Hyderabad

News August 7, 2025

JNTU: ఆగస్టు 11 నుంచి తరగతులు

image

వివిధ ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్ సీట్లు పొందిన విద్యార్థులకు JNTUH అధికారులు బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. 2025-26 విద్యా సంవత్సరంలో సీటు పొందిన విద్యార్థులకు తరగతులు ఈ నెలలో ప్రారంభంకానున్నాయి. 11వ తేదీ నుంచి (సోమవారం) నుంచి రెగ్యులర్‌గా తరగతులు జరుగుతాయని పేర్కొంది. ఈ మేరకు వర్సిటీలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఇక కాలేజీకి వెళ్లేందుకు సిద్ధం కండి మరి.

News August 7, 2025

HYD: TG CPGET.. 4,238 మంది హాజరు

image

రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం 44 సబ్జెక్టులకు రాష్ట్ర స్థాయి కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ పరీక్షలు(TG CPGET) కొనసాగుతున్నాయి. ప్రతి రోజూ 3 సెషన్లలో ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నారు. బుధవారం 4 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 4,788 మంది అభ్యర్థులకు గాను 4,238 (88.51%) మంది హాజరైనట్లు ఉస్మానియా యూనివర్సిటీ TG CPGET డైరెక్టర్ పాండురంగారెడ్డి తెలిపారు.

News August 7, 2025

Monsoonలో మైసూరుకు వెళ్లే వారికి గుడ్ న్యూస్

image

Monsoonలో మైసూరుకు వెళ్లాలనుకునే వారికి రైల్వే అధికారులు గుడ్ న్యూస్ ప్రకటించారు. రేపటి నుంచి 30వ తేదీ వరకు మైసూరుకు ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్- మైసూరు ( 07033), మైసూరు నుంచి సికింద్రాబాద్ (07034) రైలు ప్రయాణికులను గమ్యం చేర్చనున్నాయి. అక్కడికి ప్రతీ సోమ, శుక్రవారాల్లో, సికింద్రాబాద్‌కు ప్రతీ మంగళ, శనివారాల్లో రైళ్లు బయలుదేరుతాయని సీపీఆర్‌వో తెలిపారు.

News August 7, 2025

HYD: నమ్రత అకౌంట్లలో భారీగా నగదు

image

సృష్టి ఫెర్టిలిటీ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. నమ్రతకు చెందిన 8 బ్యాంక్ అకౌంట్లలో పోలీసులు భారీగా నగదు గుర్తించారు. ఆమె అకౌంట్ నుంచి సంతోషి అకౌంట్‌కు భారీగా ట్రాన్సాక్షన్ జరిగనట్లు తెలిపారు. 2 రాష్ట్రాల్లో నమ్రత కూడబెట్టిన ఆస్తులను పోలీసులు గుర్తించే పనిలో పడ్డారు. నమ్రత ఆస్తులు వివరాలు కోరుతూ స్టాంప్& రిజిస్ట్రేషన్‌కు పోలీసులు లేఖ రాశారు.

News August 7, 2025

KPHB: రూ.7,500 కోసం గొడవ.. కత్తితో దాడి

image

కేపీహెచ్‌బీ కాలనీలో మణిమాల కిరాణా షాపు నిర్వహిస్తోంది. స్థానికంగా ఉండే రాజేష్‌రెడ్డి ఖాతా పెట్టి రూ.7,500 విలువజేసే వస్తువులు కొనుగోలు చేశాడు. నాలుగు నెలలుగా డబ్బులివ్వకపోవడంతో మణిమాల ఒత్తిడి చేసింది. దీంతో బుధవారం ఆమె ఇంటికెళ్లిన నిందితుడు దాడి చేశాడు. గొంతు నులిమి కత్తితో గొంతు కోసేందుకు యత్నించాడు. ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలయ్యాయి. మణిమాల ఫిర్యాదు మేరకు KPHB పోలీసులు కేసు నమోదు చేశారు. 

