Hyderabad

News May 8, 2024

HYD: బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్ర్భాంతి

image

HYD బాచుపల్లి రేణుకా ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు చనిపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం.. తప్పిదం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. గాయపడిన వారికి సరైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.

News May 8, 2024

HYD: ఓటు వేసి దేశభక్తిని చాటుకోవాలి: రోనాల్డ్ రాస్

image

ఓటు వేసి దేశభక్తిని చాటుకోవాలని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. GHMC ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రాంతం వారైనా, ఇతర రాష్ట్రాల వాసులైనా నగరంలో ఓటు ఉన్నవారు, ఇక్కడే ఓటు వేయాలని సూచించారు. రెండు ప్రాంతాల్లో ఓటు హక్కును కలిగి ఉండటం చట్ట విరుద్ధమని, అలాంటి వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.

News May 8, 2024

HYD: చికెన్ కర్రీలో పడి BRS కార్యకర్త మృతి

image

వికారాబాద్ జిల్లా ధారూర్‌లో ఈనెల 2న BRS కార్యకర్తల సమావేశంలో కుక్కింద గ్రామానికి చెందిన మల్లేశం ప్రమాదవశాత్తు చికెన్ కర్రీ, సాంబార్‌లో పడి గాయపడిన విషయం తెలిసిందే. కాగా మెరుగైన వైద్యం నిమిత్తం అతడిని HYDలోని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మరణించాడు. మల్లేశం సోదరుడు కృష్ణయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వేణుగోపాల్ గౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News May 8, 2024

HYD: పట్నం సునీతారెడ్డిపై బీజేపీ ఫిర్యాదు

image

బీజేపీ మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు సంబంధించి వైరల్‌ అవుతున్న మార్ఫింగ్‌ వీడియోలకు కాంగ్రెస్‌ అభ్యర్థి పట్నం సునీతారెడ్డి కారణమంటూ బీజేపీ నేతలు ఎన్‌.రామచందర్‌రావు, గోకుల రామారావు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈటల పరువు ప్రతిష్ఠలు దెబ్బతీసేలా వీడియోలు వైరల్‌ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధానాధికారిని కోరారు.

News May 8, 2024

HYD: భారీ వర్షం.. కొట్టుకొచ్చిన మృతదేహాలు

image

HYDలో రాత్రి కురిసిన భారీ వర్షం పది మంది మృత్యువాతకు కారణమైంది. బాచుపల్లిలో గోడ కూలి ఏడుగురు చనిపోగా పాతబస్తీ బహదూర్‌పురలో కరెంట్ పోల్ షాక్ తగిలి ఓ వ్యక్తి చనిపోయాడు. తాజాగా బేగంపేట్‌లోనే ఓల్డ్ కస్టమ్స్ బస్తీ నాలాలో రెండు మృతదేహాలు కొట్టుకొచ్చాయి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. భారీ వర్షానికి ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు.

News May 8, 2024

HYD: నేడు చంచల్‌గూడ జైలుకు KTR.. క్రిశాంక్‌తో ములాఖత్‌

image

HYD చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న BRS పార్టీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ క్రిశాంక్‌ను బుధవారం ఉదయం 11 గంటలకు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTR పరామర్శించనున్నారు. ఈ మేరకు ములాఖత్‌ కోసం జైలు అధికారుల నుంచి అనుమతి తీసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సర్క్యూలర్‌ మార్ఫింగ్‌ చేసి వైరల్‌ చేశాడనే కేసులో క్రిశాంక్‌ను ఓయూ పోలీసులు ఈనెల 1న అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.

News May 8, 2024

BREAKING: HYD: బాచుపల్లి ప్రమాదంలో మృతులు వీరే..!

image

HYD బాచుపల్లి PS పరిధి రేణుకా ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు మృతిచెందగా నలుగురికి గాయాలైన విషయం తెలిసిందే. కాగా మృతులు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలకు చెందిన తిరుపతి(20), శంకర్(22), రాజు(25), ఖుషి, రామ్ యాదవ్(34), గీత (32), హిమాన్షు(4)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను జేసీబీల సహాయంతో వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు బాచుపల్లిలోని మమత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

News May 8, 2024

HYD: ఈనెల 13న జూపార్కుకు సెలవు

image

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 13వ తేదీన HYD బహదూర్‌పురలోని జూపార్కుకు సెలవు ప్రకటిస్తున్నట్లు క్యూరేటర్‌ డాక్టర్‌ సునీల్‌ ఎస్‌.హీరెమత్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 13న జూపార్కు మూసి ఉంటుందని, మరుసటి రోజు యథావిధిగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శకులకు అందుబాటులో తెరిచి ఉంటుందన్నారు. సందర్శకులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.

News May 8, 2024

HYD: ‘మనూ’లో ఎంసీజే కోర్సులో అడ్మిషన్లు ప్రారంభం

image

HYD రాయదుర్గంలోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ(మనూ)లో ఎంసీజే కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఎంసీజే హెచ్‌ఓడీ ప్రొ.మహ్మద్‌ ఫరియాద్‌ తెలిపారు. ఎంసీజేలో ప్రింట్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా, పబ్లిక్‌ రిలేషన్స్‌, డిజిటల్‌ మీడియా, వీడియో ప్రొడక్షన్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ లేదా 9966058101 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

News May 8, 2024

HYD: వామపక్షాల మద్దతు లేకుండా కాంగ్రెస్‌ గెలవదు: MLA

image

లోక్‌సభ ఎన్నికల్లో వామపక్షాల మద్దతు లేకుండా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ గెలవలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, MLA కూనంనేని సాంబశివరావు తేల్చి చెప్పారు. మంగళవారం HYD బషీర్‌బాగ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీజేపీ దేశానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాలంటే ఆ పార్టీని ఓడించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.