Hyderabad

News June 27, 2024

HYD: ఇంటర్, డిగ్రీ, పీజీ పాసయ్యారా .. ఇది మీ కోసమే..!

image

సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ విమలా రెడ్డి తెలిపారు. బుధవారం HYD నల్లకుంటలో ఆమె మాట్లాడారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. జులై 6లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 7893141797 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
SHARE IT

News June 27, 2024

HYD: పెరుగుతున్న డెంగ్యూ వ్యాధి కేసులు.. జర జాగ్రత్త..!

image

వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులపై HYD, RR, MDCL, VKB జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రులతో పాటు పీహెచ్‌సీలు, ప్రైవేట్ దవాఖానాలకు రోగులు పోటెత్తుతున్నారు. గడిచిన 25 రోజుల్లో ఫీవర్ ఆసుపత్రిలో డెంగ్యూ వ్యాధితో 15 మంది చేరారు. ఇక HYDలో మే నెలలో 39, జూన్ 25వ తేదీ వరకు 35 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ప్రజలు శుభ్రత పాటించాలన్నారు. SHARE IT

News June 27, 2024

గోల్కొండ బోనాలను వైభవంగా నిర్వహిస్తాం: మంత్రి

image

గోల్కొండ బోనాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.బుధవారం గోల్కొండ కోట జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో నెలరోజులపాటు జరిగే బోనాలను పకడ్బందీగా నిర్వహించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. గోల్కొండ కోటకు బోనాలతో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

News June 27, 2024

HYD: రీల్స్ పిచ్చి.. లైక్స్ కోసం ఇలా చేస్తున్నారు..!

image

రీల్స్ పిచ్చి ప్రాణాలు తీస్తున్నా పలువురు యువతలో మాత్రం మార్పు రావడం లేదు. ప్రమాదకరమైన స్టంట్స్ చేయొద్దని పోలీసులు చెబుతున్నప్పటికీ పెడచెవిన పెడుతున్నారు. లైక్స్, వ్యూస్ కోసం కొంత మంది యువత ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. తాజాగా HYDహుస్సేన్ సాగర్ తీరంలో ఓ యువకుడు తన కొత్త బైక్‌ను ఒడ్డు చివరన ప్రమాదకరంగా నిలిపి ఇలా రీల్స్ చేస్తూ కనిపించాడు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

News June 27, 2024

శిల్పారామాన్ని సందర్శించిన విదేశీ మీడియా ప్రతినిధుల బృందం

image

మాదాపూర్‌లోని శిల్పారామాన్ని విదేశీ మీడియా ప్రతినిధుల బృందం సందర్శించింది. జార్జియా, ఆర్మేనియా, ఇరాన్‌, బెలారస్‌, తుర్క్మెనిస్థాన్‌, కిర్గిజ్‌ రిపబ్లిక్‌, తజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, మంగోలియా, కజకిస్థాన్‌ దేశాలకు చెందిన 21 మంది ప్రముఖ మీడియా ప్రతినిధుల బృందం శిల్పారామాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

News June 27, 2024

గాంధీ ఆసుపత్రికి రూ.66 కోట్ల నిధులు

image

గాంధీ ఆసుపత్రి అభివృద్ధి పనులు, కాలేజీ విద్యార్థుల వసతి గృహాల నిర్మాణాలకు గాను రూ. 66 కోట్ల నిధులు మంజూరు చేసిన CM రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి​ దామోదర రాజనర్సింహాకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రాజారావు కృతజ్ఞతలు తెలిపారు. TGMSIDC ఎండీగా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి హేమంత్‌​ను రాజారావు కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు మొక్కను అందజేసి  శుభాకాంక్షలు తెలిపారు. 

News June 26, 2024

HYD: నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నం

image

HYD ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై శ్రీకాంత్ అలియాస్ క్రాంతి(30) లైంగిక దాడికి యత్నించాడు. చిన్నారి బాత్ రూంలో ఉండగా ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో కింద కేసు నమోదు చేశారు. నిందితుడు జీహెచ్ఎంసీలో వర్కర్‌గా పని చేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

News June 26, 2024

HYD: గాంధీలో దీక్ష.. బర్రెలక్క మద్దతు

image

నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో మూడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న నిరుద్యోగ జేఏసీ ఛైర్మన్ మోతిలాల్ నాయక్‌కు బర్రెలక్క(శిరీష) బుధవారం సంఘీభావం ప్రకటించారు. ఆస్పత్రికి వచ్చి మద్దతు తెలిపారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని బర్రెలక్క కోరారు. ఆమె వెంట నిరుద్యోగ జేఏసీ నాయకులు ఉన్నారు.

News June 26, 2024

HYD: అది చిరుత పులి కాదు.. అడవి పిల్లి!

image

HYD శివారు‌ శంషాబాద్ ఘాంసిమియగూడలో ఆపరేషన్ చిరుత సుఖాంతమైంది. అది చిరుత పులి కాదని గుర్తించిన ఫారెస్ట్ అధికారులు ట్రాప్ కెమెరా దృశ్యాలను విడుదల చేశారు. అడవి పిల్లి కదలికలు రికార్డ్ అయినట్లు వెల్లడించారు. ప్రజలు భయభ్రాంతులకు గురికావద్దని డీఎఫ్ఓ విజయానందరావు సూచించారు. SHARE IT

News June 26, 2024

HYDలో పెరిగిన బస్‌‌పాస్ కౌంటర్లు.. ఆదివారం సెలవు!

image

నగరంలో‌ నూతనంగా 2 బస్‌పాస్‌ కౌంటర్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గ్రేటర్ హైదరాబాద్‌ ఆర్టీసీ ED వెంకటేశ్వర్లు తెలిపారు. JNTU, లక్డీకాపూల్ బస్‌స్టాప్‌లో ఈ కౌంటర్లు ఉన్నాయి. 6:30AM నుంచి 8:15PM వరకు పనిచేస్తాయి. కొత్తగా గ్రీన్ మెట్రో లగ్జరీ మంత్లీ బస్‌పాస్ ఇస్తున్నారు. రేతిఫైల్, CBS, కాచిగూడ తదితర చోట్ల ఇప్పటికే కౌంటర్లు సేవలు అందిస్తున్నాయి. ఆదివారం సెలవు ఉంటుంది. SHARE IT