Hyderabad

News March 24, 2026

HYD: అందుకే మీకు నిద్ర పట్టనిది!

image

నగరవాసుల వర్క్ కల్చర్, అర్ధరాత్రి వరకు ఫోన్ వినియోగం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఉప్పల్‌కు చెందిన డా.రంజిత్ కుమార్ తెలిపారు. స్క్రీన్ టైమ్ పెరగడంతో నిద్రలేమి సమస్యలు తీవ్రంగా పెరుగుతున్నాయని స్లీపింగ్ పాటర్న్‌‌పై నిర్వహించిన సర్వేలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. రోజుకు 5 గం.కుపైగా స్క్రీన్ టైమ్ ఉన్నవారు నిద్ర సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. కొందరిలో నిద్ర నాణ్యత తగ్గుతోందని వివరించారు.

News March 24, 2026

హైడ్రా రంగనాథ్‌‌పై హైకోర్టు సీరియస్

image

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను బతుకమ్మకుంట భూమి వ్యవహారంలో కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు దోషిగా ప్రకటించింది. స్టేటస్ కో ఆదేశాలు ఉన్నప్పటికీ, వివాదాస్పద భూమిని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ నిర్మాణాలు చేపట్టడంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 4వారాల్లో అన్ని నిర్మాణాలు తొలగించి, పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. చట్టం, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన అధికారులపై కఠిన చర్యలుంటాయని స్పష్టంచేసింది.

News March 24, 2026

HYDలోకి మరో 4 గ్రామాలు!

image

వికారాబాద్ జిల్లాల్లోని నవాబ్‌పేట్, మోమిన్‌పేట్ మండలాల్లోని చిట్టిగూడ, యావపూర్, టేకులపల్లి, యంకతల గ్రామాలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంతో HMDA పరిధిలోని గ్రామాల సంఖ్య 1,359కి చేరింది. HMDA 11 జిల్లాలు, 104 మండలాలు, 1,359 గ్రామాలతో కలిపి 10,472.723 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.

News March 24, 2026

HYDలో 27న భారీ శోభాయాత్ర.. ‘హిందూ MLA’ పిలుపు

image

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని భాగ్యనగరంలో శ్రీరామ యువ సేన భారత్ ఆధ్వర్యంలో భారీ శోభాయాత్రను నిర్వహించనున్నారు. మార్చి 27, 2026 శుక్రవారం ఉదయం 10:30 గంటలకు ధూల్‌పేటలోని ఆకాశ్‌పురి హనుమాన్ మందిరం నుంచి ప్రారంభంకానుంది. రామ భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని, శోభాయాత్రను విజయవంతం చేయాలని రాజాసింగ్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన బ్యానర్‌లో ‘హిందూ MLA’ అంటూ ప్రత్యేకంగా రాయించారు.

News March 23, 2026

HYD: సోషల్ మీడియాపై కొత్త చట్టం!

image

సమాజంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘విద్వేష ప్రసంగాలు & నేరాల నిరోధక బిల్లు 2026’ను రూపొందించింది. మత విద్వేషాలను రగిల్చేలా మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా ప్రభుత్వం దీని ప్రకారం కఠిన చర్యలు తీసుకోనుంది. నేరం రుజువైతే ఒకటి నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తారు. అల్లర్లను అడ్డుకొని, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం.

News March 23, 2026

ఇక పార్కుల్లోనే.. HYDలో కొత్త ట్రెండ్

image

ఏంది భయ్యా.. ఇంకా ఆ AC రూముల్లో వెయిట్లెత్తుతున్నారా? అది పాత చింతకాయ పచ్చడి. ఇప్పుడు సిటీ కుర్రాళ్ల ట్రెండే వేరు. జిం ఫీజులు కట్టడం మానేసి.. పబ్లిక్ పార్కుల్లో ఇనుప రాడ్లు పట్టుకొని విన్యాసాలు చేస్తున్నారు. దీని పేరే ‘కాలిస్థెనిక్స్’. మజిల్స్ పెంచడం కాదు.. బాడీని గాల్లో తేల్చడమే అసలైన కిక్కంటున్నారు. KBR పార్క్ నుంచి గచ్చిబౌలి దాకా ఎక్కడ చూసినా ఈ బాడీ వెయిట్ బాపతే. ఈ సమ్మర్‌కి ఇదే అసలైన వైబ్ మరి.

News March 23, 2026

నేను CM అయితా.. సినిమాలో: మల్లారెడ్డి

image

రేవంత్‌ని CM చేసింది తానేనని, రెడ్డి సామాజికవర్గంలో అత్యంత పవర్‌ఫుల్ నాయకుడు అతనే అని అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డి చిట్ చాట్ చేశారు. తామిద్దరం అన్నదమ్ములం అని పేర్కొన్న మల్లారెడ్డి తన సినీ ఆశక్తులను కూడా పంచుకొన్నారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో విలన్ పాత్ర కోసం దర్శకుడు హరీశ్ శంకర్ అడిగినా ఒప్పుకోలేదు. సినిమాలో ముఖ్యమంత్రి పాత్ర చేయాలని ఉంది’ అని మల్లన్న మనసులో మాట చెప్పుకొచ్చారు.

News March 23, 2026

HYD: రియల్ ఎస్టేట్‌పై మూసీ బ్యూటిఫికేషన్‌ ఎఫెక్ట్..!

image

మూసీ సుందరీకరణ పేరుతో సర్కార్ నిర్ణయాలు రియల్ ఎస్టేట్‌ను వణికిస్తున్నాయి. సుమారు 1200 సర్వే నంబర్లు ధరణి పోర్టల్‌లో సైలెంట్‌గా బ్లాక్ చేసేశారని సమాచారం. ఇందులో దాదాపు 450వరకు భారీ వెంచర్లు, విల్లా ప్రాజెక్టులు ఉండటం గమనార్హం. FTL, బఫర్ జోన్ల సాకుతో సబ్-రిజిస్ట్రార్లకు అంతర్గత ఆదేశాలు జారీ కావడంతో రిజిస్ట్రేషన్లు ఆగాయి. ప్రభుత్వం అండర్ గ్రౌండ్ ఆంక్షలు విధించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.