India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సదర్ ఉత్సవాలకు హైదరాబాద్ ముస్తాబైంది. నేటి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు NTR స్టేడియంలో తెలంగాణ సదర్ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఇక దీపావళి వేళ నగరానికి దున్నపోతుల విన్యాసాలు ప్రత్యేక శోభను తీసుకొస్తాయి. నారాయణగూడ, ఖైరతాబాద్, ముషీరాబాద్, అమీర్‌పేటతో పాటు HYDలోని యాదవ సోదరులు నార్త్ ఇండియా నుంచి బలమైన దున్నరాజులను తీసుకొస్తున్నారు. ఈ ఏడాది సదర్ సయ్యాటలతో హైదరాబాద్ దద్దరిల్లనుంది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అర్ధ వార్షిక ఆదాయంలో మొదటి స్థానంలో నిలిచి రాష్ట్రానికి వెన్నుదన్నుగా మారిందని ఉప రవాణా శాఖ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. రవాణా శాఖ అర్ధ వార్షిక ఆదాయం రూ.1438 కోట్లు సమకూరింది. ఇందులో రంగారెడ్డి రూ.802 కోట్లు, మేడ్చల్ రూ.595 కోట్లు, వికారాబాద్ నుంచి రూ.39 కోట్లు సమకూరింది. రాష్ట్ర ఆదాయంలో ఉమ్మడి RR జిల్లా నుంచి ఏకంగా 45% ఆదాయం రావడం గమనార్హం.
ORR అంతర్భాగంలోని GHMCతో పాటు శివారు ప్రాంతాల్లోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలను కలిపి కొత్తగా 4 గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి పురపాలక, ప్లానింగ్ శాఖ ఇప్పటికే కసరత్తు చేస్తుంది. ORR లోపల దాదాపు 2 కోట్ల జనాభా నివసిస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు. మరి 4 కార్పొరేషన్ల ఏర్పాటుపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి.
నిన్న జరిగిన గ్రూప్-1 పరీక్షలో ఇస్లావత్ లక్ష్మి అనే అభ్యర్థి ఇబ్రహీంపట్నం CVR కాలేజ్‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ విషయం తెలిసిందే. కాలేజ్ సూపరింటెండెంట్ శివారెడ్డి ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు FIR నమోదు చేశారు. నేడు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు ఆమెను హాజరు పరిచారని ఎస్సై రామకృష్ణ తెలిపారు.
TGSRTC ఇకనుంచి టీఎన్జీవోతో కలిసి పని చేయనున్నట్లు RTC JAC ప్రకటించింది. టీఎన్జీవో కార్యాలయంలో జరిగిన 2 జేఏసీల ప్రతినిధుల సమావేశంలో ఈ మేరకు ఒప్పందం కుదిరిందని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆర్టీసీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం సమన్వయంతో సంయుక్తంగా పోరాట కార్యక్రమం రూపొందించుకుంటామని తెలిపారు. JAC వైస్ ఛైర్మన్ థామస్ రెడ్డి పాల్గొన్నారు.
గ్రేటర్ HYDలో మ్యాన్ హోల్ క్లీనింగ్ కోసం అనేకచోట్ల ఇన్ని రోజులు బకెటింగ్ యంత్రాలను ఉపయోగించారు. తాజాగా 90 రోజుల స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో పలుచోట్ల మళ్లీ పాత పద్ధతిని అవలంబించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మ్యాన్ హోల్ క్లీనింగ్ కారణంగా భారతదేశంలో 1993-2021 వరకు 971 మంది మరణించారని రికార్డులు చెబుతున్నప్పటికీ, ఎందుకు మళ్లీ పాత పద్ధతినే కొనసాగిస్తున్నారని..? ప్రజలు ప్రశ్నించారు.
హైదరాబాద్‌లో చికెన్ ధరలు తగ్గాయి. ఈ వారం ప్రారంభంలో KG రూ.243కు విక్రయించారు. గత 3 వారాలుగా మాంసం ధరలు పెరుగుతూ వచ్చాయి. కానీ శనివారం ధరలు మాంసం ప్రియులకు ఊరట కలిగించాయి. నేడు స్కిన్ లెస్ KG రూ.226, విత్ స్కిన్ KG రూ.199గా ధర నిర్ణయించారు. రిటైల్‌లో రూ. 137, ఫాంరేటు ధర రూ. 115 ఉంది. నగరంలోని కొన్ని హోల్ సేల్ దుకాణాల్లో రూ. 5 నుంచి రూ. 15 వరకు తగ్గించి అమ్మకాలు చేస్తుంటారు.
దూర విద్య ద్వారా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 5వ తేదీ వరకు, రూ.500 ఆలస్య రుసుంతో 8వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రవేశ పరీక్ష నవంబర్ 9న జరగనుందని తెలిపారు. వెబ్‌సైట్: www.ouadmissions.com
HYD హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలికను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపి, బంధించి చిత్రహింసలు పెట్టిన మహిళకు న్యాయస్థానం జీవిత ఖైదు శిక్ష విధించింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నిందితురాలు కే.ఆశ(24) పై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి న్యాయమూర్తి ఎదుట ఈరోజు హాజరుపర్చగా జీవిత ఖైదు శిక్ష విధించారు. ఈ కేసులో నిందితురాలికి జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.3,19,000 జరిమానా విధించారు.
HYD అఫ్జల్‌గంజ్ ఉస్మానియా ఆస్పత్రిలో డెర్మటాలజీ ప్రత్యేక విభాగం అందుబాటులోకి తెచ్చినట్లు డెర్మటాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ భూమేశ్ కుమార్ వెల్లడించారు. ఉచిత చికిత్స అందిస్తున్నామని నిత్యం 100 మంది ఓపీ వస్తుంటారని, తీవ్రమైన చర్మవ్యాధి లక్షణాలు ఉంటే బయాప్సి పరీక్షలు చేస్తామని తెలిపారు. పిల్లల కోసం పీడియాట్రిక్ డెర్మటాలజీ చికిత్స కేంద్రం ప్రారంభించినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.