Hyderabad

News June 18, 2024

HYD: మెట్రో ఎండీ NVS రెడ్డిని కలిసిన ఎంపీ రఘునందన్ రావు

image

హైదరాబాద్ మెట్రో రైల్ భవన్‌కి ఎంపీ రఘునందన్ ఈరోజు వచ్చారు. బేగంపేట్‌లోని మెట్రో స్టేషన్‌లో మెట్రో రైల్ ఎండీ NVS
రెడ్డిని ఎంపీ రఘునందన్ రావు కలిసి వినతిపత్రం అందజేశారు. మియాపూర్ నుంచి పటాన్‌చెరుకు, అక్కడి నుంచి సంగారెడ్డికి మెట్రో రైల్‌ను విస్తరించాలని మెట్రో రైలు ఎండీని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కోరారు. దీనికి ఎండీ NVS రెడ్డి సానుకూలంగా స్పందించారు.

News June 18, 2024

HYD: చెత్త డబ్బాలు క్లీన్ చేయట్లేదు..!

image

GHMC పారిశుద్ధ్య విభాగం ఏడాదికోసారి నగరంలోని రోడ్లపై చెత్త డబ్బాలను ఏర్పాటు చేస్తోంది. అందుకు దాదాపు రూ.3కోట్లు వెచ్చిస్తోంది. ఏర్పాటు చేశాక నిర్వహణను అధికారులు గాలికొదిలేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ వద్ద డబ్బాల్లోని చెత్తను ఎవరూ తొలగించలేదు. కొన్నేళ్లుగా ఇలానే వ్యర్థాలను ఉంచారు. GHMC, రాంకీ సంస్థలు నువ్వంటే నువ్వని చెప్పుకొంటూ బాధ్యతను విస్మరిస్తున్నాయి.

News June 18, 2024

కంటోన్మెంట్ బోర్డు GHMCలో విలీనం చేస్తారా.. లేదా?

image

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు GHMCలో విలీనం చేస్తారా.. లేదా అనే విషయమై స్థానిక ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఓ వైపు కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు అంటూ ఓటర్ల జాబితా సవరణకు అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు త్వరలో విలీనం అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు చేశాయి. అయితే ఎన్నికల ప్రక్రియ చేపట్టేందుకు కంటోన్మెంట్ బోర్డు యంత్రాంగం సిద్ధమవుతోంది. దీంతో స్థానికంగా అర్థంకాని పరిస్థితి నెలకొంది. 

News June 18, 2024

HYD: నార్త్ జోన్ డీసీపీగా సాధన రష్మీ పెరుమాళ్‌..

image

HYD నార్త్ జోన్ డీసీపీగా సాధన రష్మీ పెరుమాళ్‌ బదిలీపై వస్తున్నారు. ప్రస్తుతం నార్త్‌జోన్‌ డీసీపీగా పనిచేస్తున్న రోహిణి ప్రియదర్శిని నిజామాబాద్‌ డిచ్‌పల్లి 7వ బెటాలియన్‌కు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో ప్రస్తుతం హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా పనిచేస్తున్న సాధన రష్మీ పెరుమాళ్‌ నార్త్ జోన్ డీసీపీగా బదిలీ అయ్యారు. త్వరలో ఆమె బాధ్యతలు చేపట్టనున్నట్లు పోలీస్ సిబ్బంది తెలిపారు.  

News June 18, 2024

HYD: మీ ప్రాంతంలో కరెంట్ పోతుందా..?

image

HYD, RR, MDCL,VKB జిల్లాలలోని పలు ప్రాంతాల్లో కరెంట్ కోతలతో ఇబ్బంది పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. రాత్రి బంజారాహిల్స్, చందానగర్, ఎల్బీనగర్, జవహర్‌నగర్ తదితర చోట్ల కరెంట్ కోతలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సమస్యల పరిష్కారానికి TGSPDCL అధికారులు కంట్రోల్ రూమ్ నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. HYD, RR, MDCL ప్రజలు పై ఫొటోలోని నంబర్లు, VKB ప్రజలు 9493193177 నంబర్‌లో సంప్రదించండి.SHARE IT

