India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

10th తర్వాత విద్యార్థులు ఏ రూట్‌లో వెళ్తే ఫ్యూచర్ ఉంటుందనే దానిపై తల్లిదండ్రులు స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా Way2News & Resonance సంస్థ సంయుక్తంగా కెరీర్ గైడెన్స్ సెమినార్ శనివారం ఉచితంగా నిర్వహించింది. శ్రీనగర్‌కాలనీలోని శ్రీ సత్యసాయి నిగామగమం ట్రస్ట్‌లో CBI Ex. జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులకు మార్గనిర్దేశం చేశారు. జేడీ సూచనలు విన్న పేరెంట్స్ సంతృప్తి వక్తం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం ఇంధన రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపింది. ఇంధన సామర్థ్య ప్రాజెక్టులను పరుగులు పెట్టించేందుకు TGREDCO ఆధ్వర్యంలో HYDలో ఒకే ఒక్క రోజు “ఇన్వెస్ట్‌మెంట్ బజార్” నిర్వహిస్తున్నారు. ప్రాజెక్ట్ డెవలపర్లు, ఇన్వెస్టర్లు, బ్యాంకర్లను ఒకే వేదికపైకి చేర్చి, కోట్లాది రూపాయల నిధులు సమకూర్చడమే దీని లక్ష్యం. రాయితీలతో కూడిన వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇది ఒక సువర్ణావకాశం.

TG EAPCET ప్రవేశ పరీక్షకి ఈ రోజు ఇంజినీరింగ్ విభాగానికి 12,770 విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి సంబంధించి 7,354 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 2 విభాగాలకు సంబంధించి 19 మంది దరఖాస్తు చేసుకున్నారని కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ రోజు వరకు 20,143 దరఖాస్తుకు వచ్చాయని కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.

“దేశ భాషలందు తెలుగు లెస్స” ఇది శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన వేదం. సమాజంలో తెలుగు భాషను లోకువ చేసే బ్యాచ్ తెలుసుకోవాల్సిన నిజం. మాతృ భూమి, భాషను నమ్ముకొన్న వాడు ఎక్కడా మోసపోలేదు. తెలుగు, సాహిత్యం మీద పట్టు పెంచుకొన్న ఎందరో కవులు చరిత్రలో నిలిచారు. లక్షలాది మందిని గొప్ప జర్నలిస్టులను చేసింది ఈ మాతృభాషనే. భాషను బతికించుకున్న ఎందరికో బతుకునిచ్చిందని మర్చిపోకండి.
నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం.

జూబ్లీహిల్స్‌లో ప్రముఖ జ్యువెలర్స్ Mukunda Jewellers తన తొలి ఫ్యాక్టరీ అవుట్‌లెట్‌ను ఫిబ్రవరి 20న ఘనంగా ప్రారంభించింది. మధ్యవర్తులు లేకుండా నేరుగా తయారీ ధరలకే వజ్రం, బంగారం, వెండి ఆభరణాలు అందించడం ప్రత్యేకత. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్, గౌరవ అతిథిగా కార్పొరేటర్ వెంకటేశ్ హాజరై ప్రారంభించారు. జూబ్లీహిల్స్ వాసులకు నాణ్యమైన పొదుపు అవకాశంగా ఈ అవుట్ లెట్ నిలువనున్నట్లు యాజమాన్యం తెలిపింది.

ఫ్యూచర్ సిటీ (FCDA) పరిధిలో ఆకాశమే హద్దుగా భవనాలు ఎగబాకనున్నాయి. సర్కారు ‘యూనిఫైడ్ బిల్డింగ్ రూల్స్ 2026’ను పట్టాలెక్కించింది. పాత TG-bPASS సర్కారు అటకెక్కిపోవడంతో ఇక అంతా ‘బిల్డ్ నౌ’ ప్లాట్ ఫామ్‌లోనే. ముచ్చర్ల AI సిటీలో కట్టే బిల్డింగ్‌లకు రోడ్డు వెడల్పుతో సంబంధం లేకుండా 60 అంతస్తులపైనే పర్మిషన్లు ఇచ్చేలా నిబంధనలు సడలించారు. అయితే, ఈ బిల్డింగ్‌లు ‘నెట్ జీరో’ పాలసీని పాటించాలని కండీషన్ పెట్టారు.

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఐకానిక్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. మూడేళ్ల పాటు ఈ భవనాన్ని అద్దాల మేడలా మెరిపించేందుకు రూ.8.35 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. ఇందులో భాగంగా 24/7 టెక్ సపోర్ట్, మెకనైజ్డ్ క్లీనింగ్, గ్లాస్ ఫెసాడ్ మెయింటెనెన్స్ పనులు చేపట్టనున్నారు. నగర గర్వకారణమైన ఈ టవర్ ఎల్లప్పుడూ అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు.

10th తర్వాత విద్యార్థులు ఏ రూట్‌లో వెళితే ఫ్యూచర్ ఉంటుందనే దానిపై తల్లిదండ్రులు స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా Way2News & Resonance సంస్థ సంయుక్తంగా ఉచిత కెరీర్ గైడెన్స్ సెమినార్లు నిర్వహిస్తున్నాయి. శ్రీనగర్‌కాలనీలోని శ్రీ సత్య సాయి నిగామగమం ట్రస్ట్‌లో ఇవాళ సాయంత్రం 6 గంటలకు సదస్సు జరగనుంది. CBI Ex జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని మార్గనిర్దేశం చేయనున్నారు. సో పేరెంట్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

దిల్‍సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్లు జరిగి నేటికి 13 ఏళ్లు. 2013 FEB 21న జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు. కేసులో NIA కోర్టు దోషులకు మరణశిక్ష విధించినప్పటికీ, న్యాయపరమైన కారణాలతో ఇప్పటికీ అమలు కాలేదు. తమకు ఇంకా పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదులకు పడిన శిక్షలు త్వరగా అమలు చేయాలని జనం డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణలో మహిళల రక్షణ, భద్రతకు బలమైన తోడ్పాటు లభించింది. తార్నాక మహిళా సమాజం తరపున విజయలక్ష్మి రూ.50 లక్షల విరాళాన్ని అందజేస్తూ పోలీసుశాఖ మహిళా భద్రతా విభాగానికి మద్దతు ప్రకటించారు. ఈ మొత్తాన్ని పోలీసు శాఖలోని మహిళల భద్రతకు వినియోగించాలని ఆమె కోరారు. డీజీపీ శివధర్ రెడ్డి ఈ విరాళాన్ని స్వీకరించి సామాజిక బాధ్యతతో ముందుకొచ్చిన దాతలను అభినందించారు.
Sorry, no posts matched your criteria.