Hyderabad

News February 21, 2026

HYD: మహిళ భద్రత విభాగానికి రూ.50లక్షల విరాళం

image

తెలంగాణలో మహిళల రక్షణ, భద్రతకు బలమైన తోడ్పాటు లభించింది. తార్నాక మహిళా సమాజం తరపున విజయలక్ష్మి రూ.50 లక్షల విరాళాన్ని అందజేస్తూ పోలీసుశాఖ మహిళా భద్రతా విభాగానికి మద్దతు ప్రకటించారు. ఈ మొత్తాన్ని పోలీసు శాఖలోని మహిళల భద్రతకు వినియోగించాలని ఆమె కోరారు. డీజీపీ శివధర్ రెడ్డి ఈ విరాళాన్ని స్వీకరించి సామాజిక బాధ్యతతో ముందుకొచ్చిన దాతలను అభినందించారు.

News February 21, 2026

HYD: మహిళ భద్రత విభాగానికి రూ.50లక్షల విరాళం

image

తెలంగాణలో మహిళల రక్షణ, భద్రతకు బలమైన తోడ్పాటు లభించింది. తార్నాక మహిళా సమాజం తరపున విజయలక్ష్మి రూ.50 లక్షల విరాళాన్ని అందజేస్తూ పోలీసుశాఖ మహిళా భద్రతా విభాగానికి మద్దతు ప్రకటించారు. ఈ మొత్తాన్ని పోలీసు శాఖలోని మహిళల భద్రతకు వినియోగించాలని ఆమె కోరారు. డీజీపీ శివధర్ రెడ్డి ఈ విరాళాన్ని స్వీకరించి సామాజిక బాధ్యతతో ముందుకొచ్చిన దాతలను అభినందించారు.

News February 20, 2026

HYD: హడల్.. డబ్బు ఎక్కడ దాచాలి?

image

నగదును ఎక్కడ దాచాలన్న ప్రశ్నే నగరవాసులను కలవరపెడుతోంది. ఇంట్లో దాస్తే దొంగల దోచుకెళ్తున్నారు. బ్యాంకు ఖాతాల్లో వేస్తే సైబర్ కేటుగాళ్లు కాజేస్తున్నారు. మేడిపల్లి PS పరిధిలో ఇటీవల జరిగిన పలు ఘటనలు నిద్రలేకుండా చేస్తున్నాయి. భద్రత కోసం చేసిన ప్రయత్నం ముప్పుగానే మారడంతో జనాలు జంకుతున్నారు. తెలియని లింక్‌లను ఓపెన్ చేయవద్దని, ఇళ్లకు సెంట్రల్ లాకింగ్‌ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

News February 20, 2026

అమీర్‌పేటలో ప్రాణాలు కాపాడింది వీళ్లే!

image

మైత్రివనంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదాన్ని హైడ్రా డీఆర్‌ఎఫ్ సిబ్బంది సమర్థంగా అదుపులోకి తీసుకొచ్చింది. రెండో అంతస్తులో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. హైడ్రా కమిషనర్, అదనపు డైరెక్టర్, ఏడీఎఫ్‌వో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సిబ్బంది చూపిన ధైర్యసాహసాలను అభినందించారు. ప్రాణాలు కాపాడిన సిబ్బందికి సెల్యూట్.

News February 20, 2026

ఉద్యమంలో యుద్ధభూమి HYD.. ఇది కథ కాదు!

image

తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా ఉరకలేసింది. 2012-14లో HYD యుద్ధభూమిని తలపించింది. పుస్తకాలు పట్టాల్సిన విద్యార్థులు పోరుబాట పట్టారు. తెలంగాణ గొంతుక అయ్యారు. బుల్లెట్ల వర్షంలోనూ బరిగీసి నిలబడ్డారు. ముళ్ల కంచెలను తొక్కుకుంటూ దూసుకెళ్లారు. NCC గేట్ వద్ద చిందిన రక్తం ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని రగిల్చింది. నాడు ‘జై తెలంగాణ’ తప్ప మరో నినాదం వినబడలేదు. ప్రపంచంలోనే ఓ గొప్ప ఉద్యమం ఇదే. ఫలితమే నేటి తెలంగాణ.

