India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాష్ట్ర రోడ్ల నెట్‌వర్క్ ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2026-27 బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్షించిన మంత్రి కోమటిరెడ్డి, RRR, NH-65 (8 లేన్ల విస్తరణ) ప్రాజెక్టులే లక్ష్యంగా దిశానిర్దేశం చేశారు. ఈ పనులు పూర్తైతే HYDకు విజయవాడ 2.5 గంటల్లో వెళ్లేలా చేరువకానుంది. హ్యామ్ (HAM) విధానంలో అద్దంలాంటి రోడ్ల నిర్మాణమే ధ్యేయమని, కేంద్ర నిధుల రాకపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

‘ముందు నా లైఫ్.. ఆ తర్వాతే ఎవరైనా’ నేటి యువత మంత్రం ఇదే. పాతతరంలా పెళ్లి, పిల్లలే జీవిత పరమార్థం అని వీరు అనుకోవడం లేదు. ట్రావెలింగ్, ప్యాషన్ ప్రాజెక్ట్స్, మెంటల్ హెల్త్‌కే ఫస్ట్ ప్రయారిటీ. పెళ్లైనా.. తమకంటూ కొంత పర్సనల్ స్పేస్ కావాలని కోరుకుంటున్నారు. ఇంట్లో ఆ స్వేచ్ఛ దొరకనప్పుడు జిమ్ములు, కేఫ్‌లు, ఆఫీసుల్లోనే ఎక్కువ సమయం గడుపుతూ తమను తాము వెతుక్కునే పనిలో పడ్డారు.

కలర్ ఫుల్ ఫిల్టర్ల కాలం చెల్లింది. ఇప్పుడు అంతా పక్కా లోకల్. గూగుల్ సెర్చ్‌కి టాటా చెప్పేసి GEN Z ఇన్‌స్టా రీల్స్‌లోనే బిర్యానీ అడ్రస్‌లు వెతుకుతున్నారు. ఎడిటింగ్ హడావిడి లేని అచ్చమైన ‘డిజిటల్ రానెస్’ వీడియోలకే ఇప్పుడు కిరాక్ రెస్పాన్స్. షో-ఆఫ్ కంటే కళ్ల ముందు కనిపించే నిజాయతీకే జనం ఫిదా అవుతున్నారు. గల్లీలో తీసిన అసలైన ఎమోషన్‌కే లైకులు, షేర్ల వర్షం కురుస్తోంది. ఈ కొత్త ట్రెండ్‌పై మీరేమంటారు?

HYD జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, రెండు పడకల గదుల ఇండ్లపై సమీక్షించారు. స్థలాలు సేకరించి G+5-10 ఇందిరమ్మ ఇళ్లు కట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న 2BHK ఇళ్ల పనులు కూడా పూర్తి చేసి అర్హులకు అందించాలని అధికారులకు మంత్రి సూచించారు.

రక్త సంబంధం, అనుబంధం కాలాలు, ఖండాలు దాటించాయి. ప్రాంతాలేవైనా అవి ఎంత బలంగా ఉంటాయో ఈ ఘటనే నిరూపిస్తోంది. బ్రిటన్‌కు చెందిన రాబిన్ డిక్సన్, తన ముత్తాత లెఫ్టినెంట్ చార్లెస్ విల్సన్ సమాధి కోసం దాదాపు 19ఏళ్ల పాటు వివిధ దేశాల్లో వెతికారు. చివరికి SEC తిరుమలగిరి సెమెట్రీ-12లో ఆ సమాధిని కనుగొన్నారు. ఏళ్లు గడిచినా, వేల మైళ్ల దూరం ఉన్నా వెతుక్కుంటూ రావడం ఆ కుటుంబానికి పూర్వీకులపై ఉన్న గౌరవానికి నిదర్శనం.

తెలంగాణలో రంజాన్ సందర్భంగా షాపులు, ఎస్టాబ్లిష్‌మెంట్‌లకు ప్రత్యేక మినహాయింపులు ఇచ్చారు. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు మినహాయింపులు అమలులో ఉంటాయి. ప్రతి రోజూ ఉదయం 5 గంటల వరకు(నైట్ బజార్) షాపులు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఇక చార్మినార్‌లో రేపటి నుంచి నైట్ బజార్ మొదలుకానుంది. ఇక 24/7 నగరవాసుల రాకపోకలతో పాతబస్తీ కళకళలాడనుంది.

GHMC పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమాలపై కమిషనర్ కర్ణన్ సమీక్షించారు. రోజూ నగరంలోనే దాదాపు 7,800 టన్నుల చెత్తను సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం 4,500 స్వచ్ఛ ఆటోలు ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తున్నాయి. అదే సమయంలో 2,650 స్వయం సహాయక సంఘాలకు చెందిన 18,557 మంది కార్మికులు క్షేత్రస్థాయిలో నిరంతరం పని చేస్తున్నారని కమిషనర్ వివరించారు.

జూ పార్కులో సాధారణ ఎంట్రీ ఫీజు కేవలం రూ.100 (పెద్దలకు) మాత్రమే ఉంది. కానీ, <<19174320>>ఈ అండర్<<>> వాటర్ టన్నెల్ నిర్వహణ చాలా ఖర్చుతో కూడుకున్న పని. గుజరాత్ సైన్స్ సిటీలోని ఇలాంటి టన్నెల్ అక్వేరియం టికెట్ ధర ప్రస్తుతం రూ.200 పైన ఉంది. హైదరాబాద్‌లో దీనిని మరింత అత్యాధునికంగా నిర్మిస్తున్నందున నిర్వహణ ఖర్చుల దృష్ట్యా టికెట్ ధర రూ. 300 నుంచి రూ.500 వరకు ఉండే అవకాశం ఉందని అంతర్గత చర్చలు జరుగుతున్నాయి.
Sorry, no posts matched your criteria.