Hyderabad

News February 18, 2026

గోల్కొండ గెస్ట్ హౌస్‌లో సామాన్యుడికి ‘నో ఎంట్రీ’

image

సర్కారు వారి ‘వారసత్వ’ వ్యాపారం ముదిరి పాకాన పడింది. చారిత్రక గోల్కొండ గెస్ట్ హౌస్‌ను సామాన్యులకు దూరం చేస్తూ కేవలం బడా బాబులకే పరిమితం చేసేలా పర్యాటక శాఖ పావులు కదుపుతోంది. ‘బ్యూటిక్ హోటల్స్’ పేరుతో ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతున్న ఈ ఆస్తులు ఇకపై “ఇన్విటేషన్ ఓన్లీ” క్లబ్బులుగా మారబోతున్నాయి. గండిపేట రిసార్టుల్లో రూమ్ కావాలంటే పైస్థాయి రికమండేషన్ ఉండాల్సిందే అన్నట్లుగా నిబంధనలు మారుస్తున్నారు.

News February 18, 2026

HYD: షాద్‌నగర్ యాక్సిడెంట్‌లో చనిపోయింది వీరే..!

image

షాద్‌నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద <<19172186>>అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. కాగా, అరుణాచలం నుంచి HYD తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఇన్నోవా క్రిస్టాను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తుర్కయంజాల్‌కు చెందిన పురుషోత్తం రెడ్డి, మధుసూదన్ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘనటపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News February 18, 2026

FSLలో కొలువులు.. NOTIFICATION వచ్చేసింది..!

image

TG ఫోరెన్సిక్ ల్యాబ్(FSL) ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకు గమనిక. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తిచేసుకున్న వారిలో 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను రాతపరీక్షలకు ఎంపిక చేశారు. MAR 5,6,7 తేదీల్లో మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో పరీక్షలు జరగనున్నాయి. షార్ట్ లిస్ట్ కానివారు రూ.500 ఫీజు చెల్లించి FEB 21వ తేదీ ఉదయం 8గంటల వరకు ఆన్‌లైన్‌లో తమ అభ్యంతరాలు తెలపవచ్చు. హాల్ టికెట్ల వివరాలు త్వరలో వెల్లడిస్తారు.

News February 18, 2026

‘భాగ్య’నగరంలో ఉద్యమించిన ధ్రువతార

image

అంబేడ్కర్‌ సన్నిహితుడు మన హైదరాబాదీ మాదరి భాగయ్య. అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక. కుల వివక్షను ప్రశ్నిస్తూ, సమాజంలో గౌరవ సూచకంగా భావించిన ‘రెడ్డి’, ‘వర్మ’లను తన పేరులో చేర్చుకుని భాగ్యరెడ్డి వర్మగా ప్రసిద్ధి చెందారు. దేవదాసీ వ్యవస్థ, నిజాం పాలనలో వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఆది హిందూ చైతన్యానికి బలమైన పునాదులు వేశారు. దళిత హక్కుల కోసం పోరాడి చరిత్రకెక్కారు.
#నేడు ఆయన వర్ధంతి.

HYD: AI ఆటాపాటే కాదు.. అంధులకు కంటిపాప

image

HYD బయో ఏషియా 2026 సదస్సులో క్వాడ్రిక్ IT సంస్థ కొత్త ఆవిష్కరణలతో అదరగొట్టింది. సాఫ్ట్‌వేర్ ముచ్చట్లే కాకుండా, అంధుల కోసం స్మార్ట్ AI కేన్ తెచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపింది. తక్కువ ధరకే లభించే ఈ స్టిక్, అడ్డంకులను పసిగట్టి వైబ్రేషన్‌తో హెచ్చరిస్తుంది. దీంతో పాటు మెడికల్ LLM, క్లోఫాస్ట్ వంటి టెక్నాలజీలతో ఫార్మా, బిజినెస్ రంగాల్లోని చిక్కుముడులను విప్పుతూ క్వాడ్రిక్ AI పవర్‌ను చాటిచెప్పింది.

News February 17, 2026

BREAKING: హైదరాబాదీలకు ఇందిరమ్మ ఇళ్లు

image

కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(CURE) పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక మార్చి నెలాఖరుకల్లా పూర్తిచేస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ‘మురికివాడల్లో 5-10 అంతస్తుల్లో ఇళ్లు నిర్మిస్తాం. KPHB లాగా RRR- ORR మధ్య మిడిల్ క్లాస్ వారికి ఇళ్ల స్థలాల గుర్తింపు ప్రక్రియ మొదలైంది. అసంపూర్తి డబుల్ బెడ్ రూమ్‌లకు నిధులు మంజూరు చేస్తాం. సొంత స్థలం ఉన్న 28వేల మందికి ఈ నెలలో ఇళ్లు మంజూరు చేస్తాం’ అని అన్నారు.

News February 17, 2026

మల్కాజిగిరి: 74 వార్డుల ‘మాస్’ అడ్డా.. తూర్పున కమలం జోరు!

image

ఈస్ట్ HYDలోని 74 వార్డులతో ఏర్పడిన మల్కాజిగిరి కార్పొరేషన్ (MMC) ఇప్పుడు అతిపెద్ద పొలిటికల్ గ్రౌండ్. ఉప్పల్, ఎల్బీనగర్‌లో బీజేపీకి ఉన్న బలమైన ‘హిందూ-మాస్’ ఓటు బ్యాంకును కాంగ్రెస్ తన సంక్షేమ పథకాలతో ఢీకొట్టాలనుకుంటుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రకారం.. ఇక్కడ BJP-INC మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా పోరు సాగబోతోందా? BRS మూడో స్థానానికి పడిపోగా! తూర్పున జెండా పాతేందుకు BJP తన శక్తినంతా ఒడ్డాల్సి ఉంది.

News February 17, 2026

HYD: పెళ్లైంది సరే.. ఆ ‘డబుల్ డ్యూటీ’ సంగతేంటి?

image

‘ఆఫీసులో ఫైళ్లు.. ఇంట్లో గిన్నెలు.. ఈ నరకం ఎన్నాళ్లు’.. కొత్తగా పెళ్లైన ఐటీ ఉద్యోగినుల ఆవేదన ఇది. సమానత్వం అని మాటల్లో చెబుతున్నా ఇంటి బాధ్యతలు మాత్రం ఇంకా ఆడవారికే అప్పజెప్పుతున్నారు. అత్తమామల నిఘా, ఇంటి పనుల భారం భరించలేక ఆఫీసునే ఒక ‘సేఫ్ జోన్’గా భావిస్తున్నారు. అందుకే ఇంటికి త్వరగా వెళ్లడానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదు. పని ఒత్తిడి కంటే ఈ ‘రోల్ ఓవర్‌లోడ్’ యువతను ఇంటికి దూరం చేస్తోంది.

↑