Hyderabad

News September 3, 2025

భిన్నత్వంలో ఏకత్వానికి హైదరాబాద్ నిదర్శనం

image

భిన్నత్వంలో ఏకత్వానికి HYD నిదర్శనం అనడానికి ఈ ఫొటోనే గొప్ప ఉదాహరణ. యాకుత్‌పురలో సుమారు 30 ఏళ్లుగా కటింగ్ షాప్ నడుపుతున్నట్లు ప్రదీప్ తెలిపారు. షాప్‌లో వెంకటేశ్వర స్వామి, ముస్లిం సమాజానికి ప్రత్యేకమైన కాబా ఒకే దగ్గర ఏంటని అడగగా.. ఆయన తండ్రి ఇష్టంగా పూజించేవారని, ఆయన మరణం తర్వాత షాప్, ప్రార్థన బాధ్యతలు ప్రదీప్ తీసుకున్నట్లు వివరించారు.

News September 3, 2025

కాంక్రీట్ జంగిలే.. HYDకు కారణభూతం

image

2020లో వచ్చిన వరదలు HYD, అటు శివారులను అతలాకుతలం చేశాయి. ఒకేరోజు 30 సెంటీమీటర్ల వర్షం నమోదు కావటంపై నాటి నుంచి IMD అధ్యయనం చేసి ఇటీవల నివేదిక రూపొందించింది. వాతావరణంలో మార్పులకు తోడు HYDలో వస్తున్న స్థానిక మార్పుల ప్రభావంతో భారీ వర్షపాతం నమోదు, క్లౌడ్ బరస్ట్‌కు దారితీస్తోందని పేర్కొంది. HYD మొత్తం కాంక్రీట్ జంగిల్ కావడం, మరోవైపు పొల్యూషన్, పట్టణీకరణ ప్రభావమూ ఉన్నట్లు ఇది తేల్చింది.

News September 3, 2025

IT కారిడార్‌కు మరిన్ని ఎలక్ట్రిక్ బస్ సర్వీసులు: సజ్జనార్

image

నగరంలోని ఐటీ కారిడార్‌లో ప్రయాణికులకు సేవలందించేందుకు మరిన్ని ఎలక్ట్రిక్ బస్ సర్వీసులు నడపనున్నారు. పలు ప్రధాన ప్రాంతాల నుంచి వీటిని హైటెక్ సిటీకి నడిపేలా చర్యల తీసుకుంటున్నామని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ తెలిపారు. హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, హకీంపేట, బోడుప్పల్ నుంచి ఐటీ కారిడార్ (విప్రో, వేవ్ రాక్, కోకాపేట, టీహబ్, మైండ్ స్పేస్, హైటెక్ సిటీ)కు కనెక్టివిటీ పెంచుతామని వివరించారు.

News September 2, 2025

HYD: అందుబాటులోకి వచ్చిన హైడ్రా టోల్ ఫ్రీ నంబర్

image

హైడ్రాకు సంబంధించిన ఫిర్యాదులు స్వీక‌రించ‌డానికి టోల్‌ఫ్రీ నంబ‌ర్ 1070 అందుబాటులోకి వ‌చ్చింది. 1070 నంబ‌ర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదులు చేయ‌వ‌చ్చున‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఈరోజు తెలిపారు. హైడ్రా ప్రజావాణికి రాలేని వారు చెరువులు, నాలాలు, పార్కులు, ప్ర‌భుత్వ భూములు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాలు క‌బ్జాకు గురైతే వెంట‌నే ఈ నంబర్‌కి కాల్ చేయవచ్చన్నారు.

News September 2, 2025

HYD: శిల్పారామం వేదికగా సందడి చేయనున్న నిఫ్ట్ విద్యార్థులు

image

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న NIFT (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) విద్యార్థులు శిల్పారామంలో సందడి చేయనున్నారు. ఈనెల 12 నుంచి 17 వరకు తమ ప్రతిభను నిరూపించుకోనున్నారు.  భారతీయ హస్తకళల గొప్పదనాన్ని వివరించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. విద్యార్థులు తయారు చేసిన ఫ్యాషన్ దుస్తులు, వస్తువులు ఇక్కడ ప్రదర్శిస్తారు.

News September 2, 2025

HYD: తెలంగాణ ప్రజల బాగోగులే KCRకు ముఖ్యం: సబితాఇంద్రారెడ్డి

image

కవిత సస్పెన్షన్‌పై మాజీ మంత్రి, మహేశ్వరం BRS ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై, పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించడంతో కవితను సస్పెండ్ చేశారని, ఈ నిర్ణయం హర్షణీయమని ఆమె పేర్కొన్నారు. పార్టీ, తెలంగాణ ప్రజల బాగోగులు తనకు ముఖ్యమని కేసీఆర్ మరోసారి నిరూపించారని అన్నారు. BRSపై ప్రజల్లో మరింత విశ్వాసం నిలబెట్టడానికి ఇలాంటి నిర్ణయాలు అవసరమని ఆమె పేర్కొన్నారు.

News September 2, 2025

KCR నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కుత్బుల్లాపూర్ MLA

image

కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ KCR తీసుకున్న నిర్ణయాన్ని కుత్బుల్లాపూర్ MLA వివేకానంద స్వాగతించారు. ‘BRS అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ, 60 లక్షల మంది సైనికులు, నాయకులు, కార్యకర్తలు ఉన్న సైన్యం’ అని స్పష్టం చేశారు. కొద్దిరోజులుగా కవిత పనితీరుతో కార్యకర్తలు, నాయకుల్లో అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. పార్టీకి యాంటీగా వ్యవహరిస్తే ఎవరిపైనైనా సరే వేటు తప్పదని తేల్చి చెప్పారు.

News September 2, 2025

HYD నడిబొడ్డున రూ.400 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం..!

image

HYD నడిబొడ్డున రాత్రికి రాత్రే ప్రభుత్వ బోర్డులు తీసేసి, పెద్ద సంఖ్యలో రౌడీలు మోహరించి రూ.400 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు ప్రైవేటు వ్యక్తులు యత్నించారు. సమాచారం అందుకున్న వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని జలమండలి రిజర్వాయర్ పక్కన 5 ఎకరాల స్థలాన్ని ఆక్రమించేందుకు పార్థసారథి, విజయ్ భార్గవ్ అనే వ్యక్తులు యత్నించారని పోలీసులు తెలిపారు.

News September 2, 2025

HYDలో మరో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం

image

HYD నగరవాసులకు గుడ్ న్యూస్. నగరంలో మరో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని (PSK) ఏర్పాటు చేయనున్నారు. MGBS మెట్రో స్టేషన్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఈనెల 16న ఇది ప్రారంభం కానుందని పేర్కొన్నారు. పాతబస్తీ ప్రజలకు ఈ కేంద్రం ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఒవైసీ అన్నారు.

News September 2, 2025

BREAKING: హిమాయత్ సాగర్‌లో దూకి యువకుడు సూసైడ్

image

HYD హిమాయత్ సాగర్ జలాశయంలోకి ఈరోజు ఓ యువకుడు దూకి ఆత్మహత్య చేసుకున్నాడని రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు. ఉప్పర్‌పల్లి హ్యాపీ హోమ్స్ కాలనీకి చెందిన ఆరిఫ్ అందరూ చూస్తుండగానే జలాశయంలోకి దూకాడని చెప్పారు. ఈత రాకపోవడంతో క్షణాల్లోనే యువకుడు మునిగిపోయాడన్నారు. రంగంలోకి దిగిన NDRF బృందాలు యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.