India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీజీసెట్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ పరీక్షలకు 33,764 మంది అటెండ్ కానున్నారని టీజీ సెట్ మెంబర్ సెక్రటరీ గడ్డం నరేశ్ రెడ్డి తెలిపారు. ప్రతిరోజు ఉ.9 గంటల నుంచి మ.12 గంటల వరకు, మ.2 నుంచి సా. 5 వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. పరీక్ష ప్రారంభం కావడానికి 15 నిమిషాల ముందే గేట్లు మూసివేస్తామని వెల్లడించారు. అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు.
డ్రగ్స్ సరఫరా, వినియోగం కట్టడికి మరింత దూకుడుగా వ్యవహరించేందుకు పోలీసు, ఆబ్కారీ యంత్రాంగం సిద్ధమైంది. వారాంతపు సమయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నారు. అనుమానితుల మూత్ర నమూనాలు సేకరించి డ్రగ్స్ డిటెక్షన్ కిట్స్ ద్వారా కేవలం 2-5 నిమిషాల వ్యవధిలో పరీక్షించవచ్చు. డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించిన వారితో మత్తుపదార్థాల సరఫరాపై వివరాలు తెలుసుకొని కీలక వ్యక్తుల అరెస్టుకు సిద్ధమవుతున్నారు.
కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరంలో వాతావరణం పూర్తిగా మారింది. దీంతో కాలుష్య స్థాయులు తగ్గాయని పీసీబీ అధికారులు వెల్లడించారు. 10 కేంద్రాల్లో వాయునాణ్యత సూచీని లెక్కించగా 53గా నమోదైందని తెలిపారు. హెచ్సీయూ కేంద్రం వద్ద అత్యల్పంగా 23, న్యూమలక్‌పేట్ వద్ద అత్యధికంగా 73గా నాణ్యత సూచీ నమోదైందని వెల్లడించారు. జూ పార్కు 28, కొంపల్లి 55, ఈసీఐఎల్ 56, సనత్ నగర్ 59, నాచారం 62గా నమోదైంది.
కేంద్ర కాలుష్యనియంత్రణ మండలి నిర్వహించిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్-2024లో 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో హైదరాబాద్ 25వ స్థానంలో నిలిచింది. గతంతో పోలిస్తే గాలిలో ధూళికణాల మెరుగుదల ఆధారంగా నగరాల పనితీరును లెక్కించి ఈ ర్యాంకులు ప్రకటించింది. ఇందులో దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా జనాభా ఉన్న 47 నగరాల్లో హైదరాబాద్ 163.3 మార్కులతో 25వ స్థానంలో నిలిచింది.
నరాల సంబంధిత సమస్యలతో బాధపడే వారికి ఆధునిక వైద్యం అందించేందుకు టీఎంఎస్ యంత్రం అందుబాటులోకి వచ్చిందని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప చెప్పారు. ఆదివారం ఆసుపత్రి కార్యశాలలో ఆయన మాట్లాడారు. ఈయంత్రం సాయంతో మెదడులో ఏవైనా సమస్యలు తలెత్తితే బైపాస్ పద్ధతిలో చికిత్స చేసి తిరిగి పూర్వస్థితికి తీసుకురావచ్చన్నారు. రూ.2 కోట్ల విలువైన టీఎంఎస్ యంత్రంతో తక్కువ సమయంలో ఆధునిక వైద్యం అందించవచ్చని తెలిపారు.
దేశంలోనే అతిపెద్ద ఇంధన పొదుపు సదస్సు హైదరాబాద్ వేదికగా కానుంది. సీఐఐ ఆధ్వర్యంలో 10 నుంచి 12వ తేదీ వరకు మాదాపూర్‌లోని HICCలో జరగనుంది. ఈ కార్యక్రమంలో 23వ ఎనర్జీ ఎఫిషియన్సీ సమ్మిట్, సీఐఐ నేషనల్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ సిల్వర్ జూబ్లీ, పవర్ ప్లాంట్ సమ్మిట్ 2024, పేపర్ టెక్ 2024, గ్రీన్ షుగర్ సమ్మిట్ 2024 వంటి 3 ప్రధాన రంగాలపై ప్రత్యేక సదస్సులు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
BRS హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, నగర ఇన్‌ఛార్జ్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం కేసీఆర్, కేటీఆర్‌కు రాజీనామా లేఖను పంపించారు. అయితే తర్వాత ఏ పార్టీలో చేరుతారనే విషయాన్ని వెల్లడించలేదు. కాగా గత లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి BRS అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీనివాస్ యాదవ్ ఓడిపోయారు.
చదువుకున్న యువతకు నైపుణ్య శిక్షణ నిచ్చి జీవనోపాధి కల్పించే దిశగా GHMC అడుగులు వేస్తోంది. గతేడాది బల్దియా సహకారంతో చందానగర్‌లో ఏర్పాటైన లైట్ హౌస్ కమ్యూనిటీస్ ఫౌండేషన్ సెంటర్ ద్వారా పలువురికి భిన్న రంగాల్లో ఉద్యోగాలు లభించాయి. ఇదే మాదిరి గ్రేటర్‌లోని సర్కిళ్ల పరిధిలో కేంద్రాలను ఏర్పాటు చేయాలని కమిషనర్ ఆమ్రపాలి భావిస్తున్నారు. 2 నెలల్లో 4 చోట్ల ఈ కేంద్రాలను నెలకొల్పే లక్ష్యంగా చర్చలు సాగుతున్నాయి.
భవిష్యత్ నగరానికి బంగారు బాటలు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. HYD సమీపంలో తలపెట్టిన ‘ఫ్యూచర్ సిటీ’కి నగరం నుంచి రాకపోకలు చేసేందుకు వీలుగా నాలుగు విధాలుగా మార్గాలను అధికారులు సూచించారు. వీటన్నిటినీ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఫోర్త్ సిటీ (స్కిల్ యూనివర్సిటీ)కి చేరుకునేలా ప్లాన్ చేశారు. ఇందులో రెండు మెట్రో రైలు రూట్‌లు, మరో రెండు ఎలక్ట్రిక్ బస్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం మార్గాలున్నాయి.
ఇటీవల గాంధీ ఆసుపత్రి మొదటిసారిగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజానర్సింహ సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి కూడా ఆసుపత్రి అభివృద్ధికి పలు సూచనలు చేశారు. వీటిన్నింటినీ అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని అసుపత్రి వర్గాలు కోరుతున్నాయి. సరిపడా వైద్య సిబ్బంది, పారిశుద్ధ్యం, సెక్యూరిటీ, తదితర సిబ్బందిని నియమించాలి.
Sorry, no posts matched your criteria.