Hyderabad

News July 24, 2024

HYD: ట్రేడింగ్‌లో లాభాలిప్పిస్తామని రూ.3.5 లక్షలు లూటీ

image

ట్రేడింగ్‌లో లాభాలిప్పిస్తామని సైబర్ నేరగాళ్లు రూ.3.5 లక్షలు లూటీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYD చెందిన వ్యాపారవేత్తకు ఓ లింక్ ద్వారా క్వాంటమ్ క్యాపిటల్ యాప్ ద్వారా పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని మెసేజ్ వచ్చింది. మొదటగా బిట్ కాయిన్ పై కొంత పెట్టుబడి పెట్టగా లాభాలు వచ్చాయి. దీంతో విడతల వారీగా రూ.3.5 లక్షలు పెట్టుబడి మోసపోయాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

News July 24, 2024

బడ్జెట్‌లో హైదరాబాద్‌కు నిరాశ!

image

కేంద్ర బడ్జెట్‌లో HYDకు ప్రాధాన్యత దక్కలేదని‌ తెలంగాణవాదులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మెట్రో విస్తరణ, మూసీ సుందరీకరణకు‌ నిధులు ఇవ్వాలని INC ప్రభుత్వం కోరినా.. కేటాయింపులు ఇవ్వలేదన్నారు. మూసీతో పాటు జంట జలాశయాలకు గోదావరి జలాల తరలింపు కోసం రూ. 10 వేల కోట్లు అడిగితే పైసా ఇవ్వలేదని‌ కాంగ్రెస్ ‌నేతలు విమర్శించారు. నేటి అసెంబ్లీ సమావేశాల్లో‌నూ ఇదే అంశాన్ని లేవనెత్తనున్నట్లు సమాచారం.

News July 24, 2024

హైదరాబాద్‌లో ఈ రూట్ బంద్

image

హైదరాబాద్‌ వాహనదారులకు ముఖ్యగమనిక. అంబర్‌పేట ఫ్లై ఓవర్‌ పనులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఇప్పటికే 6 నంబర్‌ నుంచి అంబర్‌పేట జంక్షన్ వరకు రోడ్డు క్లోజ్‌ చేశారు. ఇక నేటి నుంచి 6 నంబర్ నుంచి గోల్నాక రూట్‌ కూడా బంద్ చేస్తున్నట్లు హైదరాబాద్‌ పోలీసులు తెలిపారు. జిందా తిలిస్మత్‌ మీదుగా‌ గోల్నాక‌ చేరుకోవచ్చు. పనులు పూర్తయ్యే వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని‌ రూట్‌ మ్యాప్‌ విడుదల చేశారు. 

News July 24, 2024

HYD: ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్‌ బస్సులు!

image

IT ఉద్యోగులకు RTC శుభవార్త చెప్పంది. HYD శివారు‌ నుంచి హైటెక్‌సిటీకి‌ రావాలంటే‌ సికింద్రాబాద్, కోఠి తదితర బస్టాప్‌ల మీదు‌గా చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. 2 నుంచి 4 బస్సులు మారాల్సి వస్తోంది. దీంతో ఉద్యోగులకు అనుగుణంగా బస్సులు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. ఇప్పటికే ఘట్‌కేసర్‌ నుంచి హైటెక్‌సిటీకి స్పెషల్ సర్వీసులు తీసుకొచ్చారు. మరో 40 రూట్‌లలో‌నూ‌ ఈ విధంగా సేవలు అందించేందుకు RTC కసరత్తు చేస్తోంది.

