Hyderabad

News September 2, 2025

సికింద్రాబాద్: రెండు నెలల్లో 33 మంది అరెస్ట్

image

సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న రైళ్లను టార్గెట్ చేస్తూ రాళ్లు విసురుతున్న 33 మందిని రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు అరెస్ట్ చేశారు. జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు 54 రైళ్లపై రాళ్లు రువ్వినట్లు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఇంకా 30 మంది పరారీలో ఉన్నారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. రైళ్లపై రాళ్లు రువ్వితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News September 2, 2025

HYD నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

HYD చర్లపల్లి నుంచి తిరుపతి మధ్య నడుస్తున్న స్పెషల్ ట్రైన్‌ను దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో నవంబర్ 26 వరకు పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. చర్లపల్లి-తిరుపతి(07013) ట్రైన్ నవంబర్ 25 వరకు ప్రతి మంగళవారం నడుస్తుంది. అలాగే తిరుపతి-చర్లపల్లి (07014) రైలు నవంబర్ 26 వరకు ప్రతి బుధవారం ప్రయాణికులకు సేవలందించనుంది. ప్రయాణికులు ఈ విషయం గమనించాలని రైల్వే అధికారులు కోరారు.
SHARE IT

News September 2, 2025

HYD: ఆలుమగల బీజీ లైఫ్.. ప్లే స్కూల్స్‌కు గిరాకీ

image

హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో ప్లే స్కూల్స్ పెరుగుతున్నాయి. తల్లులు ఉద్యోగాలకు వెళ్లడం, పిల్లల్ని చూసుకోవడం, వేరే చోట పంపడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుండగా వీటికి డిమాండ్ పెరిగింది. హైటెక్ సిటీ, మియాపూర్, అమీర్‌పేట్, KPHB లాంటి ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. పని చేసే తల్లిదండ్రులకు ఇవి చాలా సౌకర్యంగా ఉన్నాయి.

News September 2, 2025

HYD: YSRకు మంత్రి సీతక్క నివాళులు

image

మాజీ సీఎం దివంగత డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రజాభవన్‌లో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం ఆయన సేవలను స్మరించుకున్నారు. రాష్ట్ర ప్రజల కోసం వైయస్‌ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పేదలకు పెద్దన్నగా నిలిచారని అన్నారు.

News September 2, 2025

HYD: KCR, హరీశ్‌రావుకు స్వల్ప ఊరట

image

జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. KCR, హరీశ్‌రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిపింది. ఘోష్ కమిటీ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేపట్టొద్దని అదేశించింది. వెకేషన్ తర్వాత వాదనలు వింటామని స్పష్టిం చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది.

News September 2, 2025

YSRకి మంత్రి పొన్నం నివాళులు

image

డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ YSR సీఎంగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో అపూర్వ సేవలు అందించారని కొనియాడారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతు రుణమాఫీ వంటి పథకాలతో పేదలకు పెద్దన్నగా నిలిచారని గుర్తుచేశారు. YSR లేని లోటు కాంగ్రెస్‌కి తీరనిదని కొనియాడారు.

News September 2, 2025

Throw Back: బడా గణేశ్‌కు బడా NTR పూజలు

image

దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ గణేశుడిని మొదటిసారి 1954లో స్వాతంత్ర్య సమరయోధుడు సింగరి శంకరయ్య ప్రతిష్టించారు. సమాజ ఐక్యతకు బాలగంగాధర్ తిలక్ పిలుపు నుంచి ప్రేరణపొంది దీనిని రూపొందించారు. మహా గణపతిని ప్రతిష్ఠించినప్పుడు ఎత్తు కేవలం అడుగు మాత్రమే. బడా గణేశ్‌ను ఎందరో ప్రముఖులు దర్శించుకున్నారు. దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో బడా గణేశ్‌కు NTR పూజలు చేసిన ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

News September 2, 2025

HYD: గణపతి నిమజ్జనం.. వీటిని పాటించండి..!

image

రాచకొండ పోలీసులు గణపతి నిమజ్జనాల వేళ ప్రజలకు సూచనలు చేశారు.
✓ కరెంటు తీగలు జాగ్రత్త
✓ వాహనం రివర్స్ చేయొద్దు
✓ డ్రైవర్ మద్యం తాగి ఉండకూడదు
✓ పిల్లలు వాహనం వెంబడి రాకూడదు
✓ ప్రతి వాహనానికి ఇన్‌చార్జ్‌లు ఉండాలి
✓ పెద్ద విగ్రహాలకు ముందే పోలీసులకు సమాచారం ఇవ్వాలి
✓ క్రేన్ దగ్గర దూరం పాటించాలి

News September 2, 2025

లండన్‌లో యాక్సిడెంట్.. HYD వాసులు మృతి

image

లండన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో HYDకు చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. 2 కార్లు ఎదురెదురుగా ఢీకొనగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులను నాదరుల్ చెందిన తర్రె చైతన్య (22), ఉప్పల్‌కు చెందిన రిషితేజ (21)గా పోలీసులు గుర్తించారు. గణేశ్ నిమజ్జనం చేసి వస్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు.

News September 2, 2025

HYD: అంగన్వాడీలతో పిల్లలు, గర్భిణీలకు పౌష్టికాహారం

image

అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు సమయానికి నాణ్యమైన పోషక ఆహారం అందించాలని HYD కలెక్టర్ హరి చందన సంబంధిత సిబ్బందికి సూచించారు. సోమవారం యూసుఫ్‌గూడ ఆరోగ్యనగర్‌లోని నాట్కో అంగన్వాడీ కేంద్రం, సుభాష్‌నగర్‌లోని మరో అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె సందర్శించి పరిశీలించారు. పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పోషకాహారం అందించాలన్నారు.