News February 20, 2026

HYD: రూ.4000 వ్యాక్సిన్ ఉచితం

image

HYDలోని బాలికలకు గుడ్ న్యూస్. గర్భాశయ క్యాన్సర్‌ను తరిమికొట్టేందుకు సర్కార్ సిద్ధమైంది. FEB చివరి నుంచి నగరంలోని బస్తీ దవాఖానలు, PHCల్లో 14-15 ఏళ్ల బాలికలకు ఉచితంగా HPV టీకాలు వేయనున్నారు. బయట దాదాపు రూ.4,000 ఉండే ఈ ‘గార్డాసిల్ 4’ వ్యాక్సిన్ ఇప్పుడు పైసా ఖర్చు లేకుండా లభిస్తుంది. HYD వేలాది మంది, TGలో 4.6 లక్షల మందికి మేలు జరగనుంది. ఈ వ్యాక్సిన్ 14-15 ఏళ్ల మధ్య వయస్సు గల బాలికలకు పంపిణీ చేస్తారు.

News February 20, 2026

HYD: మలి దశను మలుపు తిప్పిన మహోద్యమలు

image

ప్రత్యేక తెలంగాణ సాధనకు హైదరాబాద్ ఉద్యమాలకు కేంద్రబిందువైంది. ‘మిలియన్ మార్చ్’ ఉప్పెనలా ఉప్పొంగింది. ‘సాగరహారం’ ఉద్యమానికి ఉవ్వెత్తున ఊపిరిపోసింది. ‘సకలజనుల సమ్మె’ రాష్ట్రాన్ని స్థంభింపజేసింది. ‘మానవహారం’ ఉద్యమ ఆత్మను ప్రతిబింబించాయి. ‘సడక్‌బంద్‌’ సమైక్య పాలకులకు సమస్య తీవ్రతను చాటిచెప్పింది. చివరకు 2014 FEB 20న RSలో బిల్లు పాసై నాలుగున్నర కోట్ల మోముల్లో నవ్వులు పూశాయి.

News February 20, 2026

HYD: తల్లి మృతికి కారణమైనందుకే గర్భిణీ హత్య!

image

వనస్థలిపురం PS పరిధి కప్పలచెరువు సమీపంలో బుధవారం సునీతను హత్య చేసిన <<19181178>>నిందితుడు<<>> మహేష్‌(30)ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర వాసి సునీతను 2022లో వివాహం చేసుకోగా వివాదాలతో అతనిపై వేధింపుల కేసు పెట్టింది. 2024లో పరస్పర విడాకులు జరిగి ఆమె 2025లో రెండో వివాహం చేసుకుంది. కేసుల వేధింపులతో అతని తల్లి ఇటీవలే మరణించింది. దీంతో పగ పెంచుకుని చంపానని నిందితుడు మహేష్‌ ఒప్పుకున్నాడు.

News February 20, 2026

హైదరాబాద్‌లో ₹25వేల శాలరీతో జాబ్స్

image

ECIL HYDలో 200 పోస్టులు భర్తీ చేయనుంది. టెక్నికల్ ఆఫీసర్ ఆన్ కాంట్రాక్ట్ (TO-C) పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు BTechలో 60% మార్కుల ఉత్తీర్ణతతో పాటు వృత్తిలో అనుభవం గల అభ్యర్థులు ఫిబ్రవరి 24న ECIL HYDలో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. నెలకు ₹25,000 జీతం ఉంటుంది. మరిన్ని వివరాలకు https://www.ecil.co.in/jobopenings చూడండి.

News February 20, 2026

HYD: మోగనున్న పెళ్లి బాజాలు.. వాటికి ఫుల్ డిమాండ్

image

డిసెంబర్ నుంచి ముహూర్తాలు లేకపోవడంతో శుభకార్యాలు నిలిచిపోయాయి. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలను చాలావరకు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈనెల 17తో శుక్రమౌఢ్యమి అమావాస్య ముగిసింది. దీంతో HYD, ఉమ్మడి రంగారెడ్డిలోని ఫంక్షన్ హాళ్లు, వివాహాలకు సంబంధించి కొనుగోళ్లతో వస్త్ర, బంగారు దుకాణాలలో రద్దీ పెరిగింది. ముహూర్తాలు మొదలు కావడంతో డెకరేషన్, ఫొటోగ్రఫి, ఈవెంట్లు నిర్వాహకులు తీరిక లేకుండా ఉన్నారు.

↑