Hyderabad

News August 19, 2024

భట్టి విక్రమార్కకు రాఖీ కట్టిన మహిళా కమిషన్ చైర్మన్

image

డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మహిళ కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కల్వకుంట్ల రమ్యారావు, ఇతర మహిళా కాంగ్రెస్ నాయకురాలు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇది ఇందిరమ్మ రాజ్యంలో మహిళల సంక్షేమ ధ్యేయంగా మహిళలను చూసుకుంటుందని తెలిపారు. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

News August 19, 2024

సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మాజీ కార్పొరేటర్

image

సీఎం రేవంత్ రెడ్డికి రాంనగర్ మాజీ కార్పొరేటర్ ఆర్ కల్పనా యాదవ్ సోమవారం రాఖీ కట్టి తన సోదర భావాన్ని ఆయనతో పంచుకున్నారు. ఆడబిడ్డలకు అండగా ఉండే సీఎం రేవంత్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మాజీ కార్పొరేటర్ కల్పనా యాదవ్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలందరూ సీఎంకు అండగా నిలవాలని కోరారు.

News August 19, 2024

గాంధీ మెడికల్ స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్

image

గాంధీ మెడికల్ కాలేజీ గర్ల్స్​, బాయ్స్​ స్టూడెంట్స్‌తో పాటు రెసిడెంట్​ డాక్టర్ల కొత్త హాస్టల్​ భవనాలకు ప్రభుత్వం రూ.79.50 కోట్లు మంజూరు చేసినట్లు గాంధీ మెడికల్​ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొ.ఇందిర తెలిపారు. ఈనెల 24న గాంధీ మెడికల్ కాలేజీ ఆవరణలో నిర్మాణ పనులకు హెల్త్​ మినిస్టర్​ దామోదర రాజ నర్సింహా శంకుస్థాపన చేస్తారని తెలిపారు. TGMSIDC ఇంజినీరింగ్​ అధికారులతో కలసి ప్రిన్సిపల్​ స్థల పరిశీలన చేశారు.

News August 19, 2024

స్పీకర్‌కు రాఖీ కట్టిన మంత్రి సీతక్క

image

రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ MLA గడ్డం ప్రసాద్ కుమార్‌కు మంత్రి సీతక్క సోమవారం రాఖీ కట్టి స్వీట్ తినిపించారు. మంత్రి సీతక్కతో పాటు నారాయణపేట, సత్తుపల్లి శాసనసభ్యులు చిట్టెం పర్ణికా రెడ్డి, మట్టా రాగమయిలు తదితరులు రాఖీలు కట్టారు.

News August 19, 2024

HYD: పర్యావరణ పరిరక్షణకు ‘హైడ్రా’ తరహా వ్యవస్థ

image

పర్యావరణ పరిరక్షణకు ‘హైడ్రా’ తరహా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆదివారం కౌన్సిల్ అధ్యక్షుడు రంగయ్య మీడియాతో మాట్లాడారు. నెల కింద ఏర్పాటైన హైడ్రా అద్భుతాలు చేస్తోందని, పర్యావరణ పరిరక్షణ కోసం కూడా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలుగు రాష్ట్రాల సీఎం, డిప్యూటీ సీఎంలను కోరారు.

News August 19, 2024

HYD: వాహనదారులకు రాఖీ కట్టిన మహిళా పోలీసులు

image

HYD నగరంలోని రాచకొండ ట్రాఫిక్ మహిళా పోలీసులు వివిధ ప్రాంతాలలో రాఖీ పండుగ సందర్భంగా వాహనదారులకు రాఖీ కట్టారు. రాఖీ రక్షణకు గుర్తింపు అని మహిళా పోలీసులన్నారు. అనంతరం ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని, వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. వాహనదారులందరూ సంతోషంగా, క్షేమంగా గమ్యానికి చేరుకోవాలని కోరుకున్నట్టు తెలిపారు.

News August 19, 2024

మారేడ్ పల్లి: జూనియర్ అధ్యాపకుల వివరాల సమీకరణ

image

ఎస్సీ గురుకుల జూనియర్ కళాశాలల్లోని అధ్యాపకుల వివరాలు సొసైటీ సమీకరిస్తోంది. ఇటీవల బదిలీల ఆనంతరం ఎంత మంది అధ్యాపకులు పనిచేస్తున్నారు? ఖాళీల సంఖ్య ఎంత? ఎక్కడైనా పరిమితికి మంచి ఉన్నారా? వంటి గణాంకాలు వెంటనే ఇవ్వాలని సొసైటీ ప్రిన్సిపల్స్ ను ఆదేశించింది. సెంటర్ ఆఫ్ ఎక్స్టెన్స్ తో పాటు జనరల్, ఒకేషనల్ కళాశాలలు ఈ వివరాలు ఇవ్వాలని కోరింది. దీంతో ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉంది.

News August 19, 2024

నాంపల్లి: ఈనెల 24 వరకు గడువు పొడిగింపు

image

బీసీ గురుకుల ఫైన్ఆర్ట్స్ డిగ్రీ కళాశాల బీఏ(యానిమేషన్ వీఎస్ఎక్స్) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈనెల 24 వరకు పొడిగించినట్లు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు. ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులు బీసీ గురుకుల వెబ్సైట్ నుంచి దరఖాస్తు చేయాలని పేర్కొన్నారు. వివరాలకు 9032614463, 9063242329 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.

News August 19, 2024

మిర్రర్ ఇమేజ్ తరహాలో పాఠ్య పుస్తకాలు

image

మిర్రర్ ఇమేజ్ తరహాలో పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం అందజేస్తోంది. హైదరాబాద్ జిల్లాలోని 890 బడుల్లో 8, 9 తరగతి వారికి రెండేళ్ల నుంచి వీటిని అందిస్తున్నారు. పుస్తకంలో తొలిపేజీ ఆంగ్లం.. రెండో పేజీ తెలుగు, మూడో పేజీ ఆంగ్లం నాలుగో పేజీ తెలుగు ఇలా పుస్తకాలను ప్రచురించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇంగ్లిష్‌ను సులభంగా అర్థం చేసుకునేందుకు ద్విభాషా పాఠ్యపుస్తకాలు ఉపయెగపడుతున్నాయి.

News August 19, 2024

HYD: సమస్యలపై మహిళా కమిషన్ వద్దకు జూడాలు

image

తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారదతో ఉస్మానియా, గాంధీ జూడాలు సమావేశమయ్యారు. వైద్యులకు కావాల్సిన సౌకర్యాలు, భద్రత ఏర్పాట్లు చేయాలని వినతి పత్రం అందించారు. రాత్రి విధుల్లో ఉండే మహిళా వైద్య సిబ్బందికి, ప్రత్యేక విశ్రాంతి గదులు, టాయిలెట్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జూడాల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.