Hyderabad

News January 7, 2026

HYD: ఫతేమైదాన్ వద్ద ఈ గుట్ట గురించి తెలుసా?

image

నగరం అపూర్వ కట్టడాలు, సంపదకు నెలవు. ఇక్కడి కట్టడాలపై చరిత్రకారులు రాసిన పుస్తకాలు అనేకం. పెద్దగా ప్యాచుర్యంలేని ఫతేమైదాన్ సమీపంలో ‘నౌబత్ పహాడ్’ గురించి తెలుసా? ఈ పేరు వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ‘నౌబత్’ అంటే డోలు, ‘పహాడ్’ అంటే గుట్ట. ప్రజలకు ఫర్మానాలు వినిపించడానికి ఈ కొండపైనే నగారాలు మోగించేవారు. డోలు కొడుతూ ఆజ్ఞలను వినిపించేవారు. అలా ఈ ప్రాంతానికి నౌబత్ పహాడ్ అనే పేరు వచ్చింది.

News January 7, 2026

354కి చేరిన AQ.. HYDలో జర భద్రం

image

HYDలో ఎయిర్ క్వాలిటీ మరొకసారి తారస్థాయికి చేరింది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతూ వస్తోంది. డబుల్ డిజిట్‌లో ఉండాల్సిన ఎయిర్‌క్వాలిటీ బుధవారం బడంగ్‌పేట్‌లో తెల్లవారుజామున 354కి చేరింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటీస్, డస్ట్ అలర్జీ ఉన్నవారితో పాటు సామాన్యులు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. గతవారం రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ ఇవాళ భారీగా పెరిగింది.

News January 7, 2026

HYD: 20ఎకరాల వేలం.. రూ.30 వేల కోట్ల లక్ష్యం

image

రూ.30 వేల కోట్ల సేకరణపై HMDA దృష్టి సారించింది. రూ.20వేల కోట్లను బాండ్ల వేలం ద్వారా సమకూర్చుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. వీటితోపాటు HMDA పరిధిలోని భూములను వేలం వేసి మిగతా ఆదాయాన్ని సమకూర్చుకునేలా చూస్తున్నారు. నియోపోలిస్ వద్ద 70, బంజారాహిల్స్‌లో 8, కొండాపూర్ వద్ద 20 ఎకరాలు వేలానికి సిద్ధం చేశారు. వచ్చిన ఆదాయంతో HMDA పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

News January 7, 2026

HYD- మేడారం జాతరకు ఈజీగా వెళ్లొచ్చు!

image

HYD నుంచి ములుగు జిల్లాలో ఆసియాలోనే జరిగే అతిపెద్ద గిరిజనుల జాతరకు వెళ్లాలని ఉందా? ఉప్పల్ నుంచి మేడారం సమ్మక్క సారక్క జాతరకు ప్రత్యేక బస్సులు ఉన్నాయి. ఉప్పల్- వరంగల్, హనుమకొండ అక్కడి నుంచి డైరెక్ట్‌గా మేడారం వెళ్లడానికి బస్సులు అందుబాటులో ఉన్నట్లు RTC అధికారులు తెలిపారు. వ్యక్తిగత వాహనాల్లో వెళ్తే WGL నుంచి పస్ర, అక్కడి నుంచి నార్లపూర్, మేడారం వెళ్లాలి. RTC బస్సులు గద్దెల సమీపానికి వెళ్తాయి.

News January 7, 2026

HYD: లవ్ ఫెయిల్.. యువ డాక్టర్ బలి!

image

సిద్దిపేటలో జూనియర్ డాక్టర్ లావణ్య(23) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అదే కళాశాలలో జనరల్ మెడిసిన్ చదువుతున్న HYD అల్వాల్‌కు చెందిన ప్రణయ్‌కి 2025 జులైలో లావణ్యతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వివాహం చేసుకుంటానని నమ్మించి కులాన్ని అడ్డుగా చూపించి నిరాకరించాడు. దీంతో గడ్డి మందు ఇంజెక్ట్ చేసుకుని లావణ్య సూసైడ్ చేసుకుంది. ప్రణయ్‌పై సిద్దిపేట పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

