Hyderabad

News April 12, 2026

HYD: టీనేజర్లలో పబ్‌ కల్చర్‌ 2.0.. గుట్టుగా పార్టీలు

image

HYDలోని టీనేజర్లలో పబ్‌ కల్చర్ కొత్త పుంతలు తొక్కుతోంది. జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌ వంటి ప్రాంతాల్లో మధ్యాహ్నం వేళల్లో ‘ఫేర్‌వెల్‌’, ‘ఫ్రెషర్స్‌’ పార్టీల పేరిట రహస్యంగా ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలు, ప్రైవేట్ గ్రూపుల ద్వారానే వీటి ప్రచారం సాగుతోంది. తల్లిదండ్రుల నిఘా లేకుండా క్లబ్‌ వాతావరణం కోసం విద్యార్థులు మొగ్గు చూపుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

News April 11, 2026

రాజేంద్రనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

image

రాజేంద్రనగర్ PS పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హిమాయత్‌సాగర్ ORR సర్వీస్ రోడ్ వద్ద మోటార్‌సైకిల్ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అబ్దుల్ సోహెద్ (20), షేక్ సాహిల్ (17) అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. ఇద్దరూ ఎలక్ట్రీషియన్లుగా పనిచేస్తున్న కార్మికులని సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 11, 2026

HYD: ALERT బాబోయ్ ఎండలు.. బయటకు రావద్దు!

image

HYDలో ఎండలు భగభగ మండుతున్నాయి. వాతావరణ శాఖ చెప్పినట్లే జరుగుతోంది. ఉమ్మడి HYD, RR జిల్లాల్లో రెండు రోజుల్లో 40 డిగ్రీలు దాటుతుందని చెప్పగా.. నేడు శంకర్పల్లి పరిధి ప్రొద్దుటూరులో 40.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లుగా వెల్లడించింది. మరోవైపు HYD జిల్లా పరిధిలో 39 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యవసరమైతే బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదని సూచిస్తుంది.

News April 11, 2026

HYD మెట్రో ఫేజ్‌ -2కు లైన్ క్లియర్

image

MGBS-దారుల్షిఫా నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో అలైన్‌మెంట్‌కు అడ్డంగా ఉన్న 84 భారీ చెట్లను మరో చోటికి ట్రాన్స్ లొకేట్ చేసేందుకు HAML టెండర్లు పిలిచింది. రూ 15.64 లక్షల అంచనా వ్యయంతో చేపట్టే ఈ పనులను మూడు నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు పాతబస్తీ మెట్రో అలైన్‌మెంట్‌లో కీలక అడ్డంకులను తొలగించి, పనులు వేగవంతం చేయడానికి ఉపయోగపడనుంది.

HYD: రూ.8000లతో కాశీ యాత్ర

image

కుషాయిగూడ డిపో నుంచి TG రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కాశీ యాత్రకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేశారు. ఈ నెల 16న ఉదయం 11 గంటలకు ECIL బస్టాండ్ నుంచి బయలుదేరనున్న ఈ యాత్రలో ప్రయాగరాజ్, కాశీ, అయోధ్య, ఉజ్జయిని, ఓంకారేశ్వర్ తదితర పుణ్యక్షేత్రాల దర్శనం ఉంటుంది. టికెట్ ధర రూ.8,000గా నిర్ణయించారు. బుకింగ్ కోసం డిపోలో నంబర్లను సంప్రదించాలని డిపో మేనేజర్ వేణుగోపాల్ సూచించారు.

News April 11, 2026

HYD: ఫొటో కొట్టు.. రూ.1,000 పట్టు!

image

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) హైవేలపై పరిశుభ్రత కోసం ‘క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్’ ప్రారంభించింది. టోల్ ప్లాజాల వద్ద టాయిలెట్లు మురికిగా ఉంటే, ‘రాజమార్గ యాత్ర’ యాప్‌లో ఫొటో అప్‌లోడ్ చేయాలి. ఫిర్యాదు నిజమైతే రూ.1000 ఫాస్టాగ్ రివార్డు లభిస్తుంది. అయితే, జియో-ఫెన్సింగ్ కారణంగా మీరు నేరుగా టోల్ ప్లాజా వద్ద ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ యాక్టివేట్ అవుతుందని అధికారులు స్పష్టం చేశారు.