Hyderabad

News March 18, 2024

FLASH.. HYD: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ 44వ జాతీయ రహదారి MSN పరిశ్రమ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 18, 2024

మల్కాజిగిరిలో పాగా వేసేదెవరో?

image

గత MP ఎన్నికల్లో మల్కాజిగిరిలో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన రేవంత్ రెడ్డి గెలుపొందారు. ఆయనకు 6,03,748 ఓట్లు రాగా BRS అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డికి 5,92,829 ఓట్లు, BJP అభ్యర్థి రాంచందర్‌రావుకు 3,04,282 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బలమైన అభ్యర్థి కోసం కసరత్తు చేస్తోంది. BRS తరఫున రాగిడి లక్ష్మారెడ్డి పేరును ప్రకటించగా BJP నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు.

News March 18, 2024

HYD: ‘KCR, KTR వల్లనే రాష్ట్రం అభివృద్ధి’

image

మల్కాజిగిరి పార్లమెంట్ BRS MP అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎల్బీనగర్ MLA సుధీర్ రెడ్డి కోరారు. MLA అధ్యక్షతన HYD కర్మాన్‌ఘాట్‌లో కార్యకర్తల సమావేశం జరిగింది. మాజీ CM KCR, KTR వల్లనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, BRSకు ఓటేసి గెలిపించాలని లక్ష్మారెడ్డి కోరారు. ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, రాజిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు తదితరులున్నారు.

News March 18, 2024

తుది దశకు చేరుకున్న చర్లపల్లి రైల్వేస్టేషన్ పనులు

image

నగరానికి మణిహారంగా భావిస్తున్న HYD చర్లపల్లి రైల్వేస్టేషన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభానికి సిద్ధమవుతోంది. చర్లపల్లి టెర్మినల్లో రూ.430 కోట్ల అంచనాతో ప్రయాణికులకు అనేక వసతులు కల్పిస్తున్నారు. 3 రైల్వే లైన్లుగా ఉన్న చర్లపల్లిలో ఇప్పుడు 9 ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 7 లిఫ్టులు, 6 ఎస్కలేటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. బస్ బేలు, ప్రవేశమార్గాలు, పార్కింగ్ స్థలం ఏర్పాటు చేస్తున్నారు.

News March 18, 2024

సికింద్రాబాద్ సీటు.. VERY హాట్

image

సికింద్రాబాద్ MP స్థానాన్ని దక్కించుకోవడానికి ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. 2019లో ఇక్కడి నుంచి BJP తరఫున కిషన్ రెడ్డి MPగా గెలిచి కేంద్రమంత్రి అయ్యారు. కిషన్ రెడ్డికి 3,84,780 ఓట్లు రాగా BRS అభ్యర్థి తలసాని సాయికిరణ్‌కి 3,22,666ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి అంజన్‌కుమార్ యాదవ్‌కు 1,73,229 ఓట్లు వచ్చాయి. ఈసారి కిషన్ రెడ్డిని ఓడించేందుకు BRS, కాంగ్రెస్‌ బలమైన అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తున్నాయి.

News March 18, 2024

HYD: మూడేళ్ల చిన్నారిపై బాలుడి అత్యాచారం

image

మూడేళ్ల చిన్నారిపై 13ఏళ్ల బాలుడు అత్యాచారం చేసిన ఘటన HYD సరూర్‌నగర్ PSపరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. పవనపురి కాలనీలో పక్క పక్క పోర్షన్లలో 2కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. ఆదివారం సాయంత్రం ఓ కుటుంబానికి చెందిన చిన్నారి దాబాపై ఆడుకుంటోంది. అదే సమయంలో మరో కుటుంబానికి చెందిన బాలుడు వెళ్లి చిన్నారిపై అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

News March 18, 2024

HYD: శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్యాలు

image

మాదాపూర్‌లోని శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం విశాఖపట్నం కళారాధన మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ గురువు డా.తాళ్లపాక సందీప్ కుమార్ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనతో అలరించారు. పుష్పాంజలి, మూషిక వాహన, ముద్దుగారే యశోద, శివతాండవం, మహాగణపతి, కాలభైరవాష్టకం, జయము జయం,అన్నమాచార్య కీర్తనలు, కళాపూజ, జగన్మోహన, దుర్గ స్తుతి, అభంగ్ మొదలైన అంశాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.

News March 18, 2024

HYD: సింగర్ మంగ్లీకి తప్పిన ప్రమాదం

image

ప్రముఖ గాయని మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ DCM ఢీకొన్న ఘటన HYD శంషాబాద్ పరిధి తొండుపల్లి సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. RR జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ హాజరై అర్ధరాత్రి మేఘ్ రాజ్, మనోహర్‌తో కలిసి ఆమె కారులో HYD- బెంగళూరు జాతీయ రహదారి మీదుగా ఇంటికి బయలుదేరారు. తొండుపల్లి వంతెన వద్దకు రాగానే DCM ఢీకొట్టింది. త్రుటిలో ప్రమాదం తప్పింది.

News March 18, 2024

HYDలో 4 రోజులు వర్షాలు..!

image

గ్రేటర్ హైదరాబాద్‌లో ఆదివారం నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. కాప్రా 34.09 డిగ్రీలు, ఉప్పల్ 34.6, ఫలక్‌నుమా 34.8, ముషీరాబాద్ 34.7, అంబర్‌పేట్ 34.1, ఖైరతాబాద్ 34.3, అల్వాల్‌లో 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే నేటి నుంచి 4 రోజుల పాటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు.

News March 18, 2024

GHMCలో నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

image

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ వచ్చినందున ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం లేదని, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత యథావిధిగా ప్రజావాణి ఉంటుందని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.