Hyderabad

News September 3, 2024

HYD: సర్పంచుల పరిస్థితి దారుణం

image

కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచులకు బిల్లులు చెల్లించకపోవడంతో వారి పరిస్థితి దారుణంగా మారిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో సోమవారం మాట్లాడారు. ‘రూ.1300 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని గవర్నర్‌ను కలిసి సర్పంచులు మొర పెట్టుకున్నారు. కేంద్రం నుంచి వచ్చిన రూ.600 కోట్లు ఎక్కడికి పోయాయి? గ్రామ పంచాయితీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది’ అని ప్రభుత్వంపై మండిపడ్డారు.

News September 3, 2024

HYD: ఇకనుంచి గల్లీల్లోనే ఆధార్ సేవలు

image

ఆధార్ సేవలను సులభతరం చేసేందుకు అబిడ్స్ జీపీవో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి వీధుల్లోనే ఆధార్ సేవలు అందించనున్నారు. అబిడ్స్‌లోని జీపీవోకి వచ్చి దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా కావాల్సిన తేదీల్లో శిబిరాలు ఏర్పాటు చేయిస్తున్నారు. ఇప్పుటికే ధూల్ పేట, కొండాపూర్, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో సేవలందించామని, ఇందుకు నామమాత్రపు రుసుం చెల్లించాలని చీఫ్ పోస్ట్ మాస్టర్ ప్రసాద్ తెలిపారు.

News September 3, 2024

HYD: రోడ్లన్నీ గోతులే.. రోజుకు వేలల్లో ఫిర్యాదులు

image

వర్షానికి నగరంలోని రోడ్లన్నీ ఛిద్రమయ్యాయి. సీసీ రోడ్లు, బీటీ రోడ్లని తేడాలేకుండా గుంతలుపడి నీళ్లు నిలిచాయి. మ్యాన్‌హోళ్ల మరమ్మతులు లేక రోడ్లన్నీ బురదమయం అయ్యాయి. మహానగంలో ఉమ్మడి జిల్లాను కలుపుతూ 10వేల కి.మీ.ల రోడ్లుంటే అందులో 885 కి.మీ. ప్రధాన రహదారులు నిర్వహణ బాధ్యత ప్రైవేట్ సంస్థలది. వీటిపై అధికారులు పర్యవేక్షణను గాలికొదిలేశారు. బల్దియాకు రోజుకు 1000కిపైగా రహదారులపై కంప్లెంట్స్ వస్తున్నాయి.

News September 3, 2024

HYD: ప్రజలకు హెచ్చరికలు జారీ చేయలేదు: KTR

image

HYD వాతావరణ కేంద్రం ఆగస్టు 27న పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని ముందస్తు హెచ్చరికలు జారీ చేసిందని MLA KTR తెలిపారు. అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసినా.. ఈ కుంభకర్ణ కాంగ్రెస్ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఎలాంటి ముందు జాగ్రత్తలు, ప్రజలకు హెచ్చరికలు జారీ చేయలేదన్నారు. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా ఓ యువ శాస్త్రవేత్త, 20 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. KTR వ్యాఖ్యలపై మీ కామెంట్..?

News September 2, 2024

HYD: నగరవాసులకు ట్రాఫిక్ ALERT

image

HYD నగర ప్రజలకు సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ అలర్ట్ జారీ చేశారు. ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ టోర్నమెంట్ కప్-2024 సెప్టెంబర్ 3, 6, 9వ తేదీలలో GMCB గచ్చిబౌలి స్టేడియంలో జరగనుంది. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి, గచ్చిబౌలి నుంచి లింగంపల్లి, IIIT సర్కిల్ నుంచి విప్రో రూట్‌లో ఆయా రోజుల్లో సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు ట్రాఫిక్ రద్దీ ఉంటుందన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

News September 2, 2024

BREAKING..HYD: రెయిన్ ఎఫెక్ట్.. నేడు 18 రైళ్లు రద్దు

image

తెలుగు రాష్ట్రాలలో కురిసిన వర్షంతో అనేక చోట్ల వరదలు ముంచెత్తాయి. దీంతో నేడు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు దాదాపు 18 రైళ్లను రద్దు చేస్తూ నోటీసు జారీ చేశారు. ఇందులో సికింద్రాబాద్ నుంచి సిర్పూర్, కాగజ్ నగర్, షాలిమార్, విశాఖపట్నం, హౌరా, గుంటూరు రైళ్లు ఉన్నాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని GM అరుణ్ కుమార్ జైన్ సూచించారు.

News September 2, 2024

ల్యాండ్ పూలింగ్ పథకంలో నిబంధనల మార్పు

image

హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చేపట్టే ల్యాండ్ పూలింగ్ పథకంలో తాజాగా నిబంధనల్లో మార్పు చేయనున్నారు. రైతులకు ఇచ్చే వాటా మౌలిక వసతుల కల్పనకే పరిమితం కానుంది. గతంలో రైతులకు సంబంధించి ప్లాట్లను కూడా హెచ్ఎండీఏ విక్రయించేది. కాగా ఈ నిబంధనల్లో మార్పులు చేయాలని భావిస్తోంది. దీంతో హెచ్ఎండీఏ ధరకంటే రైతులు ఎక్కువకే విక్రయించుకునే అవకాశముంది.

News September 2, 2024

HYDERABAD COOL..!

image

3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు HYD చల్లబడింది. చిరుజల్లులు, పచ్చదనంతో నగరంలోని కృష్ణకాంత్, వనస్థలిపురం మహవీర్, కేబీఆర్ సహా పలు పార్కులు ఆహ్లాదకరంగా మారాయి. అటు వికారాబాద్ ప్రాంతం కొత్త అందాలతో కనువిందు చేస్తోంది. HYD, RR, MDCL, VKBకి వాతావరణ శాఖ ఆరెంజ్, రెడ్ అలర్ట్స్ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల్లో అధికారులు, సిబ్బంది ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు.

News September 2, 2024

HYD: ట్రాఫిక్ అలర్ట్స్ చెప్పేందుకో FM RADIO

image

ట్రాఫిక్ జామ్ అయిందన్న వార్త తెలిస్తే ఈ వైపు వచ్చేవాళ్లం కాదుగా అని ట్రాఫిక్‌లో ఇరుక్కున్నప్పుడు సగటు వ్యక్తి అనుకునే ఉంటాడు. ఇక నుంచి ట్రాఫిక్ అలర్ట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు FM RADIO తరహాలో HYD పోలీసులు కమ్యూనిటీ రేడియోను ప్రారంభించనున్నారు. అంతేకాకుండా సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని సీపీ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

News September 2, 2024

HYD: ప్రయాణాలు చేసేవారికి ALERT

image

భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ, ఖమ్మం ప్రాంతాలకు వెళ్లాలనుకునే నగర ప్రజలు ప్రయాణం వాయిదా వేసుకోవాలని HYD ట్రాఫిక్ అదనపు కమిషనర్ పి.విశ్వప్రసాద్ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో విజయవాడ వెళ్లాలనుకుంటే చౌటుప్పల్, చిట్యాల, నార్కెట్‌పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా వెళ్లాలన్నారు. అత్యవసర పరిస్థితిలో సహాయానికి హైదరాబాద్ ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 9010203626 నంబర్ సంప్రదించాలన్నారు.