News January 7, 2026

HYD: మాంజా కనిపిస్తే కాల్ చేయండి

image

TGFD, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ సింథటిక్, గాజు పూత ఉన్న మాంజాపై నిషేధం విధించింది. HYDలో స్పెషల్ డ్రైవ్ సాగుతోంది. ప్రజలకు మాంజా కనిపిస్తే వెంటనే 1800 4255364, 040- 23231440కు కాల్ చేయాలని కోరింది. మాంజా విక్రయిస్తే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 సెక్షన్ 51 ప్రకారం కఠిన శిక్షలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. వివరాలు గోప్యంగా ఉంచి చర్యలు చేపడతామని HYD TGFD ట్వీట్ చేసింది.
# SHARE IT

News January 7, 2026

21 లక్షల నుంచి 1.3 కోట్లకు చేరిన HYD జనాభా..!

image

దేశంలో 2050 నాటికి న‌గ‌ర జ‌నాభా 50 కోట్ల‌కు చేర‌నుంద‌ని లెక్క‌లు చెబుతున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. 1975లో హైద‌రాబాద్ జ‌నాభా 21 ల‌క్ష‌లుండంగా.. ప్ర‌స్తుతం 1.3 కోట్ల‌కు చేరింది. హైద‌రాబాద్‌లో జ‌నాభా వృద్ధి రేటు 6.2 రెట్లుందని పేర్కొన్నారు. మేధో మదన సదస్సులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ విస్తృతంగా ప్రసంగించారు.

News January 7, 2026

రూ.65,650 కోట్ల విలువైన భూములు కాపాడిన హైడ్రా

image

HYDలో ఆక్రమణలపై HYDRAA చర్యలు కొనసాగిస్తోంది. తాజాగా జరిగిన ఎల్‌బీఎస్‌ఎన్ఏలో హైడ్రా క‌మిష‌న‌ర్‌ ప‌వ‌ర్‌ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. చెరువులు, పార్కులు, రోడ్లు, నాలాలు కలిపి 1,313.19 ఎకరాల ప్రభుత్వ భూములను HYDRAA స్వాధీనం చేసుకుంది. వీటి విలువ రూ. 65,650 కోట్లుగా అంచనా. మూసీ పరీవాహక ప్రాంతంలోని ఆక్రమణలు తొలగించి, సహజ ప్రవాహం పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.

News January 6, 2026

HYD ఈస్ట్ రెసిడెన్స్‌కు గుడ్ న్యూస్!

image

HYD ఈస్ట్ ప్రాంత వాసుల సీవరేజ్ వాటర్ కష్టాలకు చెక్ పడనుంది. నాగోల్‌లోని 320 MLD ప్లాంట్ ఆధునీకరణకు జలమండలి రూ.3.83 కోట్ల భారీ బడ్జెట్‌తో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జల్ హీ అమృత్ పథకంలో భాగంగా ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. అత్యాధునిక యంత్రాలతో ట్రంక్ సీవర్ల పూడికతీత, నాలాల రక్షణ గోడల మరమ్మతులు చేపట్టనున్నారు. దీంతో మురుగు వాసన తగ్గడమే కాకుండా, శుద్ధి చేసిన నీటిని రీసైక్లింగ్ చేసి వాడుకునే వీలుంటుంది.

News January 6, 2026

HYD: కొత్తగా వర్క్ ఫ్రమ్ విలేజ్!

image

గజ్వేల్, చౌటుప్పల్ వంటి పల్లెలు ఇకపై వ్యవసాయానికే పరిమితం కావు. గ్రిడ్ పాలసీ పేరుతో ప్రభుత్వం గ్రామాల్లో 10Gbps ఇంటర్నెట్, సోలార్ పవర్ హబ్‌‌ను ప్రతిష్ఠిస్తోంది. T-Fiber నెట్‌వర్క్‌ను విద్యుత్ పోల్స్ ద్వారా ప్రతి ఇంటికీ అనుసంధానించడం వల్లే ఇది సాధ్యమవుతోందని అధికారులు తెలిపారు. IT కోసం హైటెక్స్‌ వెళ్లకుండా ల్యాప్‌టాప్ ముందు కూర్చొని విదేశీ ప్రాజెక్టులు చేసేలా ‘వర్క్ ఫ్రమ్ విలేజ్’ ప్లాన్ ఇది.