India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హుస్సేన్ సాగర్‌లో వర్షపునీరు చేరి నీటిమట్టం పెరిగింది. ప్రస్తుతం 513.21 మీటర్ల నీటిమట్టం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈరోజు, రేపు భారీ వర్షాల నేపథ్యంలో నీటిమట్టం మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.
రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రవి గుప్తా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఐపీఎస్‌ల బదిలీల్లో అప్పటి వరకు డీజీపీగా ఉన్న రవిగుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. బదిలీ అయినప్పటి నుంచి సెలవులో ఉన్న ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.
ప్రేమ పేరుతో 14ఏళ్ల బాలికను లోబర్చుకుని ఏడాదిగా హత్యాచారం చేసిన ఘటన HYD మీర్‌పేట్‌లో జరిగింది. పోలీసుల కథనం.. బీహార్‌కు చెందిన కుటుంబం స్థానికంగా టిఫిన్ సెంటర్ నడుపుతోంది. పాన్‌షాప్ నిర్వాహించే రాకేశ్ ప్రేమ పేరుతో ఆమెకు దగ్గరయ్యాడు. ఏడాదిగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈక్రమంలో తాను గర్భం దాల్చిన విషయం తల్లిదండ్రులకు తెలియడంతో పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈనెల 21న నిర్వహించనున్న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలకు అధికారులు కీలక మార్పులు చేశారు. ఈసారి ఆలయంలోకి జోగినీలు, శివసత్తులతో పాటు ఐదుగురినే అనుమతిస్తామని స్పష్టం చేశారు. అలాగే మధ్యాహ్నం 1:30 నుంచి సా.4 గంటలలోపు బాట కూడలి నుంచి మాత్రమే వచ్చేలా పక్కా ప్రణాళిక చేశారు. బోనాల అనంతరం నిర్వహించే ఫలారం బండి(తొట్టెల) ఊరేగింపు రాత్రి 12 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు.
డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌పై చర్యలు తీసుకోవాలని బోడుప్పల్ BRS యువజన నాయకులు గురువారం మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డబుల్ ఇస్మార్ట్ సినిమాలోని ఓ ఐటమ్ సాంగ్‌లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి KCR మాటలను వాడటం ఏంటన్నారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఐటం సాంగ్‌లో ఉన్న KCR మాటలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఉప్పరి విజయ్, మోతే రాజు, వినయ్, రాకేశ్, వినయ్ కలిసి ఈ ఫిర్యాదు చేశారు.
గచ్చిబౌలి డివిజన్ పరిధి గోపన్‌పల్లి ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ నెల 20న వంతెనను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పనులు తుదిదశకు చేరుకున్నాయని MLA చెప్పారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శాంతి కోటేశ్ గౌడ్ అధ్యక్షతన ఈరోజు జరిగిన అత్యవసర కౌన్సిల్ సమావేశంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. 18 నెలల బాలుడు విహాన్ కుక్కల దాడిలో మరణించిన నేపథ్యంలో జవహర్‌నగర్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కుక్కల బెడదను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పలు సూచనలు చేశారు.
గ్రేటర్ HYDలో కుక్కలు రక్తం మరిగాయి. నిత్యం <<13652139>>కుక్క కాటు కేసులు<<>> నమోదవుతూనే ఉన్నాయి. కాగా రాజధాని పరిధిలో కొందరు చికెన్, మటన్ షాపుల నిర్వాహకులు మాంసపు వ్యర్థాలను కుక్కలకు వేయడంతో అవి నాన్ వెజ్ తినేందుకు బాగా అలవాటు పడుతున్నాయని సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు. మాంసానికి అలవాటు పడి పిల్లలపై దాడి చేస్తున్నాయని అంటున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?
జవహర్‌నగర్‌లో కుక్కల దాడిలో విహాన్ చనిపోయిన ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే.గతంలోనూ సాత్విక్, ప్రదీప్ కూడా ఇలానే చనిపోయారు. తనూశ్రీ అనే చిన్నారిపై కుక్కలు దాడి చేయగా చేతి వేళ్లు తీసేశారు. గ్రేటర్ HYDలో 6లక్షలకు పైగా కుక్కలు ఉండగా ఆపరేషన్లు చేసే సంరక్షణ కేంద్రాలు 5, కుక్కలు పట్టే వాహనాలు 30మాత్రమే ఉండడం గమనార్హం. పదేళ్లలో కుక్క కాటు కేసులు3,36,767 నమోదయ్యాయి. నిత్యం చాలా మంది గాయాలపాలవుతున్నారు.
గుర్తు తెలియని వ్యక్తి రైలు, ప్లాట్ ఫామ్ మధ్య ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్లాట్ ఫామ్ నంబర్-3లో కాకతీయ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడటంతో ప్లాట్ ఫాం, రైలు మధ్యలో ఇరుక్కుపోయి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.