India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పరీక్షలంటేనే పరేషాన్ అవుతున్నారా? అయితే మీకోసం సైకాలజిస్టులు రెడీగా ఉన్నారు. తెలంగాణ పదో తరగతి విద్యార్థుల కోసం అడ్వాన్స్‌డ్ సైకలాజికల్ సర్వీసెస్ అసోసియేషన్ (APA ఇండియా) ఉచిత టెలి కౌన్సెలింగ్ ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 105 మంది నిపుణులు అందుబాటులో ఉండి, విద్యార్థుల ఒత్తిడిని దూరం చేస్తున్నారు. ఆందోళనగా ఉంటే వెంటనే 8008553069, 8686444200 నంబర్లకు కాల్ చేసి నిపుణుల సలహాలు పొందవచ్చు.

HYDలోని IT కారిడార్‌లో సైబరాబాద్ పోలీసులు ప్రయోగాత్మకంగా ‘AI క్రైమ్ ప్రిడిక్షన్’ వ్యవస్థను అమలు చేస్తున్నారు. గత నేరాల డేటాను విశ్లేషించి, రాబోయే 48 గంటల్లో గొడవలు జరిగే ప్రాంతాలను ఇది ముందే పసిగడుతుంది. ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాల ద్వారా అనుమానితుల కదలికలపై నిరంతరం నిఘా ఉంటుంది. అయితే, పబ్లిక్ సేఫ్టీ కోసం వాడుతున్న ఈ టెక్నాలజీ వివరాలను హోమ్ శాఖ ప్రస్తుతానికి అధికారికంగా ధ్రువీకరించలేదు.

లోక్‌సభ స్థానాల పెంపుపై TG అసెంబ్లీ నిరసన వ్యక్తం చేసింది. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే, నియంత్రణ పాటించిన మనకి అన్యాయం జరుగుతుందని ఏకగ్రీవ తీర్మానం చేశారు. సైబరాబాద్‌లో సీట్లు పెరిగినా, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం పార్లమెంట్‌లో తగ్గుతుందన్నది ఆందోళన. మల్కాజిగిరి, చేవెళ్ల MP స్థానాలను విభజించే క్రమంలో మహిళా రిజర్వేషన్ 33% అమలు చేయాల్సి ఉంటుంది. దీంతో రాజకీయంగా భారీ మార్పులకు లోనుకానుంది.

ఎలాంటి వసతులు లేకపోయినా పెద్దపెద్ద బండరాళ్ల మధ్యే షాపును ఏర్పాటు చేసుకొని జీవనోపాధి పొందుతోన్న ఓ వ్యక్తి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. మాదాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో బండరాళ్ల మధ్యే చిన్న టీ దుకాణాన్ని పెట్టుకొని ఆయన తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అరకొర షెడ్డుతో, రాళ్ల పక్కనే నిత్యం కూలీలు, కార్మికులు, ఉద్యోగులకు టీ అందిస్తూ కష్టజీవిగా గుర్తింపు పొందుతున్నాడు. ఆ కష్టమే ఆయనకు తోడుగా నిలుస్తోంది.

సర్కార్ అమలు చేసిన SC వర్గీకరణ ఇప్పుడు సైబరాబాద్ (CURE) రాజకీయాల్లో కీలకంగా మారింది. 15% రిజర్వేషన్‌ను 3 గ్రూపులుగా విభజించారు. CUREలోని శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్‌లో జనాభా ప్రాతిపదికన వర్గీకరణ అమలవుతుంది. సెన్సస్ తర్వాత SC కోటాను మరింత పెంచే ఛాన్స్ ఉందని సర్కార్ సంకేతమివ్వడంతో ఇక్కడి రిజర్వ్‌డ్ స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. ఓటర్ల సంఖ్య పెరిగాక కొత్త సీట్లలో కొన్ని SC/STలకు కేటాయించే అవకాశం ఉంది.

ఇద్దరు MPలు, 8మంది MLAలతో సైబరాబాద్ TG రాజకీయాలను శాసించే పవర్ హౌస్‌గా మారింది. GHMC పునర్విభజన తర్వాత CMC ఏర్పాటుతో డీలిమిటేషన్ చర్చ ముదిరింది. 8సీట్లను 12-15 వరకు పెంచే అవకాశముంది. ఓటర్ల సంఖ్యతో శేరిలింగంపల్లి 3, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్ రెండేసి సీట్లుగా విభజించే ప్రతిపాదనలున్నాయి. 31లక్షల ఓటర్లు దాటిన మల్కాజిగిరి MP స్థానాన్ని విభజించే ఛాన్స్ ఉంది. దీంతో గ్రేటర్ మ్యాప్ రిపేర్ కానుందని టాక్.

TGలో అసెంబ్లీ స్థానాలు 119 నుంచి <<19460921>>179కి<<>> పెరుగుతాయనే ప్రచారం నేపథ్యంలో HYD జిల్లాలోనూ సీట్ల సంఖ్య గణనీయంగా పెరగొచ్చనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం HYDలో 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ సంఖ్య 22 వరకు చేరే అవకాశం ఉందని ఆశావహ MLA అభ్యర్థులు భావిస్తున్నారు. అలాగే ఎంపీల సంఖ్యా పెరిగే ఛాన్స్ ఉంది. ఇవన్నీ ప్రాథమిక అంచనాలే జనగణన తర్వాతే తుది సంఖ్య ఖరారు కానుంది.
Sorry, no posts matched your criteria.