Hyderabad

News April 15, 2026

HYD: అడిక్‌మెట్ మెట్టుబావికి పునర్జీవం

image

అడిక్‌మెట్‌లోని చారిత్రక మెట్టుబావికి పూర్వవైభవం లభించింది. దశాబ్దాలుగా చెత్తకుప్పగా మారిన ఈ బావిని అద్భుతంగా పునరుద్ధరించారు. టన్నుల కొద్దీ వ్యర్థాలను తొలగించడంతో ప్రస్తుతం స్వచ్ఛమైన నీటి ఊటలు ఉబికి వస్తున్నాయి. బన్సీలాల్‌పేట బావి తరహాలోనే దీనిని కూడా అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. భూగర్భ జలాల పెంపునకు, వారసత్వ కట్టడాల పరిరక్షణకు ఈ ప్రాజెక్ట్ ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది.

News April 14, 2026

HYDలో భారీ మోసం.. ఇద్దరు అరెస్ట్

image

నగరంలో విదేశీ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న భారీ మోసాన్ని జూబ్లీహిల్స్ పోలీసులు బట్టబయలు చేశారు. యూరప్ దేశాల్లో ఉద్యోగాలంటూ ఒక్కో వ్యక్తి నుంచి రూ.4 నుంచి 5 లక్షలు వసూలు చేస్తున్న ‘ట్రివియల్ చాప్టర్’ సంస్థకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ప్రకటనలు, నకిలీ ఆఫర్ లెటర్లతో ఈ ముఠా మోసాలకు పాల్పడుతోంది. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

News April 14, 2026

సిద్ధు జొన్నలగడ్డతో Freedom oil కొత్త టీవీ ప్రకటన

image

Freedom రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ తమ సరికొత్త ప్రచార చిత్రాన్ని ప్రముఖ నటుడు సిద్ధు జొన్నలగడ్డతో విడుదల చేసింది. ‘ఫ్రీడమ్‌తో ఇంటింటా, నెం.1 వంట’ అనే నినాదంతో రూపొందిన ఈ ప్రకటన తెలుగు కుటుంబాల వంటగదిలోని ఆప్యాయతను, సందడిని ఆవిష్కరిస్తోంది. వంట చేయడం అనేది ఒక వేడుక అని చాటిచెప్పే ఈ వీడియోలో సిద్ధు తనదైన శైలిలో ఉత్సాహంగా కనిపించారు. నాణ్యమైన రుచికి Freedom బ్రాండ్ అని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

News April 14, 2026

మూసీ ప్రక్షాళనకు అడుగులు.. DPR కోసం టెండర్ల ఆహ్వానం

image

మూసీ నదికి పునర్జీవం పోసేందుకు కసరత్తు మొదలైంది. బాపూఘాట్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు గౌరెల్లి వరకు 34 కిలోమీటర్ల మేర నాలా సీవర్ మళ్లించి, శుద్ధి చేసేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం DPR తయారీకి MRDCL టెండర్లను ఆహ్వానించింది. గతంలో HMWSSB రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను లోతుగా సమీక్షించి, ఎక్కడైనా లోపాలు లేదా పునరావృత అంశాలు ఉన్నాయో? లేదో? కన్సల్టెంట్ సంస్థ గుర్తించాల్సి ఉంటుంది.

News April 14, 2026

HYDలో 40 దాటింది.. జాగ్రత్త!

image

HYDలో ఎండలు తీవ్రంగా పెరుగుతున్నాయి. నాంపల్లి పరిధిలోని బేగంబజార్ ప్రాంతంలో మంగళవారం గరిష్ఠంగా 41.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ముషీరాబాద్, మారేడ్‌పల్లిలో, హిమాయత్‌నగర్ ప్రాంతంలో హిమాయత్‌నగర్ ప్రాంతంలో 40.5-40.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది.
SHARE IT

News April 14, 2026

HYDతో అంబేడ్కర్‌కు విడదీయలేని అనుబంధం

image

Dr.BR.అంబేడ్క‌ర్‌కి HYDతో విడదీయలేని అనుబంధం ఉంది. 1932లో తొలిసారి నగరానికి రాగా, 1944లో జింఖానా గ్రౌండ్స్‌లో బహిరంగ సభలో మాట్లాడి దళితులను చైతన్యపరిచారు. 1953లో నిజాం కాలేజీలో ఆయన ప్రసంగం విని ఆకర్షితుడైన నిజాం ఆయనను HYD స్టేట్‌కు చీఫ్ జస్టిస్‌గా నియమించాలనుకున్నారు. సామాజిక సంస్కరణలు, విద్యావ్యాప్తికి ఆయన పలుమార్లు ఇక్కడికి వచ్చారు. ట్యాంక్ బండ్‌పై ఆయన భారీ విగ్రహం నగరానికి ప్రతీకగా నిలిచింది.

News April 14, 2026

అడ్వకేట్ సుబ్బారావుపై సీపీ సజ్జనార్‌కు మంగ్లీ ఫిర్యాదు

image

తనపై ఎలాంటి ఆధారాలు లేకుండా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ అడ్వకేట్ సుబ్బారావుపై కఠినచర్యలు తీసుకోవాలని సింగర్ మంగ్లీ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు సీపీ సజ్జనార్‌ను కలిసి ఆమె ఫిర్యాదు అందజేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. ఇలాంటి దుష్ప్రచారాలను అరికట్టేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు.

News April 14, 2026

మామిడి రాకతో బాట‘సింగారం’

image

మామిడి పండ్లు బాటసింగారం బాట పట్టాయి. సోమవారం సుమారు వెయ్యి టన్నుల పండ్లు దిగుమతి అయినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. నగరంలోని మిగతా మార్కెట్లకు మరో 300 టన్నుల మామిడి వచ్చినట్లు అంచనా. ఈ ఏడాది పంట ఆలస్యమైనా ఏప్రిల్ 3వ వారం నుంచే నగర మార్కెట్లకు మామిడి రికార్డు స్థాయిలో దిగుమతి అవుతోంది. హోల్‌సేల్ మార్కెట్‌లోనే సోమవారం మామిడి పండ్ల ధర కిలో రూ.70-120 పలికింది.

News April 14, 2026

బల్కంపేట ఎల్లమ్మకు మంగళవారం ప్రత్యేక పూజలు

image

బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. వేకువజాము నుంచే అర్చకులు, వేదపండితులు అమ్మవారికి శాస్త్రోక్తంగా అభిషేకాలు చేశారు. అనంతరం వివిధ రకాల పూలతో అమ్మవారిని అత్యంత సుందరంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకోవడంతో ఆలయం ఎల్లమ్మ తల్లి నామస్మరణతో మార్మోగింది.

News April 14, 2026

విద్యార్థులకు అలర్ట్.. అడ్మిషన్లు ప్రారంభం

image

విద్యార్థులకు, పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాలను అందించాలనే లక్ష్యంతో Vishwa Vishwani Institute of Systems and మేనేజ్మెంట్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది నూతనంగా BS Computer Science (UGC AEDP) కోర్సును ప్రారంభించారు. ఈ 4 సంవత్సరాల ప్రోగ్రామ్‌లో 2 ఏళ్లు క్యాంపస్‌లో చదువు, తదుపరి 2 సంవత్సరాలు ఇండస్ట్రీలో అప్రెంటిషిప్ శిక్షణ ఉంటుందన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.