Hyderabad

News March 18, 2026

HYDలో గ్యాస్ కొరతలేదు: కలెక్టర్

image

HYDలో ఎల్పీజీ గ్యాస్‌కు కొరత లేదని కలెక్టర్ హరిచందన దాసరి తెలిపారు. ఆస్పత్రులు, హాస్టళ్లు, గృహ వినియోగదారులకు నిరంతర సరఫరా అందుతుందని వెల్లడించారు. పానిక్ బుకింగ్ చేయొద్దని, గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, సరఫరాపై బృందాలు నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నాయని తెలిపారు.

News March 18, 2026

HYD: ‘అగ్నివీర్‌’లో దరఖాస్తుల ఆహ్వానం

image

అగ్నివీర్ నియామకాలకు అర్హులైన యువత <>joinindianarmy.nic.in<<>>లో దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ రిక్రూట్‌మెంట్ సికింద్రాబాద్ కల్నల్ సునీల్ యాదవ్ తెలిపారు. పదిహేడున్నర నుంచి 22 ఏళ్ల మధ్య వయస్సు గల బ్యాచిలర్ పురుషులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, ట్రేడ్స్‌మన్ విభాగాల్లో ఎంపికలు జరగనున్నాయని, దరఖాస్తుల చివరి తేదీ ఏప్రిల్ 1, 2026 అని వెల్లడించారు.

News March 18, 2026

HYD: తెలంగాణ చరిత్రలో ఇదే తొలిసారి..!

image

ఇంజినీర్ల బదిలీలు అత్యంత పారదర్శకంగా ఉండేలా నీటిపారుదల శాఖ తీసుకున్న నిర్ణయం బహుశా తెలంగాణ చరిత్రలోనే తొలిసారి కావొచ్చు. బదిలీల్లో ప్రజాప్రతినిధుల సిఫార్సులు పనిచేయవని సర్క్యులర్‌ జారీ చేసింది. ఏదైనా సిఫార్సు లేఖతో సంప్రదిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. బదిలీల విషయమై అధికార పార్టీ నాయకుల నుంచి ఇంజినీర్ ఇన్ చీఫ్ వరకు భారీ సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

News March 18, 2026

‘వేదమందిర్’కు జ్యోతిష్కులు కావలెను!

image

ప్రముఖ ఆధ్యాత్మిక వేదిక ‘వేదమందిర్’ సేవలు మరింత విస్తరించేందుకు జ్యోతిష్కులను నియమించుకుంటోంది. మా లక్షలాది తెలుగు భక్తులకు సరైన మార్గదర్శనం చేసేందుకు నిపుణులైన జ్యోతిష్కులు (Astrologers) కావలెను.
– జ్యోతిషశాస్త్రంలో మంచి పట్టు
– విషయంపై స్పష్టమైన వివరణ ఇచ్చే నైపుణ్యం
మీరు జ్యోతిష్యంలో ప్రావీణ్యం ఉన్నవారైతే వెంటనే సంప్రదించండి!
Click on Whatsapp: <<7337592828>>73375 92828<<>>

News March 18, 2026

HYD: రూల్స్ జాన్తా నై.. ఎగ్జామ్ హాల్లోకి ఫోన్లు..!

image

పరీక్షా కేంద్రాల్లోకి ఫోన్లు తీసుకెళ్లడం నిషేధం. కానీ పదో తరగతి పరీక్షల నిర్వహణలో HYD, పెద్దపల్లి జిల్లాల్లోని 12% కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు బయోమెట్రిక్ హాజరు తర్వాత కూడా ఫోన్లను తమవద్దే ఉంచుకుంటున్నట్లు విజిలెన్స్ తనిఖీల్లో వెల్లడైంది. కొన్నిచోట్ల వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారం బయటకు వెళ్తోందన్న ఆరోపణలపై ఇప్పటికే అంతర్గత విచారణ నడుస్తోంది. కాగా, ఇది వ్యవస్థాగతమైన భద్రతా వైఫల్యంగా అర్థమవుతోంది.

