India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD వాసులను అలరించేలా ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ జూన్ 7 నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. ఏటా ముంబై, బెంగళూరులో నిర్వహించే ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ మొదటిసారి హైదరాబాద్ గుడిమల్కాపూర్ కింగ్స్ కోహినూర్ (క్రౌన్) కన్వెన్షన్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి దాదాపు 250 మంది ప్రముఖ కళాకారులు, 30 ఆర్ట్ గ్యాలరీల యాజమానులు పాల్గొననున్నారు.
HYD జీడిమెట్ల PS పరిధిలోని న్యూ ఎల్బీనగర్‌లో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా నివాసం ఉండే అఖిల(22) అనే యువతిని అఖిల్ సాయిగౌడ్ అనే యువకుడు ప్రేమిస్తున్నాడు. 8ఏళ్లుగా ప్రేమిస్తున్నానని చెప్పి ఆమె వెంట తిరిగాడు. ఇప్పుడు అతడు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో మనస్తాపం చెందిన అఖిల ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అఖిల తండ్రి ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు.
HYD ఎల్బీనగర్ జోన్ పరిధి నాగోల్- ఆనంద్ నగర్ రోడ్డుపై భారీ గుంతలు ఉన్నాయని ఓ యువతి ఇటీవలే బురదలో కూర్చొని నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. ఆమె నిరసనకు GHMC యంత్రాంగం కదిలి వచ్చింది. ప్రస్తుతానికి తాత్కాలికంగా వెట్ గ్రావెల్ మిక్స్ వేసి గుంతలు పూడ్చారు. తారు రోడ్డు వేసేందుకు ఉన్నతాధికారులు ప్రతిపాదనలు ఆమోదించగానే శాశ్వతంగా సమస్య పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల ఫలితాల గడువు సమీపిస్తుండటంతో HYD,రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ నాటి నుంచి ఎక్కడ నలుగురు కలిసినా మనం గెలుస్తున్నామా?.. మన అభ్యర్థికి ఎంత మెజారిటీ వస్తుంది?.. మన పార్టీ హవా ఎలా ఉంది?అనే మాటలు వినబడుతున్నాయి. ఈ ఉత్కంఠ ప్రధానంగా ఎన్నికల ముందు పార్టీలు మారిన నేతల్లో అధికంగా కనబడటం గమనార్హం.కాగా ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
రాష్ట్రంలో కులగణన చేపట్టడానికి ప్రత్యేకంగా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం HYD సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అన్నారు.
JNTU యూనివర్సిటీ పరిధిలో బీటెక్, బీఫార్మసీ నాలుగో సంవత్సరానికి సంబంధించి మొదటి సెమిస్టర్ సప్లమెంటరీ పరీక్షల తేదీలను మారుస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు ఓ ప్రకటనను విడుదల చేశారు. జూన్ 8వ తేదీ, 15వ తేదీన నిర్వహించనున్న పరీక్ష తేదీలను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు వాటిని జులై 5వ తేదీ, 8వ తేదీన నిర్వహిస్తామని అన్నారు. మిగతా పరీక్షలు యధావిధిగా కొనసాగుతాయని ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణలోని ప్రభుత్వ బోధన ఆసుపత్రుల్లో పేషంట్లు, డాక్టర్లకు భోజనం అందించే డైట్ క్యాంటీన్ల బిల్లులు గతేడాదిగా రాక డైట్ కాంట్రాక్టర్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. DME డా.ఎన్.వాణీకి డైట్ క్యాంటీన్ సప్లయిర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఈరోజు వినతిపత్రం ఇచ్చారు. గాంధీ, ఉస్మానియా, పేట్ల బుర్జు,నిలోఫర్, MGM వరంగల్,సంగారెడ్డి, సూర్యాపేట ఆసుపత్రులకు చెందిన దాదాపు రూ.40కోట్ల బిల్లులు రావాల్సి ఉంది.
జూనియర్ సివిల్ జడ్జి (JCJ) రాత పరీక్ష రాసే బీసీ అభ్యర్థులకు న్యాయం జరిగేలా చూడాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం HYD విద్యానగర్‌లో గుజ్జ కృష్ణ, వంశీ కృష్ణ, నీల వెంకటేశ్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. JCJ పరీక్ష కోసం ప్రస్తుత నోటిఫికేషన్‌లో BC అభ్యర్థులకు కనీస కటాఫ్ మార్కుల రిలాక్సేషన్ సడలింపును అందించలేదని అన్నారు.
వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారి నుంచి పద్మశ్రీ, పద్మ విభూషణ్ అవార్డుల కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు HYD జిల్లా యువజన, క్రీడా అధికారి ఎస్.సుధాకర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 31వ తేదీ సా.5 గంటల్లోగా జిల్లా యువజన, క్రీడా అధికారి కార్యాలయం, 8-303, థర్డ్ ఫ్లోర్, స్నేహ సిల్వర్ జూబ్లీ భవన్ కలెక్టరేట్ కాంప్లెక్స్ లక్డీకాపూల్, హైదరాబాద్ అడ్రస్‌లో 4 సెట్ల దరఖాస్తులను సమర్పించాలన్నారు.
HYD మెట్రోలో రద్దీ పెరిగిపోతోంది. 8 AM నుంచి 10 AM మధ్య ఎల్బీనగర్ నుంచి మియాపూర్, నాగోల్ నుంచి రాయదుర్గం రూట్‌లో నిల్చునేందుకు కూడా వీలుండట్లేదని ప్రయాణికుడు ఒకరు తెలిపారు. ఇరుకు ప్రయాణంతో అస్వస్థతకు గురవుతున్నామన్నారు. బుధవారం ఓ యువతి స్పృహ తప్పి పడిపోవడంతో యూసుఫ్‌గూడ స్టేషన్‌లో ప్రథమ చికిత్స నిమిత్తం సిబ్బందికి అప్పజెప్పినట్లు ఆ ప్రయాణికుడు Way2Newsకు తెలిపారు. సర్వీసులు పెంచాలని కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.