India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

HYDలో ప్రజారోగ్యానికి చేటు చేస్తూ సాగుతున్న ఆహార కల్తీని అరికట్టేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ గురువారం ‘హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్’ (H-FAST)ను ప్రారంభించారు. 28 మంది సభ్యులతో కూడిన ఈ ప్రత్యేక విభాగం ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిఘా, దాడులు నిర్వహిస్తుంది. కల్తీపై సమాచారం ఇచ్చేందుకు 8712661212 అనే టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు.

ఉప్పల్ రింగ్ రోడ్డు త్వరలో బంద్ కానుంది. రామంతపూర్ నుంచి ఉప్పల్ మీదుగా వరంగల్ హైవే వైపు వెళ్లే మార్గంలో నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణపు పనుల్లో భాగంగా ఉప్పల్ రింగ్ రోడ్డు సెంటర్లో పిల్లర్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ అధికారుల బృందం పూర్తిగా స్టడీ చేసింది. త్వరలోనే రింగ్ రోడ్డు బంద్ చేసి, ట్రాఫిక్ మళ్లింపులు చేసి, కారిడార్ నిర్మాణాన్ని వేగవంతం చేయనున్నారు.

పెంపుడు పిల్లి మరణాన్ని తట్టుకోలేక బీఎస్సీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మీర్‌పేట్ PSపరిధిలో చోటుచేసుకుంది. బడంగ్‌పేట్‌లోని వెంకటాద్రి నివాస్‌కు హిమబిందు (20) తాను ఎంతో ఇష్టంగా పెంచుకొన్న పెంపుడు పిల్లి మృత్యువాత పడింది. ఇది తట్టుకోలేక పురుగు మందు తాగి హిమబిందు ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ప్రజా గొంతుకగా Way2News నిలుస్తోంది. మీ గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నెలకొన్న ప్రజా సమస్యలు, అక్రమాలు, అవినీతి, భూకబ్జాలు, ఇతర మోసాలపై మీరు ఎప్పటికప్పుడు Way2News ప్రజాగళం TG వాట్సాప్ నంబర్ 7995975252కు ఫొటోలు, వీడియోలతో కూడిన సమాచారాన్ని పంపించవచ్చు. వాటిని ప్రభుత్వ యంత్రాంగానికి తెలిసేలా పబ్లిష్ చేసి, పరిష్కారానికి కృషి చేస్తాం.
గమనిక: ఈ నంబర్ వాట్సాప్‌కు మాత్రమే, ఫోన్ కాల్ పనిచేయదు.

ఉగాది పర్వదినానికి ప్రతీకగా నిలిచే షడ్రుచుల సమ్మేళనమైన పచ్చడిలో కీలకమైన చేదు రుచి ఈసారి దుర్లభమైంది. ఫంగస్ తెగుళ్లు విస్తృతంగా ప్రబలడంతో వేపపువ్వు కొరత నెలకొంది. HYD నగరంతో పాటు పరిసర శివారు ప్రాంతాల్లోనూ వేపపువ్వు అందుబాటులో లేదు. కొందరు ఇతర జిల్లాల నుంచి తెచ్చిన వేపపువ్వును అధిక ధరలకు విక్రయిస్తున్నారు. చిన్న రెమ్మకే రూ.25 వసూలు చేస్తున్నారు. ఆన్లైన్‌లోనూ ‘నో స్టాక్’ పరిస్థితి నెలకొంది.

ఈసారి సిటీ కుర్రాళ్ల ఉగాది వైబ్స్ మామూలుగా లేవు బాసూ! యంగ్ జనరేషన్ పాత పద్ధతులకు క్రేజీ ట్విస్ట్ ఇస్తోంది. అల్మారాలోని పాత దుస్తులకు మోడరన్ కట్స్ ఇస్తూ సస్టైనబుల్ ఫ్యాషన్ అంటూ ఇన్‌స్టా రీల్స్‌లో షార్ట్& స్వీట్‌గా రాశిఫలాలు చూసేస్తున్నారు. పార్కుల్లో యోగా సెషన్స్‌తో హెల్తీగా కొత్త ఏడాదిని స్వాగతించనున్నారు. పచ్చడి రుచులతో ట్రెడీషన్ ప్లస్ ట్రెండ్.. ఇదీ మనోళ్ల ఉగాది పసంద్! మీ ఉగాది ప్లాన్ ఏంటి?

అంగన్వాడీ సిబ్బందికి జీతాల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఫిబ్రవరి గడిచి 18 రోజులైనా వేతనాలు ఇప్పటికీ అందలేదు. మరో 13 రోజుల్లో మార్చి నెల ముగియనుంది. ఉగాది, రంజాన్ పండుగల వేళ ఖర్చులకు నిధులు లేక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నామన్నారు. మాటల్లో ముద్దు, చేతల్లో శూన్యం అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

Sorry, no posts matched your criteria.