News March 18, 2026

మూసీ ప్రక్షాళన: ఇళ్లు కూల్చకండి.. మురికిని వదలకండి!

image

ఏళ్లు గడుస్తున్నా మూసీలో మురుగు కంపు తగ్గలేదు కానీ, ప్రచార ఆర్భాటం మాత్రం పెరిగిపోయింది. గత 12 ఏళ్లలో నిధుల కేటాయింపులు కాగితాలకే పరిమితమయ్యాయని హైదరాబాద్ సిటిజన్ ఫోరం గళమెత్తింది. సుందరీకరణ పేరుతో వేలాది ఇళ్లను కూల్చడం సరికాదని, బఫర్ జోన్ సాకుతో పేదలను రోడ్డున పడేయొద్దని డిమాండ్ చేస్తోంది. అభివృద్ధి అంటే ఇళ్లు కూల్చడం కాదు, నదిని శుద్ధి చేయడం అని ఫోరం స్పష్టం చేసింది.

News March 18, 2026

మూసీ ప్రక్షాళన: ఇళ్లు కూల్చకండి.. మురికిని వదలకండి!

image

ఏళ్లు గడుస్తున్నా మూసీలో మురుగు కంపు తగ్గలేదు కానీ, ప్రచార ఆర్భాటం మాత్రం పెరిగిపోయింది. గత 12 ఏళ్లలో నిధుల కేటాయింపులు కాగితాలకే పరిమితమయ్యాయని హైదరాబాద్ సిటిజన్ ఫోరం గళమెత్తింది. సుందరీకరణ పేరుతో వేలాది ఇళ్లను కూల్చడం సరికాదని, బఫర్ జోన్ సాకుతో పేదలను రోడ్డున పడేయొద్దని డిమాండ్ చేస్తోంది. అభివృద్ధి అంటే ఇళ్లు కూల్చడం కాదు, నదిని శుద్ధి చేయడం అని ఫోరం స్పష్టం చేసింది.

News March 18, 2026

HYD: రీల్స్‌లో బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారా.. జాగ్రత్త!

image

SM వేదికగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన సెక్యూరిటీ గార్డు వెంకన్నను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొన్నారు. ఒక ప్రముఖ వార్తా సంస్థకు చెందిన సోషల్ మీడియా ‘రీల్’ కింద ఇతడు అత్యంత అసభ్యకరమైన కామెంట్ చేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి గచ్చిబౌలిలోని సైబర్ క్రైమ్ PSకి తరలించి విచారణ చేస్తున్నారు.

News March 18, 2026

హైదరాబాద్‌లో హోటళ్లు బంద్!

image

నగరంలో LPG సిలిండర్ల కొరతతో వ్యాపారాలు మూసేసే పరిస్థితి నెలకొంది. దాదాపు 2 వేల వరకు చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు మూసివేసినట్లు తెలుస్తోంది. కొన్ని హోటళ్ల నిర్వాహకులు రూ.10 నుంచి రూ.30 వరకు ఎక్స్‌ట్రా(గ్యాస్ ఛార్జ్) అని బోర్డులు పెట్టి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. LPG సిలిండర్లు అందుబాటులో లేకపోతే హోటళ్లు నడపడం కష్టమే అని, ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

News March 18, 2026

HYDని ఉర్రూతలూగిస్తున్న లేటెస్ట్ ట్రెండ్!

image

HYD అంటే బిర్యానీ, చార్మినార్ మాత్రమే కాదు! మారుతున్న కాలంతో పాటు మన నగరం సరికొత్త రూపు సంతరించుకుంటోంది. పాతతరం వారసత్వాన్ని నెమరేసుకుంటూనే, యువత ‘మీట్-అప్’ కల్చర్‌తో కొత్త బంధాలను అల్లుకుంటున్నారు. పండుగ ఏదైనా ప్రపంచమంతా ఇక్కడే ఉన్నట్లుగా జరుపుకోవడం మన ‘గంగా-జమునీ తెహజీబ్’ ప్రత్యేకత. పల్లె-పట్టణాల కలయికతో, ఆధునికతను ఆహ్వానిస్తూ.. సరికొత్త జోష్‌లో మెరిసిపోతోంది. HYD వైబ్ అంటే ఇలా ఉండాలి మరి!

↑