India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గోషామహల్ MLA రాజాసింగ్‌పై మంగళ్‌హాట్ PSలో 3 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. శ్రీరామనవమి శోభాయాత్రలో రాజాసింగ్ ప్రసంగిస్తున్న సమయంలో భక్తులు ఒక్కసారిగా టస్కర్ వాహనం వద్దకు తోసుకుంటూ వచ్చారు. దీంతో పోలీసులు వారిని పక్కకు జరుపుతుండగా ‘భక్తులు, కార్యకర్తలపై లాఠీలు ఝళిపిస్తే లాఠీలకు పనిచెప్పాల్సి వస్తుంది’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై కేసులు నమోదు చేశారు.
కుటుంబ కలహాల కారణంగా హైదరాబాద్ హుస్సేన్ సాగర్లోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన మెర్రీ అనే 36 ఏళ్ల మహిళను హైడ్రా DRF బృందం సకాలంలో కాపాడింది. బాలానగర్‌కు చెందిన ఆమెను గమనించిన స్థానికులు హైడ్రాకు సమాచారం అందించగా, DRF సిబ్బంది తాళ్ల సహాయంతో ఆమెను సురక్షితంగా రక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
HYDలోని నాలుగైదు MMTS ట్రెన్లలోనే సీసీ కెమెరాలు ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మహిళల భద్రత కోసం త్వరలో అన్ని MMTS ట్రెయిన్లలోని మహిళా బోగీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే MMTS స్టేషన్లలో కూడా కెమెరాల ఏర్పాటుపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు పరిశీలిస్తున్నారు.
బ్రహ్మకుమారీల దాది రతన్ మోహిని జీ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. దాది మోహిని గ్లోబల్ సెంటర్ల చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అని, దాది జీవితం ఆదర్శప్రాయమన్నారు. దాది మృతి రాష్ట్ర, దేశ, విశ్వ ఆధ్యాత్మికతకు తీరనిలోటని సీఎం పేర్కొన్నారు.
అసెంబ్లీ ఆవరణలో ఫులే విగ్రహ ఏర్పాటుపై ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదని.. అనుముల ఇంటలిజెన్స్ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో రాష్ట్రానికి ప్రమాదం లేదని, అనుముల ఇంటలిజెన్స్‌తో ప్రమాదం ఉందన్నారు. అది రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తుందని, దాన్ని పక్కకు జరిపితే తప్ప రాష్ట్రం బాగుపడదన్నారు.
HYDలో సోమవారం మైనర్ డ్రైవింగ్ లపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సైదులు మాట్లాడుతూ.. చాలా ప్రమాదాలు డ్రైవింగ్‌పై అవగాహన లేకుండా, లైసెన్సు లేని మైనర్లు నడపడం వల్లనే జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రత్యేక తనిఖీల ద్వారా మైనర్లు నడిపిన వాహనాలు గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నామన్నారు. వాహనాలను ఇచ్చిన వారిపై కూడా చర్యలు ఉంటాయన్నారు.
HYD- తిరుపతి వెళ్లే ప్రయాణికులకు రైల్వే అధికారులు స్పెషల్ ట్రైన్ ప్రకటించారు. మే 23వ తేదీ వరకు వారానికి 2 సార్లు ఈ ట్రైన్ సేవలందిస్తుంది. చర్లపల్లి నుంచి (07017) శుక్ర, ఆదివారాల్లో, తిరుపతి నుంచి (07018) శని, సోమవారాల్లో నడుస్తుంది. మల్కాజిగిరి, కాచిగూడ, జడ్చర్ల, మహబూబ్‌నగర్, డోన్, కడప, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. చర్లపల్లి నుంచి రాత్రి 9.35కు, తిరుపతి నుంచి సాయంత్రం 4.40కు బయలుదేరుతుంది.
MMTS ప్రాజెక్టులో 82KM మేర 6 లైన్లను చేర్చినట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో ఘట్కేసర్- మౌలాలి క్వాడ్రిపులింగ్ (12 కి.మీ), తెల్లాపూర్- రామచంద్రాపురం కొత్త లైన్ (5 కి.మీ), మేడ్చల్- బొల్లారం డబ్లింగ్ (14 కి.మీ), ఫలక్నుమా- ఉమ్దనగర్ డబ్లింగ్ (1.4 కి.మీ), సనత్‌నగర్- మౌలాలి బైపాస్ డబ్లింగ్ (22 కి.మీ), సికింద్రాబాద్- బొల్లారం విద్యుద్ధీకరణ (15 కి.మీ) పనులు ఉన్నాయన్నారు.
శామీర్‌పేట్‌లోని జీనోమ్ వ్యాలీ PS పరిధిలో లాల్‌గడి మలక్‌పేట్ హైవేపై సఫారీ కారు డీసీఎం ఢీ కొన్నాయి. సఫారీ వాహనం సిద్దిపేట నుంచి నగరానికి వస్తుండగా డివైడర్‌కు తగిలి ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. ఏడుగురికి గాయాలయ్యాయి. మృతులు సిద్దిపేట జిల్లా వర్గల్‌కు చెందిన రాజు, తుర్కపల్లి పరిధి మురహరిపల్లికి చెందిన శ్రవణ్‌లుగా పోలీసులు గుర్తించారు.
నగరంలో రోడ్లపై వెళితే చాలు హారన్ మోతలు చెవులకు చిల్లులు పడేలా చేస్తున్నాయి. PCB రూల్స్ మేరకు సిటీలో 65 డెసిబుల్స్ శబ్దం మించారాదు. జీడిమెట్ల, గడ్డిపోతారం, హుసేన్‌సాగర్, ఉప్పల్, జూబ్లిహిల్స్, అబిడ్స్, గచ్చిబౌలి, తార్నాక, జూపార్క్, ఫలక్‌నుమా ప్రాంతాల్లో సాయంత్రం అయితే చాలు 100 డెసిబుల్స్ దాటిపోతోంది. ఉప్పల్- గచ్చిబౌలి రూట్లో అయితే ఏకంగా 110 నమోదవుతోంది.
Sorry, no posts matched your criteria.