప్రకటిస్తారు. 29న వెబ్ ఆప్షన్ల సవరణ, సెప్టెంబర్ 1న తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సంయుక్త ఆధ్వర్యంలో ఐటీ కంపెనీల భవనాలకు హై రేంజ్ కెమెరాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 70 ప్రాంతాల్లో కెమెరాలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. వీటి ద్వారా ట్రాఫిక్ జామ్‌ను గుర్తించి క్లియర్ చేయనున్నారు.
నిమ్స్‌లో 2024 విద్యా సంవత్సరానికి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, అనుబంధ హెల్త్ సైన్సెస్‌లో బీఎస్సీ డిగ్రీ కోర్సులో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థ తెలిపింది. బీపీటీలో 50, బీఎస్సీ నర్సింగ్‌లో 100, బీఎస్సీ డిగ్రీలో 100 సీట్లు ఉన్నట్లు తెలిపింది. ఈ నెల23 లోపు అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని నిమ్స్ డీన్ రాజశేఖర్ గురువారం వివరించారు.
సచివాలయ భద్రత మళ్లీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) చేతుల్లోకి వెళ్లనుంది. ప్రస్తుతం తెలంగాణ ప్రత్యేక పోలీసు పటాలం(టీజీఎస్సీ) సిబ్బంది ఈ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా వీరి స్థానంలో ఎస్పీఎఫ్ మోహరించే అవకాశం కనిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వచ్చే నెల 1వ తేదీ నుంచి ఈ మార్పు అమలులోకి వచ్చే రానుంది.
నాగులపంచమి రోజున పూజల పేరుతో పాములను పట్టుకుని హింసించవద్దని భారతీయ ప్రాణి మిత్ర సంఘ్ అధ్యక్షుడు జస్‌రాజ్‌శ్రీ శ్రీమల్, ప్రధాన కార్యదర్శి మహేశ్ అగర్వాల్ విజ్ఞప్తి చేశారు. కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. పాములను హింసించే వారి సమాచారాన్ని టోల్‌ఫ్రీ నంబర్ 18004255364కు తెలియజేస్తే బహుమతి ఇస్తామని ప్రకటించారు.
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పాతదొనబండ తండా వాసి భూక్యా మౌనిక ఏకంగా 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. పేద కుటుంబానికి చెందిన ఆమె HYD దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటూ స్థానికంగా ఉండే పిల్లలకు హోమ్ ట్యూషన్లు చెబుతూ ఆమె చదువుకుంది. ఎలాంటి కోచింగ్ లేకుండానే గ్రూప్-4 ఆరో ర్యాంకు, TGPSC ఫలితాల్లో పంచాయతీరాజ్ AEE, 2023లో రైల్వేలో క్యారేజ్ అండ్ వ్యాగన్, లెవల్-3లో కమర్షియల్ కం టికెట్ క్లర్క్ జాబ్స్ సాధించింది.
ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్‌కు రెండవ శనివారం తప్పక సెలవు ఇవ్వాలని TPTLF(తెలంగాణ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ ఫెడరేషన్) డిమాండ్ చేస్తోంది. నాంపల్లిలో విద్యాశాఖ అడిషనల్ డెరైక్టర్ లింగయ్యకి మెమోరాండం అందజేశారు. రోజుకు 8 నుంచి 10 గంటలు పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో DYFI రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్, SFI రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేశ్ జునుగారి, నాయకులు సాయి కిరణ్ ఉన్నారు.
HMDAలో కొత్తగా 2 జోన్లు పెంచారు. ఇప్పటివరకు ఘట్‌కేసర్, మేడ్చల్, శంషాబాద్, శంకర్‌పల్లి HMDA పరిధిలో ఉండేవి. ఇకమీదట ఘట్‌కేసర్, శంషాబాద్‌తో పాటు మేడ్చల్-1, మేడ్చల్-2, శంకర్‌పల్లి-1, శంకర్‌పల్లి-2 అని రెండు జోన్లుగా విభజించారు. శంకర్‌పల్లి జోన్-1కు ప్రసాద్ రావు, శంకర్‌పల్లి-2కు మల్లికార్జునరావుకు బాధ్యతలు అప్పగించారు. మేడ్చల్-1కు గోపిక రమ్య, మేడ్చల్-2కు శాలినికి ప్లానింగ్ అధికారిగా నియమించారు.
హైదరాబాదులో పరిశ్రమలు స్థాపనకు ప్రభుత్వ పక్షాన సంపూర్ణ సహకారం అందిస్తామని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గ్రానెట్ విన్ ఓవెన్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎంతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ, అర్బన్, స్కిల్ డెవలప్మెంట్ అంశాలు చర్చించారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. పరిశ్రమలకు హైదరాబాద్ స్వర్గధామం అని అన్నారు.
దాదాపు 650 చదరపు కి.మీటర్ల విస్తీర్ణం గల హైదరాబాద్ మహానగరంలో రెసిడెన్షియల్, కమర్షియల్ భవనాలతో కలిపి సుమారు 19.43 లక్షల నిర్మాణాలు ఉన్నట్లు కమిషనర్ ఆమ్రపాలి వెల్లడించారు. అందులో 2.7 లక్షల కమర్షియల్ గృహాలు ఉన్నాయి. GIS సర్వే పూర్తికాగానే ప్రతి ఇంటికి డిజిటల్ డోర్ నంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. GIS డిజిటల్ బోర్డ్‌తో ప్రజలు ప్రభుత్వ సేవలను ఇంటినుంచే పొందే వీలు ఉంటుందన్నారు.
Sorry, no posts matched your criteria.