India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వనస్థలిపురంలోని ఓ హోటల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరు యువకుల్లో గౌతమ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో యువకుడు శివాజీ రెడ్డి పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.
నగరంలోని పంజాగుట్ట సర్కిల్ ప్రాంతంలో ACB అధికారులు రైడ్స్ చేశారు. పంజాగుట్ట సర్కిల్ వన్ డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ప్రైవేట్ వ్యక్తుల నుంచి రూ.2,00,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఫైనల్ ఆడిట్ క్లియర్ చేసేందుకు డబ్బులు అడిగినట్లు ఫిర్యాదు రావడంతో రైడ్స్ చేసినట్లు వెల్లడించారు.
మహేశ్వరం MLA, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి బతుకు బస్టాండ్ అంటూ అసెంబ్లీలో అగౌరవపరిచేలా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని BRS సీనియర్ నేత, ఆ పార్టీ మీర్‌పేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేశ్ గౌడ్ డిమాండ్ చేశారు. సీఎం మాటలకు నిరసనగా రేపు పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని ఆయన నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి భవిష్యత్తు మరిచి మాట్లాడటం సరికాదన్నారు.
HYD చైతన్యపురి PS పరిధిలో ఇటీవల <<13674948>>శ్రీ చైతన్య విద్యార్థిని<<>> వేణుశ్రీ (16) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. కాగా చికిత్స పొందుతున్న ఆమె మృతి చెందిందని పోలీసులు తెలిపారు. ఈనెల 20న వేణుశ్రీ ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించగా మలక్‌పేటలోని ఓ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో రాత్రి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్టుమార్టమ్ అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
తల్లికి జబ్బు చేస్తే సేవచేయాల్సిన కుమారుడు రోడ్డుపై వదిలేసిన ఘటన మేడ్చల్ పరిధిలో జరిగింది. స్థానికంగా నివసించే అరవింద్ తన తల్లి అనారోగ్యంతో ఉంటే ఆస్పత్రికి తీసుకెళ్తానని బోయిన్‌పల్లిలో ఓ ఫుట్‌పాత్‌పై వదిలేశాడు. ఆ తల్లి స్పృహతప్పి పడిపోగా పోలీసులు గాంధీకి తరలించారు. కర్కశంగా ప్రవర్తించినా కడుపు తీపి చంపుకోలేక చనిపోయే ముందు కొడుకునే చూడాలనుకుంది. ఘటన స్థానికులను కంట తడిపెట్టించింది.
శంషాబాద్ ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లో రూ.40 కోట్ల స్కామ్ జరిగిన విషయం తెలిసిందే! ఈ భారీ స్కామ్‌లో బ్యాంక్ మేనేజర్ రామస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో బ్యాంకు ఉద్యోగి రాజేశ్‌తో కలిసి రూ.40 కోట్లు స్వాహా చేశారు. సినీ నిర్మాత షేక్ బషీద్‌కు మేనేజర్ రూ.40కోట్లు బదిలీ చేశాడు. అక్కడినుంచి మరికొన్ని అకౌంట్లకు సొమ్ము ట్రాన్స్‌ఫర్ అయినట్లు తేలింది.
తెలంగాణ కొత్త గవర్నర్ మధ్యాహ్నం 2గంటలకు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు స్వాగతం పలకుతారు. సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌వర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు, బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.
సోషల్ మీడియా వేదికగా తనపై తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. అటువంటి వార్తలను నమ్మొద్దని తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. మళ్లీ ఈ ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి చేరుతున్నారని వార్తలు వస్తున్నట్లు గుర్తు చేశారు. కానీ, ఆ జాబితాలో తాను లేనన్నారు. కాంగ్రెస్‌లోనే ఉంటానని కాలే యాదయ్య స్పష్టం చేశారు.
యువతిని మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అమ్మాయితో స్వామికి FBలో పరిచయమైంది. ఆమెను HYDకి రప్పించిన అతడు పెళ్లి చేసుకుంటానని అత్యాచారం చేశాడు. చివరకు ఆస్ట్రేలియా పారిపోయేందుకు యత్నించాడు. బాధితురాలి ఫిర్యాదుతో మహంకాళీ పోలీసులు ఎయిర్‌పోర్ట్‌లోనే స్వామిని అరెస్ట్ చేశారు. CI పరశురాం, SIలు వెంకటేశ్వర్లు, పరదేశి జాన్, కానిస్టేబుల్స్ వంశీ, రుషి చరణ్ సిబ్బంది ఉన్నారు.
HYD వనస్థలిపురంలో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై గ్యాంగ్ రేప్ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా ఉండే హోటల్‌లో యువతిపై యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్నేహితులతో కలిసి హోటల్‌కు వెళ్లిన యువతిపై మద్యం మత్తులో అత్యాచారం చేశారు. స్నేహితుడితో పాటు తనపై మరొకరు కూడా అత్యాచారం చేశారని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.