India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD యువతి చికాగోలో అర్థాంతరంగా తనువు చాలించింది. బాధితుల వివరాల ప్రకారం.. దుండిగల్ పరిధిలోని గండిమైసమ్మలో నివాసం ఉండే శ్రీనురావు పెద్ద కుమార్తె శ్రీజవర్మ (23) ఉన్నత చదువు కోసం చికాగో వెళ్లింది. అపార్ట్‌మెంట్‌కు పక్కనే ఉన్న రెస్టారెంట్‌లో తినడానికి రాత్రి నడుచుకుంటూ వెళ్తుంటే వెనకాల నుంచి ట్రక్ ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిందని బంధువులు వాపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
భారీ వర్షాలకు మైత్రివనం, స్వర్ణజయంతి కాంప్లెక్స్ సెల్లార్లలోకి వరద నీరు, వ్యర్థాలు వచ్చి చేరాయి. నీటిని తొలగించి చేతులు దులుపుకున్న అధికారులు వ్యర్థాల గురించి పట్టించుకోవడం లేదు. సెల్లార్లలో ఎక్కడా చూసినా అపరిశుభ్రతనే. దుర్వాసనతో స్థానిక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. CM ఇన్‌స్పెక్షన్ చేసిన ఏరియాలోనూ నిర్లక్ష్యం ఏంటని నిలదీస్తున్నారు. ఇకనైనా వ్యర్థాలను తొలగించాలని వ్యాపారులు కోరుతున్నారు.
నగర గల్లీల్లోని రోడ్లను మరమ్మతులు చేసిన వారం రోజులకే మళ్లీ అదే సమస్య ఉత్పన్నమవుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల కురుస్తోన్న వర్షాలకు కంకర తేలడంతో వాహనచోదకులు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్యాచ్‌వర్క్స్‌పై అనేకసార్లు ఫిర్యాదు చేసినా నామమాత్రంగా చర్యలు తీసుకుంటున్నారని వాహనాదారులు వాపోతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో ఈ సమస్య పునరావృతం అవుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై మీ కామెంట్?
నగరవాసులను హైడ్రా హెచ్చరించింది. నేటి నుంచి 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలను అప్రమత్తం చేసింది. ఆగస్టు 15న వెస్ట్ హైదరాబాద్‌కు వర్ష సూచన ఉందని తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో 04029560521, 9000113667, 9154170992 నంబర్లకు కాల్ చేయొచ్చని సూచించింది. ఇప్పటికే ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలు, వరదలకు మూసీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరదల్లో హైదరాబాదీ బీ కేర్ ఫుల్.
SHARE IT
నగర వ్యాప్తంగా నేడు సాయంత్రం భారీ వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం తెలిపినట్లు CYB పోలీసులు గుర్తు చేశారు. ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలన్నారు. మధ్యాహ్నం 3 గంటల్లోగా ఇళ్లకు చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలని పేర్కొన్నారు. సాయంత్రం షిఫ్ట్ ఉన్నవారు ఇంటి నుంచే పని(WFH) చేసేలా ప్లాన్ చేసుకుంటే బెటర్ అని సూచించారు.
SHARE IT
భారీ వర్షాల కారణంగా హిమాయత్‌సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీ నదిలో వరద ఉద్ధృతి పెరిగింది. ముందస్తు చర్యల్లో భాగంగా మంగళవారం ఉదయం అధికారులు మూసారాంబాగ్ బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. బ్రిడ్జికి ఇరువైపులా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. మూసీ పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
SHARE IT
ఈ నెల 27న ప్రారంభమై సెప్టెంబర్ 6న పూర్తి కానున్న గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లపై భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో GHMC ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపడుతున్నట్లు కమిషనర్ తెలిపారు. నిమజ్జనం వేగంగా, సాఫీగా పూర్తి చేసేందుకు గతేడాది కంటే ఎక్కువ క్రేన్‌లు కూడా ఉపయోగిస్తామని చెప్పారు.
సిటీలో మెట్రో సేవలకు అంతరాయం కలిగింది. ఆన్‌లైన్ టికెంట్ బుకింగ్ సాఫ్ట్‌వేర్‌లో టెక్నికల్ ప్రాబ్లం రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టికెట్ బుకింగ్ చేస్తున్న క్రమంలో UPI నాట్ వర్కింగ్‌తో పాటు ఇతర టెక్నికల్ సమస్యలు ఎదురవడంతో మెట్రో ప్రయాణానికి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ మరోసారి రాకుండా చూసుకోవాలని, సమస్యలుంటే ముందే సమాచారం ఇవ్వాలని గుర్రుమన్నారు.
HYDకు చెందిన లూసెంట్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అస్తులను ఈడీ జప్తు చేసింది. ట్రామడాల్ అనే నిషిద్ధ మాదక ద్రవ్యాన్ని పాకిస్థాన్‌కు ఎగుమతి చేసిందని ఆరోపణలతో చర్యలు తీసుకుంది. బెంగళూరు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇచ్చిన ఫిర్యాదుగా ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. లూసెంట్ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ జైన్, ఉపాధ్యక్షుడు సాయి వికాస్, గంగుల ఈశ్వర రావు ట్రామడాల్ విదేశాలకు పంపినట్లు గుర్తించింది.
అప్పటి వరకు ఇంటి ముందు ఆడుకున్న పాపాయిని ట్రాక్టర్ మృత్యువు రూపంలో కబలించింది. స్థానికుల వివరాలిలా.. రంగారెడ్డి జిల్లా యాచారం పరిధి మేడిపల్లి నక్కర్త గ్రామ పంచాయతీ ట్రాక్టర్ వన్నాడపు బీరప్ప కుమార్తె అవంతిక (3)ను ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Sorry, no posts matched your criteria.