India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉస్మానియా మెడికల్ కళాశాల ISO-9001-2015 గుర్తింపు దక్కింది. ఆ సంస్థ ప్రతినిధి శివయ్య గుర్తింపు పత్రాన్ని కళాశాల డా.నరేంద్ర కుమార్‌కు అందజేశారు. తెలంగాణలో రెండోసారి ISO గుర్తింపు తమ కళాశాలకు దక్కడం అభినందనీయం అన్నారు. వైస్ ప్రిన్సిపల్‌లు డా.శంకర్, డా.పద్మావతి, ఏడీ డా.శ్రీధర్ చారి మాజీ వైస్ ప్రిన్సిపల్ డా.టక్యుద్దీన్ ఉన్నారు.
ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ తన విస్తరణ ప్రణాళికను ఆగస్టు 14న ప్రారంభించనుంది. ఈ మేరకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ నెల 5న న్యూజెర్సీలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో సీఈవో రవికుమార్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. అదనంగా 15 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా తమ ప్రణాళిక ఉంటుందని కాగ్నిజెంట్ పేర్కొంది.
రియల్ ఎస్టేట్ రంగంలో రాజధాని దూసుకెళ్తోంది. దేశంలోని అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ మార్కెట్లలో హైదరాబాద్ సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. అఫర్డబిలిటీ ఇండెక్స్ పేరుతో నైట్ ఫ్రాంక్ తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. హౌస్ EMI-ఆదాయ నిష్పత్తి ఆధారంగా ఇండియాలోని 8 ప్రధాన నగరాలను ఎంచుకుంది. దీని ప్రకారం 51 శాతం నిష్పత్తితో ముంబై తొలిస్థానంలో ఉంది. 30 శాతంతో హైదరాబాద్ 2వ స్థానంలో నిలిచింది.
పట్టణ ప్రణాళిక, వనరుల నిర్వహణ మెరుగుపరచడమే GIS సర్వే ప్రధాన లక్ష్యమని కమిషనర్ ఆమ్రపాలి కాట అన్నారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఆమె సమావేశం అయ్యారు. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం(GIS) గురించి వివరించారు. గ్రేటర్ మొత్తాన్ని డ్రోన్ ద్వారా సర్వే చేసి రికార్డు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ భూములు, చిన్న పెద్ద రోడ్లు, చెరువులు, సరస్సులు అన్నింటిని, సిటీ మొత్తం మ్యాపింగ్ జరుగుతుందన్నారు.
గతేడాది మాదిరిగానే ఈసారి కూడా పంద్రాగస్టు వేడుకలు గోల్కొండ కోటలో నిర్వహిస్తున్నారు. సీఎం హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి ఇక్కడికి రానున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. తదితర ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
AP క్యాబ్ డ్రైవర్లను HYDలో తిరగనివ్వాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపై తెలంగాణ క్యాబ్ అసోసియేషన్స్ నాయకులు మండిపడ్డారు. మోటర్ వాహన చట్టం ప్రకారం ఇతర రాష్ట్రాల వాహనాలు అనుమతి లేకుండా ఇక్కడ వ్యాపారాలు నిర్వహించరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘించడం నేరమని క్యాబ్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్ పేర్కొన్నారు. కాగా, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన క్యాబ్ డ్రైవర్ల వాగ్వాదం చిలికి చిలికి, గాలి వానలా మారింది.
HYD బాలాపూర్‌లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అంట్ మెటీరియల్స్(ARCI) పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీతో పాటు పని అనుభవం ఉండాలి. పోస్టును అనుసరించి 28-30 ఏళ్లు మించకూడదు. రూ.57,960- రూ.69,120 జీతం ఉంటుంది. AUG 26లోపు https://www.arci.res.in/careers/లో అప్లై చేసుకోండి. SHARE IT
ORR లోపలున్న పట్టణాలు, నగరాలను హైదరాబాద్ మహానగరపాలక సంస్థలో విలీనం చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై మున్సిపల్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ORRకి అటూ ఇటూ ఉన్న పట్టణాల విషయంలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం బాహ్యవలయ రహదారికి వెలుపల ఉన్న గ్రామాలను విలీనం చేయకూడదు. ఆయ గ్రామాలను ఎలా విలీనం చేయాలనే దానిపై అధికారులు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు.
సైబర్ క్రైమ్ పట్ల నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ‘పరిచయం లేని వ్యక్తులతో మాట్లాడటం, OTP షేర్ చేయడం, అనుమానాస్పద లింకులను తెరవడం, బెదిరింపు కాల్స్‌కు స్పందించడం ఆపండి. ఒక్క క్లిక్ మీ జీవితాన్ని మార్చగలదు. అది సురక్షితమో కాదో నిర్ధారించుకోండి. సైబర్ క్రిమినల్స్ చేతిలో మోసపోతే వెంటనే 1930కి డయల్ చేయండి’ అంటూ రాచకొండ పోలీసులు సూచిస్తున్నారు. SHARE IT
HYD నగరం NACP లక్ష్యాలను సాధించడంలో సగటు పనితీరు కనబరిచిందని తెలిపింది. వాయు కాలుష్య నియంత్రణకు సంబంధించి నగరం యావరేజ్ పర్ఫార్మెన్స్ సిటీస్ జాబితాలో చేరింది. HYD నగరంలో పార్టీక్యులేట్ మ్యాటర్ (ధూళికణాలు ) 2.5 ఉద్గారాల నియంత్రణపై దృష్టి పెట్టాలని సూచించింది. దేశంలో 100 స్కోర్ సాధించిన నగరాలు 4 ఉండగా..75 స్కోర్ సాధించిన నగరాల్లో 26 ఉన్నాయి.75 స్కోర్ సాధించిన లిస్టులో హైదరాబాద్ సైతం ఉంది.
Sorry, no posts matched your criteria.