News June 18, 2024

HYD: చందనాదీప్తి నేపథ్యం ఇదే..!

image

సికింద్రాబాద్ రైల్వే SPగా చందనాదీప్తి నల్గొండ నుంచి బదిలీపై వస్తున్న విషయం తెలిసిందే. 1983 వరంగల్‌లో జన్మించిన ఆమె ఏపీలో 10th, ఇంటర్ వరకు చదివారు. ఢిల్లీ IITలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు. ఆమె తండ్రి సూచనలతో HYDలో కోచింగ్ తీసుకొని IPS ర్యాంకు సాధించారు. మొదట ఆమె నల్గొండ ప్రొబేషనరీ ఆఫీసర్‌గా, ఆ తర్వాత తాండూరు ASPగా, NZB OSDగా, మెదక్ SPగా, HYD నార్త్ జోన్ DCPగా, నల్గొండ SPగా పనిచేశారు.

News June 18, 2024

HYD: రోడ్లపై ఒంటరిగా వెళ్లే వారే వీరి TARGET.. జర జాగ్రత్త!

image

భయంకరమైన ధార్ గ్యాంగ్ ఘటనలు మరవకముందే గ్రేటర్ HYDలో మరో ముఠా కలకలం రేపుతోంది. యూపీ షామ్లి జిల్లాకు చెందిన భవారియా గ్యాంగ్ రోడ్లపై ఒంటరిగా వెళ్లేవారినే టార్గెట్ చేస్తూ దాడి చేసి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతోంది. తాజాగా సిటీ పరిధిలో ఒకేరోజు 4 చైన్ స్నాచింగ్‌లు చేశారు. నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్లతో ఉన్న బైక్‌లపై వచ్చి చైన్ స్నాచింగ్‌లు చేస్తూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు. జర జాగ్రత్త!

News June 18, 2024

HYD: రవీంద్రభారతిలో ప్రీతిక కూచిపూడి రంగప్రవేశం

image

శ్రీ అఖిల భారత కూచిపూడి నాట్యకళా మండలి ఆధ్వర్యంలో ప్రఖ్యాత నాట్యగురువు పెనుమర్తి మృత్యుంజయశర్మ శిష్యురాలు పవిరళ అచ్చుత్ దీపిక తనయ ప్రీతిక సవిరళ కూచిపూడి రంగప్రవేశాన్ని చేసింది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కూచిపూడి శాస్త్రీయ నృత్యంపై మక్కువతో కూచిపూడి రంగప్రవేశాన్ని ఆగ్రేసర వర్తనశోభతో విరాజిల్లింపజేసి అందరి ప్రశంసలందుకుంది. HYD రవీంద్రభారతిలో ప్రముఖులు ఆమె కూచిపూడి రంగప్రవేశాన్ని కొనియాడారు.

News June 18, 2024

HYD: ముగిసిన శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

image

HYD హిమాయత్‌నగర్‌లోని టీటీడీ బాలాజీ భవన్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం 19వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పుష్పయాగం వైభవంగా జరిగింది. ఉదయం నుంచి రాత్రి వరకు వేలాది మంది భక్తులు తరలివచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈనెల 12వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు సోమవారం రాత్రి 9 గంటలకు జరిగిన ధ్వజారోహణం కార్యక్రమంతో ముగిశాయి.

News June 18, 2024

HYD: రెవెన్యూ శాఖలో అధికారాల వికేంద్రీకరణ జరపాలని మంత్రికి వినతి

image

రెవెన్యూ శాఖలో అధికారాల వికేంద్రీకరణ జరపాలని తెలంగాణ తహశీల్దార్స్‌ అసోసియేషన్‌ (టీజీటీఏ) నాయకులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిని కోరారు. HYD నాంపల్లిలోని టీజీటీఏ కార్యాలయంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.రాములు ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం సోమవారం జరిగింది. అనంతరం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసి సమస్యలు, పదోన్నతులపై వినతిపత్రం సమర్పించారు.