India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చినుకు పడితే వణికే HYD ఈ 3 రోజులు జల ప్రళయం ఎదుర్కోక తప్పదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల 7 సెం.మీ నుంచి 10 సెం.మీ వాన కురిస్తే ముంపు ఏరియాలతో పాటు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ఇక నార్త్ HYDలో 20సెం.మీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మొన్న నమోదైన 15.15 సెం.మీ వర్షపాతంతో కుత్బుల్లాపూర్ అతలాకుతలమైంది. ఇప్పుడేమో <<17390735>>20 సెం.మీ<<>> అంటుంటే నగరవాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో డిప్లమా ఇన్ మ్యాజిక్ (ఇంద్రజాలం) కోర్సులో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు Way2Newsతో తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణత అయినవారు అర్హులని, నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. ఈ కోర్సును ప్రతిరోజు సాయంత్రం వేళల్లో నాంపల్లి ప్రాంగణంలో నిర్వహింపబడుతుందన్నారు. ఆసక్తి గలవారు 9059794553కు సంప్రదించాలన్నారు.
పాతబస్తీ మెట్రో ఆస్తుల సేకరణలో భాగంగా ఇప్పటి వరకు 412 నిర్మాణాలకు పరిహారం ప్రకటించినట్లు MD NVS రెడ్డి తెలిపారు. 380 ఇళ్లను కూల్చివేయగా రూ.360 కోట్ల పరిహారం చెల్లించినట్లు ఆయన వెల్లడించారు. త్వరలో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో కారిడార్ పిల్లర్లకు తగిన స్థలాల ఎంపిక చేసి మార్కింగ్ పనులు పూర్తి చేసి భూ సామర్థ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
గ్రేటర్‌లోని మూడు కమిషనరేట్ల పరిధి 78 ప్రాంతాల్లో పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. ఇవి కొన్నిచోట్ల పని చేయడం లేదని, రోడ్డు దాటాలంటే ఇబ్బందులు తప్పడం లేదని పాదచారులు వాపోతున్నారు. స్విచ్ బోర్డులు సైతం పని చేయడం లేదన్నారు. ఇదిలా ఉంటే మరో 135 చోట్ల కొత్త సిగ్నల్స్ ఏర్పాటు చేస్తామని ఇటీవల GHMC తెలిపింది. ముందు పాత బోర్డులు సరిచేసి, కొత్తవి ఏర్పాటు చేస్తే బెటర్ అని ప్రజలు అధికారులకు సూచిస్తున్నారు.
మలక్‌పేట, నల్గొండ చౌరస్తా నుంచి ఓవైసీ జంక్షన్ వరకు 2.58 కి.మీ పొడవైన స్టీల్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. ఈ పనులను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. మలక్‌పేట ఎమ్మెల్యేతో కలిసి పనుల పురోగతిని పరిశీలించిన ఆయన, ఇంజినీరింగ్ అధికారులకు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ బ్రిడ్జి పూర్తయితే రహదారి రద్దీ తగ్గనుంది.
MGBS నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రో విస్తరణ కోసం మొదట 1,100 ఆస్తులు సేకరించాల్సి ఉన్నట్లుగా మెట్రో రైలు సంస్థ తెలిపింది. ఇటీవల ఇంజినీరింగ్ నిపుణుల బృందం అలైన్‌మెంట్ సరిదిద్దడంతో ఆస్తుల సంఖ్య 900కు తగ్గినట్లుగా ఎండీ NVS రెడ్డి ప్రకటించారు. దీంతో ఆస్తుల కూల్చివేత, రోడ్డు విస్తరణ, పిల్లర్స్ మార్కింగ్ పనులు వేగంగా సాగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
గ్రేటర్ వ్యాప్తంగా రూ.897 కోట్ల వ్యయంతో కొత్త LED వీధి దీపాల ప్రాజెక్టును GHMC చేపట్టనుంది. ఈ ప్రతిపాదనను గురువారం జరిగే స్థాయి సంఘం సమావేశంలో ప్రవేశపెట్టి, సభ్యుల ఆమోదం పొందనుంది. అనంతరం టెండర్లు పిలిచి, ఆరు నెలల్లో పనులు పూర్తి చేయాలని అధికారులు యోచిస్తున్నారు. రేపు జరిగే సమావేశంలో దుకాణాల లీజు, ట్రాఫిక్ సిగ్నళ్ల నిర్వహణ, రోడ్ల నిర్మాణం వంటి అంశాలు కూడా చర్చించనున్నారు.
HYDలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. స్కూళ్లకు 2 రోజుల పాటు ఒంటిపూట, AUG 15న సెలవు పిల్లలకు కాస్త ఉపశమనమే. టైమ్ దొరికింది, హాఫ్ డే స్కూల్ సాకుతో ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లి వస్తామంటే పేరెంట్స్ జాగ్రత్త వహించండి. బయట వర్షాలు, వరద ముప్పు పొంచి ఉంది. గతంలో కళాసిగూడలో చిన్నారి మౌనిక నాలాలో పడి కొట్టుకుపోయింది. ఈ వానలో పిల్లలను షాపులకు సైతం పంపకండి. సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
SHARE IT
సమయపాలన లేకుండా భోజనం చేస్తున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే.! జాగ్రత్త. ఉదయం 8 గంటలకు వరకు తినాల్సిన బ్రేక్ ఫాస్ట్ మధ్యాహ్నం ఒంటి గంటకు, సాయంత్రం 4 గంటలకు లంచ్, రాత్రి 12 గంటలకు డిన్నర్ చేసి ఆ తర్వాత నిద్ర పోవడం శరీరంలో అనేక రుగ్మతలకు కారణం అవుతున్నట్లుగా కీసర డాక్టర్ సరిత తెలిపారు. మరోవైపు సమయపాలన మరవటం, శారీరక శ్రమ లేకపోవడం, ఫాస్ట్ ఫుడ్‌తో ఆరోగ్యం క్షీనిస్తుందన్నారు.
HYD నగర వ్యాప్తంగా నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రం హోం కల్పించాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ సంజయ్ కుమార్ కంపెనీలకు అడ్వైజరీ నోట్ విడుదల చేశారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. IT/ ITES ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుందన్నారు.
Sorry, no posts matched your criteria.