News August 7, 2025

JNTUH స్టాండింగ్ కమిటీలో కీలక నిర్ణయాలు

image

JNTUHలో 62వ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. UG, PG కోర్సులకు R-25 నిబంధనలు, సిలబస్, క్యాలెండర్‌లను ఆమోదించారు. ఇవి 2025-26 లో అమల్లోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. BTech 1st ఇయర్ తరగతులు, ఇండక్షన్ ప్రోగ్రామ్‌లు ఆగస్టు 11 నుంచి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 12-14 వరకు PhD ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈసారి ఉద్యోగుల కోసం ప్రస్తుత సెమెస్టర్‌లో PhD ప్రవేశాలు కల్పించనున్నారు.

News August 7, 2025

HYD: భవబంధాలను త్యజించిన 101 ఏళ్ల మహాసాధ్వి

image

ఒక్కపూట అన్నం లేకున్నా, గంట నిద్ర తక్కువైనా అల్లాడిపోతాం. అలాంటిది 40 ఏళ్లుగా యాదమ్మ (యాదమాత) తేనీరు, యోగాతో జీవిస్తున్నారు. ఇది అసాధ్యం అనిపిస్తున్నా ఆమె వయసు ఇప్పుడు 101 ఏళ్లు. భవ బంధాలను వదిలి HYD శివారులోని పర్వతాపూర్ నరసింహస్వామి సర్వస్వం అనుకుంటూ ఆయన సేవలో గడుపుతున్నారు. కేవలం ఓ కప్పు తేనీరు తాగి, యోగనిద్రలోనే జీవిస్తున్నారు. ఆమె శిష్యులకు తరుణోపాయాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

News August 7, 2025

HYD: OU క్యాంపస్‌లో రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌

image

OUలోని హ్యూమన్ క్యాపిటల్ డెవలప్‌మెంట్ సెంటర్(HCDC) OU క్యాంపస్‌లోని CFRD భవనంలోని e-క్లాస్‌రూమ్‌లో UG&PG విద్యార్థుల కోసం అగ్రతాస్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహించింది. దాదాపుగా 30 మందికిపైగా విద్యార్థులు ఈ డ్రైవ్‌లో పాల్గొన్నారు. నియామక పక్రియలో HR అధికారులు నిర్వహించిన గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఫలితాలు త్వరలో ప్రకటించనున్నారు.

News August 7, 2025

HYD: తెలుగు యూనివర్సిటీ.. పరీక్షల షెడ్యూల్ విడుదల

image

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో సెమిస్టర్-2 పరీక్షల షెడ్యూల్‌ను యూనివర్సిటీ విడుదల చేసింది. UG, PG చదువుతున్న విద్యార్థులకు ఈనెల 19 నుంచి 25 వరకు నిర్వహించనున్నారు. ఉ.11:00 నుంచి మ. 2:00 వరకు నాంపల్లి, బాచుపల్లి, వరంగల్ క్యాంపస్‌లో పరీక్షలు జరగనున్నాయి. శ్రీశైలం, రాజమండ్రి, కూచిపూడి క్యాంపస్ విద్యార్థులకు బ్యాక్ లాక్ పరీక్షలు హైదరాబాద్‌లోని బాచుపల్లి క్యాంపస్‌లో నిర్వహించనున్నారు.

News August 7, 2025

HYD: ఫెయిలైన డిగ్రీ విద్యార్థులకు ‘వన్ టైమ్ చాన్స్’

image

డిగ్రీ ఫెయిలైన విద్యార్థులకు సిటీ కాలేజీ మంచి అవకాశం కల్పిస్తోందని ప్రిన్సిపల్ తెలిపారు. 2007-19 మధ్య డిగ్రీ చదివి బ్యాక్‌లాగ్ సబ్జెక్టులను పూర్తి చేయలేకపోయిన విద్యార్థులకు వన్‌ టైం చాన్స్‌ ఇస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు సాధారణ పరీక్ష ఫీజుతో పాటు నిర్ణీత అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. దీనికి ఈ నెల 12 చివరి తేదీ అని, రూ.500 ఆలస్య రుసుంతో 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.