India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏళ్లుగా HYD నుంచి ఉత్పత్తి అయ్యే చెత్తను జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్న విషయం తెలిసిందే. కాగా దానికి భారం తగ్గించేందుకు GHMC ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. మేడ్చల్, యాదాద్రి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో స్థలాలను గుర్తిస్తోంది. RRజిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్‌లో 42.22 ఎకరాలు, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం లక్డారంలో 100, దుండిగల్‌లో 85, మల్కాపూర్‌లో 200ఎకరాలను గుర్తించింది.
తెలంగాణ ఆడబిడ్డలకు ఇష్టమైన పండుగ బొడ్డెమ్మ.. బతుకమ్మ పండుగకు ముందు 9, 5, 3 రోజులు ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈ పండుగను జరుపుకుంటారు. తెలంగాణ సంప్రదాయం పాటించే కన్నెపిల్లలు, బాలికలు మట్టితో చేసిన బొడ్డెమ్మలను పెట్టి, పూలతో అలంకరించి చుట్టూ తిరుగుతూ ‘బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్.. బిడ్డాలెందరూ కోల్’ అంటూ కోలాటం ఆడతారు. మరి మీ ప్రాంతంలో బొడ్డెమ్మ పండుగ చేస్తే Way2Newsకు ఫొటోలతో వార్త పంపండి.
సైబరాబాద్ కమిషనరేట్ CPO కార్యాలయంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి పాల్గొని కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్, EOW DCP ప్రసాద్, అడ్మిన్ అడిషనల్ DCP రవిచంద్రన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పర్యాటక రంగానికి కేరాఫ్ మన హైదరాబాద్. విదేశీయులు సైతం నిత్యం నగరాన్ని సందర్శిస్తుంటారు. చార్మినార్, గోల్కొండ, సాలార్‌జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్, 7 టూంబ్స్, ట్యాంక్‌బండ్, పాతబస్తీలోని చెక్కు చెదరని పురాతన కట్టడాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కేబుల్ బ్రిడ్జి, నూతన సెక్రటేరియట్ నగరంలో కొత్త టూరిస్ట్ స్పాట్‌లుగా పేరొందాయి. మరి HYDలో మీకు నచ్చిన బెస్ట్ స్పాట్ ఏంటో కామెంట్ చేయండి.
HYD చరిత్రలో మూసీ వరదలు చెదరని ముద్ర వేశాయి. 1908 సెప్టెంబర్ 27 తెల్లవారుజామున క్లౌడ్ బరస్ట్ అయ్యింది. దాదాపు 36 గంటల పాటు భారీ వర్షం, వరదలు ముంచెత్తాయి. 28న మూసీ ఉగ్రరూపం దాల్చింది. వరదల్లో 50 వేల మంది నిరాశ్రయులు అయ్యారు. 15 వేల మంది చనిపోయినట్లు నాటి నిజాం పేర్కొన్నారు. ఇలాంటి విపత్తులు మరోసారి తలెత్తకుండా ఉస్మాన్ అలీఖాన్ ఆధ్వర్యంలో ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జంటజలాశయాలను నిర్మించారు.
హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ‘ప్రభుత్వాలు నిర్మాణాలు చేపట్టి పేరు తెచ్చుకోవాలి.. మీరు కూల్చివేతలతో పేరుతెచ్చుకోవాలనుకుంటున్నారు. హైడ్రాతో ఏకపక్షంగా ముందుకెళ్తున్నారు. ప్రభుత్వాలే అనుమతులు ఇచ్చి ఇప్పుడు అక్రమం అంటే ఎలా? పేద, మధ్యతరగతి ప్రజలు ఏమైపోవాలి. కూల్చివేతలకు ముందు బాధితులతో చర్చించాలి’ అని లేఖలో పేర్కొన్నారు.
అస్సాం రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య వ్యర్థాలు వాటి నియంత్రణకు అక్కడి ప్రభుత్వం చేపట్టిన విధివిధానాలపై HYD కార్పొరేటర్లు అస్సాం రాష్ట్రంలో స్టడీ టూర్‌ను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం ఆ రాష్ట్ర సీఎం హిమంత బిస్వశర్మను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆవుల రవీందర్ రెడ్డి, సతీశ్‌గౌడ్ పాల్గొన్నారు.
గురుకుల విద్యార్థుల్లో వ్యక్తిగత నైపుణ్యాలను మరింత మెరుగుపర్చడానికి తీసుకోవాల్సిన చర్యలపై సచివాలయంలోని కాన్ఫరెన్స్ హల్‌లో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గురుకులాలు బీసీ హాస్టళ్లు మరింత మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. హాస్టల్‌లో నాణ్యమైన ఆహారం అందించాలని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరించారు.
తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి ఐజీ రమేశ్ ఐపీఎస్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసంబ ఐలమ్మ చేసిన పోరాటాలను వారు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి పూలమాలేసి నివాళులర్పించారు. మహిళల ధైర్యానికి, పట్టుదలకు ప్రతీకగా నిలిచిన ఆమె పోరాటాలను కమిషనర్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.