India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర ప్రభుత్వం GHMCకి కీలక బాధ్యతలు అప్పగించింది. TCURలో వరద నీటి నిర్వహణ విధానాలపై నివేదిక రూపొందించి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని పేర్కొంది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య ఉన్న ప్రాంతాన్ని తెలంగాణ కోర్ అర్బన్ అర్బన్ రీజియన్ (TCUR)గా ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. అనేక పరిశ్రమలు, వాణిజ్య కేంద్రాలు TCUR పరిధిలో ఉన్నాయి.
నగరంలో ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా నల్లాల్లో సరఫరా అయ్యే నీరు ఎక్కడైనా కలుషితమవుతోందా? అని జలమండలి అధికారులు నమూనాలు సేకరిస్తున్నారు. బోర్డు పరిధిలో మొత్తం 14.19 లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఈనెలలో ఇప్పటి వరకు దాదాపు 1,28,376 నల్లాల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షిస్తారు. ఇది నిరంతర ప్రక్రియ అని, వర్షాల నేపథ్యంలో ఎక్కువ నమూనాలు సేకరించామని వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు.
నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో వాటర్ బోర్డు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే మూడు రోజుల వరకు సెలవులు రద్దుచేస్తున్నట్లు ఎండీ అశోక్ రెడ్డి పేర్కొన్నారు. ఇదివరకే సెలవులు తీసుకున్న వారు కూడా విధుల్లోకి హాజరుకావాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. సమస్యలు ఉత్పన్నం కాకుండా ఎయిర్ టెక్ యంత్రాలు, సిల్ట్ కార్ట్ వాహనాలు అందుబాటులో ఉంచాలని అధికారులతో పేర్కొన్నారు.
మహానగరానికి తాగునీరందించే సింగూరు రిజర్వాయర్ ప్రమాదంలో పడింది. డ్యామ్ ఎగువ ప్రాంతంలో మరమ్మతులు చేయకపోతే ఆనకట్ట తెగే ప్రమాదముందని నిపుణుల కమిటీ తేల్చింది. ఇదిలాఉండగా రిజర్వాయర్లో 517.8 మీటర్ల వరకు నీటిని నిల్వ చేయొచ్చు. భగీరథ అవసరాల కోసం 520.5M వరకు నిల్వచేసుకోవచ్చని 2017లో ప్రభుత్వం GO ఇచ్చింది. ఇటీవల 522M వరకు నీటిని స్టోర్ చేయడంతో ఏ క్షణమైనా కట్టతెగే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తుండటంతో పోలీసు సిబ్బంది రిహార్సల్స్ ప్రారంభించారు. గోల్కొండ కోటలో పోలీసు సిబ్బంది, సాయుధ బలగాలు మార్చ్‌ఫాస్ట్ ప్రాక్టీస్ చేశారు. ఉన్నతాధికారులు రిహార్సల్స్ పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా వేడుకలకు కోటను ముస్తాబు చేసే పనులు సిబ్బంది ఇప్పటికే చేపట్టారు. జెండా వందనం జరిగే ప్రాంతంతోపాటు పరిసరాలను శుభ్రం చేశారు.
రాఖీ పౌర్ణమి సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTRకు లగచర్లకి చెందిన గిరిజన మహిళ జ్యోతి రాఖీ కట్టారు. ఆమె మాట్లాడుతూ.. ‘నా భర్తను ప్రభుత్వం అక్రమంగా జైలుకు పంపితే, ఆ కష్టకాలంలో KTR అన్న లెక్క నిలబడ్డారు. నేను గర్భిణిగా ఉన్నప్పుడు నా ఆరోగ్యం, క్షేమం చూసుకొని, నా బిడ్డకు మేనమామలాగా భూమి నాయక్’ అని పేరు పెట్టారు. దేవుడు ఇచ్చిన అన్న కేటీఆర్’ అని భావోద్వేగంతో రాఖీ కట్టారు.
HYD మౌంటెడ్ పోలీస్ విభాగంలో తొలిసారిగా 10 మంది మహిళా కానిస్టేబుళ్లు గుర్రాలపై గస్తీ చేపట్టారు. వీరు ప్రతీ శుక్రవారం పాతబస్తీలో విధులు నిర్వహిస్తారు. గోషామహల్‌లో శిక్షణ పొందిన వీరు చార్మినార్, మక్కా మసీద్, నెక్లెస్ రోడ్‌లలో గస్తీకాస్తారు. సీపీ సీవీ ఆనంద్ ప్రవేశపెట్టిన ఈ అశ్వదళం రోజు విడిచి రోజు డ్యూటీలో ఉంటారని సిటీ ఆర్డ్మ్ రిజర్వ్ డీసీపీ రక్షిత తెలిపారు.
భార్యభర్తలవి ఓ జన్మకు విడదీలేని ప్రేమలు అని ఓ ఇంగ్లిష్ కవి అన్నారు. అది ఇలాంటి భార్యభర్తలును ఉద్దేశించేనేమో! షాబాద్‌లోని హైతాబాద్‌లో HYDకు చెందిన అన్నె ప్రసాదరావు (83), పార్వతి (72) నివాసముంటున్నారు. బుధవారం అర్ధరాత్రి భర్త అస్వస్థతకు గురికావడంతో బంధువులు శంషాబాద్‌కు తరలిస్తుండగా మృతి చెందారు. భర్త మరణవార్త తెలియగానే పార్వతి గుండెపోటుతో మరణించిన విషాద ఘటన అక్కడి వారిని కంటతడి పెట్టించింది.
జూబ్లీహిల్స్ PSలో బాలుడి (17)పై పోలీసుల థర్డ్ డిగ్రీ ప్రయోగించారని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. డిసెంబర్ 15-17, 2024లో మధ్య అక్రమ నిర్బంధం, చిత్రహింసలపై బాధిత తండ్రి దగ్గుపాటి రాంబాబు HRCకి ఫిర్యాదు చేశారు. బాలుడి ఆరోగ్యం విషమంగా మారిందని అందులో పేర్కొన్నారు. ఈ కేసులో నివేదిక ఇవ్వాలని కమిషనర్ సీవీ ఆనంద్, నిమ్స్ సూపరింటెండెంట్‌లను కమిషన్ ఆదేశించింది.
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో నెలకొన్న పరిస్థితులపై HRC సీరియస్ అయింది. ఏడాదిగా లిఫ్టులు పనిచేయకపోవడం, వంట గదిలో పురుగులు, ఎమర్జెన్సీ బ్లాక్ సమస్యలు, మార్చురీలో శవాలు రోజుల తరబడి పేరుకపోవడం తదితర సమస్యలు HRC దృష్టికి వెళ్లాయి. ఆగస్టు 27 నాటికి సమగ్ర రిపోర్ట్ తయారుచేసి అందించాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించింది.
Sorry, no posts matched your criteria.