News July 24, 2024

హైదరాబాద్‌కు ఎందుకు ఇవ్వరు: CM రేవంత్

image

అమరావతి‌ నిర్మాణం కోసం రూ. వేల కోట్లు ఇస్తున్న కేంద్రం హైదరాబాద్‌‌కు నిధులు ఎందుకు ఇవ్వలేదని CM రేవంత్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన కేంద్ర బడ్జెట్‌పై స్పందించారు. HYD మెట్రో విస్తరణ, మూసీ డెవలప్‌మెంట్, RRR ప్రాజెక్ట్‌కు ఏమీ ఇవ్వలేదన్నారు.‌ కాలుష్యం నుంచి‌ నగరాన్ని కాపాడేందుకు, మెట్రో‌ కోసం బడ్జెట్‌ను సవరించి నిధులు ఇవ్వాలన్నారు. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి‌ దీనిపై‌ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

News July 23, 2024

HYD: కన్నీరు తెప్పిస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సూసైడ్ నోట్

image

HYD శివారు తెల్లాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కిరణ్ (25) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతడు రాసిన సూసైడ్‌ నోట్‌ కన్నీళ్లు తెప్పిస్తోంది. ‘నా చిన్నప్పటి నుంచి అన్నీ కష్టాలే. <<13690444>>నచ్చిన చదువు చదవలేదు<<>>. నచ్చిన బట్టలు, ఇష్టమైన తిండి తినలేదు. కనీసం నచ్చిన జాబ్ కూడా లేదు. నాకు ఎవరి నుంచి సపోర్ట్ లేదు. ఒక్కడినే ఇలా ఉండలేకపోతున్నాను. గుడ్‌ బై’ అంటూ మధ్యతరగతి యువత కష్టాలను ‌లెటర్‌లో రాసి తనువు చాలించాడు.

News July 23, 2024

HYD: యువతులను వేధించేవారికి హెచ్చరిక

image

యువతులు, మహిళలను వేధించే పోకిరీలను వదిలిపెట్టే ప్రసక్తి లేదని రాచకొండ CP సుధీర్‌ బాబు హెచ్చరించారు. మంగళవారం‌ ఆయన ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. షీటీమ్స్‌ గత 15 రోజుల్లో‌ 158 మంది ఆకతాయి‌ల ఆట కట్టించినట్లు‌ పేర్కొన్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, బహిరంగ ప్రదేశాల్లో‌ డెకాయ్‌ ఆపరేషన్లు చేపట్టామన్నారు. పట్టుబడ్డవారికి నేడు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు‌ వెల్లడించారు.

News July 23, 2024

గాంధీ ఆస్పత్రికి కొత్త సూపరింటెండెంట్ 

image

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్‌గా డా.CHN.రాజకుమారి మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. పేదలకు కార్పొరేట్​ స్థాయి వైద్యం అందించే ఆసుపత్రిగా పేరుగాంచిన గాంధీ ఆసుపత్రిలో పేషంట్లకు మరింత మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. నిరంతరం మెడికల్​ టీమ్‌తో కలిసి సమష్టి కృషితో ముందుకు వెళ్తామన్నారు. చక్కటి వైద్యం, మెడికల్ విద్యకు టాప్​ ప్రియారిటీ ఇస్తామన్నారు.

News July 23, 2024

HYD: 3 రోజులు స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్ 

image

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల పిల్లలకు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు సోకకుండా 3 రోజులు పాఠశాలలకు సెలవు ఇవ్వాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(AISF) హయత్‌నగర్ మండల కార్యదర్శి అరుణ్ కుమార్ గౌడ్, గ్రేటర్ HYD నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం వారు మాట్లాడారు. ఆన్‌లైన్ ద్వారా క్లాసులు నిర్వహించాలని కోరారు. నాయకులు ఎన్నపల్లి ఉపేందర్, జిన్నా, బన్నీ, జూనోతల భాను ప్రకాశ్ ఉన్నారు.

News July 23, 2024

HYD: IAS స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై నిరసనలు..!

image

HYD అశోక్ నగర్, ఎల్బీనగర్, ఉప్పల్ సహా పలు ప్రాంతాల్లో దివ్యాంగులు రోడ్డెక్కారు. సీనియర్ IAS అధికారిణి స్మిత సబర్వాల్ దివ్యాంగుల రిజర్వేషన్ పై చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపారు. దివ్యాంగులకు రిజర్వేషన్ అవసరం లేదని చెప్పే హక్కు స్మిత సబర్వాల్‌కు లేదని వారు మండిపడ్డారు. తమను ఆమె కించపరిచారని దివ్యాంగుల జాతీయ వేదిక నాయకులు రాము, రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.