News March 18, 2024
HYD: శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్యాలు
మాదాపూర్‌లోని శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం విశాఖపట్నం కళారాధన మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ గురువు డా.తాళ్లపాక సందీప్ కుమార్ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనతో అలరించారు. పుష్పాంజలి, మూషిక వాహన, ముద్దుగారే యశోద, శివతాండవం, మహాగణపతి, కాలభైరవాష్టకం, జయము జయం,అన్నమాచార్య కీర్తనలు, కళాపూజ, జగన్మోహన, దుర్గ స్తుతి, అభంగ్ మొదలైన అంశాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.
Similar News
News October 7, 2024
HYD: ఏపీ సీఎం CBNను కలిసిన మాజీ మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సోమవారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె శ్రేయ రెడ్డి వివాహం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకు శుభలేఖను అందజేసి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఉన్నారు.
News October 7, 2024
HYD: మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనా?: కేటీఆర్
సోషల్ మీడియాలో ఎల్లప్పడూ యాక్టివ్‌గా ఉంటూ అధికార పక్షంపై తీవ్ర విమర్శలు చేస్తుంటారు MLA KTR. నిత్యం ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ.. ట్వీట్‌లు పెడుతుంటారు. ఈ నేపథ్యంలోనే మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ బడ్జెట్‌పై X వేదికగా తాజాగా స్పందించారు. మింగ మెతుకు లేదు కానీ, మీసాలకు సంపెంగ నూనె కావాలి అన్నట్టుంది ప్రభుత్వ వైఖరి అంటూ రాసుకొచ్చారు.
News October 7, 2024
HYD: మంత్రి తుమ్మల తీపికబురు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర రైతాంగానికి తీపి కబురు అందించారు. రైతుల రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాగానే రైతు భరోసా నిధులు వారి ఖాతాల్లో వేస్తామని మంత్రి వెల్లడించారు. సోమవారం గాంధీభవన్‌లో మంత్రులతో ప్రజల ముఖాముఖి కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. తెలంగాణలో రుణమాఫీ హామీ అమలు కాలేదని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమన్నారు.