Hyderabad

News November 3, 2024

కుషాయిగూడ నుంచి అద్దెకు ఆర్టీసీ బస్సులు!

image

కార్తీక మాసం సందర్భంగా కుషాయిగూడ డిపో నుంచి అతి తక్కువకు అద్దె బస్సులు ఇస్తున్నట్లు డిపో మేనేజర్ మహేశ్ కుమార్ తెలిపారు. ఆర్డినరీ, మెట్రో, ఎక్స్ ప్రెస్ బస్సులు అందుబాటులో ఉన్నాయని, డిపాజిట్ లేకుండా 10% రాయితీతో అద్దెకిస్తామన్నారు. ఈ అవకాశాన్ని కుషాయిగూడ పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

News November 3, 2024

HYD: వామ్మో.. చికెన్ ఫ్రైలో పురుగు!

image

ఆర్డర్ చేసిన ఫుడ్‌లో పురుగు రావడంతో ఓ వ్యక్తి అవాక్కయ్యాడు. బాధితుడి ప్రకారం.. హైటెక్ సిటీ సైబర్ టవర్స్ ఎదురుగా ఉన్న ఓ హోటల్ నుంచి ఓ వ్యక్తి స్విగ్గిలో చికెన్ ఫ్రై, చికెన్ న్యూడిల్స్, మెజెస్టిక్స్ ఆర్డర్ చేశారు. ఆర్డర్ ఓపెన్ చేసి తింటుండగా పురుగు రావడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఇంత పెద్ద రెస్టారెంట్లో ఇదా పరిస్థితి? అంటూ GHMC ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు చేపట్టాలని అనిరుద్ అనే వ్యక్తి కోరాడు.

News November 3, 2024

సైదాబాద్: సైబర్ నేరాలకు సెంటర్ పాయింట్ ఆ దేశాలే!

image

సింగపూర్, కంబోడియా, థాయిలాండ్, చైనా తదితర దేశాల కేంద్రంగా హైదరాబాద్‌లో నేరగాళ్లు సైబర్ మోసాలు చేస్తున్నారు. సైదాబాద్, ఎల్బీనగర్, పాతబస్తీ, చార్మినార్ సహా అనేక ప్రాంతాల్లో ప్రజలు సైబర్ మోసాలకు బలయ్యారు. పెట్టుబడులు, పార్ట్ టైం ఉద్యోగాలు, ఫెడెక్స్ మాయలతో కొట్టేసిన డబ్బు, సొమ్మును నిల్వ ఉంచేందుకు ఇండియన్ ఖాతాలు ఉపయోగిస్తున్నట్లు HYD పోలీసులు గుర్తించారు.

News November 3, 2024

HYD: 100 రోజులన్నారు.. 300 రోజులైంది: హరీశ్ రావు

image

ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల అమలు విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలతో పాటు దేశాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉద్యోగ నియామకాల అంశంలో సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన తర్వాత సాధించిన ప్రగతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ట్యాగ్‌ చేస్తూ సీఎం రేవంత్‌ శనివారం ఎక్స్‌లో ఓ పోస్ట్‌ చేశారు.

News November 3, 2024

HYD నగరంలో మరో స్కైవాక్

image

హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ శుభవార్త తెలిపింది. HYD నగరంలో మరో స్కైవాక్ అందుబాటులోకి రానుంది. పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ సమీపంలో కొత్తగా స్కైవాక్ నిర్మించనున్నారు. మెట్రో ప్రయాణికుల సౌకర్యార్థం ఆ ప్రాంతంలో ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ స్కైవాక్ నిర్మించనుంది.

News November 2, 2024

BREAKING: చర్లపల్లి జైలుకు ముత్యాలమ్మ గుడి నిందితుడు

image

సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం కేసులో న్యాయస్థానం నిందితుడికి రిమాండ్ విధించింది. ప్రధాన నిందితుడైన సల్మాన్ సలీంకు 14 రోజులు రిమాండ్ విధించడంతో అతడిని చర్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు. ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం కేసు విచారణను సిట్‌కు బదిలీ చేయగా ఈ ఘటనపై సిట్ 3 కేసులను నమోదు చేసింది.

News November 2, 2024

HYD: యువతిపై అత్యాచారం

image

HYD ఘట్‌కేసర్ పరిధిలో యువతిపై అత్యాచారం జరిగింది. సీఐ పి.పరశురాం తెలిపిన వివరాలు.. ఓ మార్ట్‌లో పని చేసే యువతిపై కజా బషీర్ (35) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయట పెడితే చంపుతానని ఆమెను బెదిరించాడు. ఈ క్రమంలో బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పడంతో ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

News November 2, 2024

ముషీరాబాద్‌‌లో 2 వేల కిలోల దున్నరాజు

image

ముషీరాబాద్‌లో గోలు టూ దున్నరాజు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని BRS నేత ఎడ్ల హరిబాబు యాదవ్ తెలిపారు. నారాయణగూడ సదర్ సమ్మేళనంలో ఈ దున్నరాజుని ప్రదర్శించనున్నారు. గోలు టూ 7 అడుగులకు పైగా ఎత్తు, 14 అడుగుల పొడవు, 2 వేల కిలోల బరువుతో భారీ ఆకారంలో‌ ఉంది. సాయంత్రం ముషీరాబాద్ నుంచి నారాయణగూడ వరకు‌ ర్యాలీగా వెళ్తారు. అక్కడి యాదవ సోదరులతో ‘అలయ్.. బలయ్’ తీసుకోనున్నట్లు హరిబాబు యాదవ్ తెలిపారు.

News November 2, 2024

HYD: నారాయణగూడలో నో ఎంట్రీ!

image

సదర్ ఉత్సవాలకు HYD నారాయణగూడ రెడీ అయ్యింది. దున్నరాజుల ప్రదర్శన చూసేందుకు ప్రతియేటా లక్షలాది మంది YMCAకు వస్తారు. దీంతో రాంకోఠి నుంచి నారాయణగూడ, బాగ్‌ లింగంపల్లి నుంచి కాచిగూడ, YMCA పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. సాయంత్రం 7 నుంచి తెల్లవారుజామున 3 వరకు సాధారణ వాహనాలకు నారాయణగూడలో అనుమతి ఉండదు. ప్రత్యామ్నాయ దారులు చూసుకోవాలని పోలీసులు సూచించారు.
SHARE IT

News November 2, 2024

HYD: NIMS‌లో పిల్లలకు ఉచితం

image

HYD NIMSలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్లాస్టిక్‌ సర్జరీ విభాగం ఉచిత స్క్రీనింగ్‌ క్యాంపును నిర్వహిస్తోంది. శుక్రవారం ప్రారంభమైన ఈ క్యాంపు నవంబర్ 9వ తేదీ వరకు కొనసాగుతుంది. పిల్లలలో ఉన్న లోపాలను గుర్తించి, అవసరమైన వారికి సర్జరీలు చేయనున్నట్లు NIMS డైరెక్టర్ డా. నగరి బీరప్ప, ప్లాస్టిక్ సర్జరీ HOD డా.పార్వతి తెలిపారు. CMRF, LOC, ఆరోగ్య శ్రీ, PMRF కింద ఈ ఆపరేషన్లు చేయనున్నారు.
SHARE IT