Hyderabad

News August 21, 2024

HYD: రియల్ ఎస్టేట్‌లో మరో భూమ్: మంత్రులు

image

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో భూమ్ రాబోతుందని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు. HYD ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలంగాణ సదస్సు 2024 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు హాజరై మాట్లాడారు. స్థిరాస్తి వ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందన్నారు.

News August 21, 2024

ఈనెల 23న కోకాపేటకు సీఎం

image

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 23న కోకాపేటకు వస్తున్నారని హరేరామ హరేకృష్ణ సంస్థ నిర్వాహకులు తెలిపారు. కోకాపేట హరేరామ హరేకృష్ణ స్థలం ప్రాంగణంలో 430 అడుగుల ఎత్తుతో శ్రీకృష్ణ ఆలయం(హరేకృష్ణ హెరిటేజ్‌ టవర్‌) నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆలయ నిర్మాణంలో భాగంగా అనంతశేషస్థాపన పూజా కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా పాల్గొంటారని వారు తెలిపారు.

News August 21, 2024

HYD: పాఠశాలలకు 5రోజులు సెలవులు?

image

రానున్న 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో.. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం భారీ వర్షాల ప్రభావంపై రెవెన్యూ, విద్య, వైద్య, అగ్ని, పోలీసు శాఖ అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. పరిస్థితులను బట్టి ఆయా ప్రాంతాల అధికారులు పాఠశాలలకు ముందస్తు సెలవులు ప్రకటించాలని ఆదేశించారు.

News August 21, 2024

HYD నుంచి కటక్ వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు

image

HYD నగరం నుంచి కటక్ వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లుగా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. HYD నుంచి కటక్‌కు ప్రతి మంగళవారం (ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 17 వరకు) ట్రైన్ ఉంటుంది. కటక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చేందుకు ప్రతి బుధవారం (ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 18 వరకు) సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

News August 20, 2024

HYD: గణేశ్ మండపాలకు పర్మిషన్ తప్పనిసరి!

image

రానున్న వినాయకచవితి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మహంకాళి ఏసీపీ సర్దార్ సింగ్ అన్నారు. గణేశ్ మండప నిర్వాహకులతో మంగళవారం హర్యానాభవన్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. తప్పనిసరిగా పోలీసు నిబంధనలు పాటించాలన్నారు. అందుకు వినాయక మండప నిర్వాహకులు తమకు సహకరించాలన్నారు. సీసీ కెమెరాలు మండపంలో ఏర్పాటు చేసుకోవాలని, పోలీసుల అనుమతితోనే మండపాలు పెట్టుకోవాలన్నారు. సీఐ, ఎస్ఐలు పాల్గొన్నారు. SHARE IT

News August 20, 2024

ఈనెల 25న నాగోల్ మెట్రో వద్ద ధర్నా

image

కనీస సౌకర్యాలు లేని నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఉచిత పార్కింగ్ తొలగించడంతో ప్రయాణీకులకు ఆర్థిక భారం పెరుగుతుందని ఆవేదన చెందుతున్నారు. ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ ఆధ్వర్యంలో ఆగస్ట్ 25న ఉదయం 9 గంటలకు ఇక్కడ ధర్నా చేయనున్నట్టుగా తెలిపారు. వర్షానికి, ఎండకు వాహనాలకు రక్షణ కల్పించకుండా భారీగా వసూలు చేయడాన్ని నిరసిస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

News August 20, 2024

HYD: NCET ద్వారా ఈ నెల 25 వరకే ‘మనూ’ ప్రవేశాలు

image

మనూలో నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎన్సీఈటీ)లో అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రవేశాలను కల్పిస్తామని ‘మనూ’ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ వనజ సోమవారం తెలిపారు. ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. బీఎడ్(సెకండరీ) బీఎస్సీ బీఎడ్(ద్వితీయ) బీకామ్ బీఈడీ (సెకండరీ) కోర్సులకు దరఖాస్తులను కోరుతున్నామన్నారు. అభ్యర్థులు ఆగస్టు 25వ తేదీ వరకు అడ్మిషన్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

News August 20, 2024

HYD: ఈనెల 21న మెగా జాబ్ మేళా

image

రంగారెడ్డి జిల్లా నేషనల్ కెరీర్ సర్వీసెస్, డాన్ బాస్కో దిశ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 21న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఎన్పీఎస్ అధికారి విజయ్ కుమార్ సోమవారం తెలియజేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జాబ్ మేళా కొనసాగుతుందన్నారు. ఈ జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తామన్నారు.

News August 20, 2024

HYD: ‘ఆంధ్రావారికి అధ్యక్ష పదవిపై నేతల అసంతృప్తి’

image

కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం NSUI రాష్ట్ర అధ్యక్షుడిగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన యడవల్లి వెంకటస్వామిని AICC నియమించడంపై తెలంగాణ విద్యార్థి నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అధిష్ఠానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లేఖాస్త్రాలు సంధించారు. వెంకటస్వామిని తొలగించాలని, తెలంగాణ వ్యక్తికే అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని డిమండ్‌ చేశారు.

News August 20, 2024

HYD: ‘సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహమే సరైంది’

image

రాష్ట్ర సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం ఉండడమే చారిత్రక న్యాయమని పలువురు కవులు, కళాకారులు, రచయితలు, పాత్రికేయులు, మేధావులు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రొఫెసర్ హరగోపాల్, అల్లం నారాయణ, గోరటి వెంకన్న, మల్లేపల్లి లక్ష్మయ్య, నందిని సిధారెడ్డి, శ్రీధర్, దేశపతి శ్రీనివాస్, ఘంటా చక్రపాణి, తిగుళ్ల కృష్ణమూర్తి, ఏలె లక్ష్మణ్ తదితరులు సోమవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు.