India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొండాపూర్ పరిధిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీపీ అవినాశ్ మహంతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. 2014 జూన్ 2న అధికారికంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నేటితో పదేళ్లు పూర్తి చేసుకుందన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంలో పోలీసు శాఖ సిబ్బంది మనస్ఫూర్తిగా కర్తవ్య నిర్వహణ చేయాలని కోరారు.
గ్రేటర్ HYDలోని ప్రతి బస్ డిపోలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ పనులను ప్రారంభించింది. కంటోన్మెంట్, మియాపూర్-1 డిపోలో ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా, గ్రేటర్‌లోని మరో 23 బస్ డిపోల్లోనూ జులై చివరి నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఇప్పటికే 62 ఎలక్ట్రిక్ బస్సులు ఉండగా మరో 20 జూన్ చివరి నాటికి అందుబాటులో రానున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా HYD బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమరవీరుల త్యాగాల ఫలితం, తెలంగాణ ప్రజల పోరాటంతో ఏర్పడిన రాష్ట్రాన్ని 10 ఏళ్లు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నమని గుర్తు చేశారు. మాజీ సీఎం KCRతో సహా ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కొనియాడారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి HYD నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కార్యాలయంలో జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల పోరాటాలు, ఆకాంక్షలకు అనుగుణంగా స్వరాష్ట్రం ఏర్పడిందని అన్నారు. ప్రత్యేక రాష్ర్ట పోరాటాన్ని తాను స్వయంగా చూశానని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసుశాఖలో ఎన్నో నూతన కార్యక్రమాలు చేపట్టామని అన్నారు.
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజల నుంచి ట్రాఫిక్ తగ్గించడం, జంక్షన్ డెవలప్మెంట్, కార్ పూలింగ్, రైడ్ షేరింగ్, ట్రాఫిక్ సంబంధిత సమస్యలపై సలహాలు, సూచనలను స్వీకరించనున్నట్లు తెలిపారు. మీ అమూల్యమైన ఐడియాలను 7569311356 వాట్సప్, Cyberabad Traffic police X అకౌంట్, @Cyberabadtrafficpolice ఫేస్ బుక్ అకౌంట్‌కు తెలపవచ్చని పేర్కొన్నారు.
HYD ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకువచ్చిన ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. తెలంగాణ పోలీస్ అకాడమీ సమీపంలో ఆగి ఉన్న రెండు కార్లను ఢీకొంది. ఒక్కసారిగా వారి పైకి ట్యాంకర్ దూసుకువెళ్లడంతో యువతి, యువకుడు మృతి చెందారు. ఔటర్ రింగు రోడ్డులో కార్లు ఆపి ఫొటోలు దిగుతున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు నార్సింగి పోలీసులు గుర్తించారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.
సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరిలో BRS గెలుస్తుందని CPAC ఎగ్జిట్ పోల్స్ సర్వేలో వెల్లడైంది. TGలో BRSకు 11, BJPకి 2, కాంగ్రెస్, MIM చెరో స్థానంలో గెలుస్తాయని అంచనా వేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 64/66, BRSకు 39/40 సీట్లు వస్తాయని చెప్పిన మాట నిజమైందని CPAC తెలిపింది. కాగా ఈ స్థానాల్లో కొన్ని బీజేపీ, మరికొన్ని సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేయగా.. ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈ నెల 4న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు మూసేయాలని సీపీ అవినాశ్ మహంతి ప్రకటన జారీ చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలోని కొన్ని మినహా అన్ని మద్యం, కల్లు దుకాణాలు, బార్లు మూసేయాలని స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 5న ఉదయం 6 గంటల వరకు బంద్ కొనసాగుతుందని చెప్పారు. మరో వైపు నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల సందర్భంగా జూన్ 2న HYDలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. ప్యాట్నీ క్రాస్ రోడ్ నుంచి స్వీకర్ ఉపకార్ వరకు.. పరేడ్ గ్రౌండ్ రోడ్డులో టివోలీ క్రాస్ రోడ్డు వరకు..అక్కడి నుంచి బ్రోక్ బ్యాండ్ క్రాస్ రోడ్డు వరకు.. CTOనుంచి YMCAక్రాస్ రోడ్డు, సెయింట్ జాన్ రోటరీ మార్గంలో వాహనాలను అనుమతించబోమన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలన్నారు.
> మాదాపూర్, ఉప్పల్ శిల్పారామంలో నృత్య ప్రదర్శనలు
> అమరవీరుల స్థూపం వద్ద KCR నివాళులు
> ఘట్‌కేసర్‌లో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురి ARREST
> సైఫాబాద్‌లో బైకులను దొంగలిస్తున్న ముఠా అరెస్ట్
> ఓయూలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
> PHCలో అంబులెన్స్, ఆక్సిజన్ లేక శిశువు మృతి
> గవర్నర్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ
> కాచిగూడ రైల్వే స్టేషన్‌లో సెల్‌ఫోన్ స్నాచింగ్
> బాగ్ అంబర్‌పేట్‌లో కార్ల బ్యాటరీలు చోరీ
Sorry, no posts matched your criteria.